For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జాగ్రత్త! ప్రయాణ బడలిక కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది; దీన్ని అధిగమించడం ఎలాగో తెలుసుకోండి !

  By Gandiva Prasad Naraparaju
  |

  మీరు తరచూ ప్రయాణం చేసేవారైతే, ప్రయాణ బడలిక బారిన పడతారు. అయితే, విపరీతమైన ప్రయాణ బడలిక కలిగిన వారు కొంతమంది ఉంటారు, కానీ, అదేవిధంగా, దాని ప్రభావం అంతగా లేని అదృష్టవంతులు కూడా కొంతమంది ఉంటారు.

  వివిధ సమయాలలో ఎక్కువ దూరం, విదీసాలకు ప్రయాణం చేసేవారిలో ఈ ప్రయాణ బడలిక అనేది సర్వసాధారణం. సమయంలో మార్పుల వల్ల లోపల శరీరం ఇబ్బందులకు గురయ్యి, దానివల్ల ప్రయాణ బడలిక రావొచ్చు.

  వీటన్నిటి మధ్యలో, తరచూ ప్రయాణం చేసి ప్రయాణ బడలిక వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా సంభవించ వచ్చు అనే విషయాన్నీ కొత్త అధ్యయనాలు గుర్తించాయి.

  jet lag remedies

  అధ్యయనాల ప్రకారం, ఇది ఎందుకు సంభవిస్తుంది అంటే, ఇది శరీర గడియారాన్ని భంగపరిచి, అదే యంత్రాంగం ద్వారా నియంత్రి౦చబడుతుంది కాబట్టి ట్యూమర్ కి కారణం కావొచ్చు.

  శరీర లోపలి గడియారం కణాల పెరుగుదలలో ప్రధాన పాత్రను పోషిస్తుంది కాబట్టి, ఇది క్యాన్సర్ నివారించే శక్తిని కలిగి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

  అంతర్గత గడియారం బాహ్య కాంతి, డార్క్ సూచనలతో సమకాలీకరణలో ఉండి, ప్రజల ప్రవర్తన, స్థాయిలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అంతర్గత గడియారం దెబ్బతింటే, క్యాన్సర్ ప్రమాదానికి దారితీయవచ్చు.

  అధ్యయనం కోసం, పరిశోధకులు RAS గా పేరుగాంచిన ప్రోటీన్ ను విశ్లేషించారు, ఎలుకలలో, ఒక క్వార్టర్ క్యాన్సర్ సంబంధిత కణాలలో అనుచితంగా ఉత్తేజపరుస్తుంది.

  RAS శరీరంలోని కణాల పెరుగుదలను నియంత్రిచడమే కాకుండా, ప్రజల అంతర్గత శరీర గడియారంపై లేదా రోజువారీ దినచార్యపై ప్రభావం చూపిస్తుంది.

  క్యాన్సర్ ప్రమాదంతో పాటు, శరీర గడియారంలో వచ్చే మార్పుల వల్ల గుండె జబ్బులు, మధుమేహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

  ఇదికూడా చదవండి: క్యాబేజ్ నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

  అధ్యయనాలు ఈమధ్యనే PLOS బయాలజీ జర్నల్ లో ప్రచురించాయి.

  మరోవైపు, మీరు త్వరగా ప్రయాణ బడలికను పోగొట్టుకోవడానికి కొన్ని మార్గాల జాబితాను కింద ఇచ్చారు. చూడండి.

  1.హైడ్రేటెడ్ గా ఉండడం:

  1.హైడ్రేటెడ్ గా ఉండడం:

  మీరు తప్పక ప్రయాణం చేయవలసి వచ్చినపుడు ప్రయాణ బడలిక బారిన పడకుండా ఉండడానికి మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అవసరం. క్యాబిన్ లోపల ఉన్న గాలి వత్తిడి, తేమ లేకపోవడం వల్ల మీ శరీరం ఆర్ద్రతకు గురికావోచ్చు.

  కాబట్టి, మీరు విమానంలో ప్రయనిన్చేతపుడు సరిపడినన్ని నీరు లేదా నిమ్మ రసం తాగాలి, దీనివల్ల ప్రయాణం తరువాత మీ శరీరం హైడ్రేట్ గా ఉండి, ప్రయాణ బడలికను నివారించడానికి సహాయపడుతుంది.

  2.కెఫీన్ & ఆల్కాహాల్ తక్కువ గా తీసుకోవడం:

  2.కెఫీన్ & ఆల్కాహాల్ తక్కువ గా తీసుకోవడం:

  కాఫీ, ఆల్కాహాల్ తాగడం వల్ల మీ శరీరం తేలికగా హైడ్రేట్ అవుతుంది. విమానంలో, ప్రయాణం చేసే ముందు కాఫీ, ఆల్కాహల్ తక్కువ తీసుకోవడం మంచిది, దీనివల్ల ఇది డిహైడ్రేషన్ నివారణకు పోరాడి, ప్రయాణ బడలిక లేకుండా చేస్తుంది.

  3.ప్రతిరోజూ నడవడం:

  3.ప్రతిరోజూ నడవడం:

  మీరు విమానంలో ఎక్కువదూరం ప్రయాణం చేయాల్సి ఉంటె, రోజువారీ వ్యాయామాలు, మీ మోచేతులను, కాళ్ళను, మెడను వంచడం, కదిలించడం వంటివి చేయడం అవసరం. ఇది రక్తప్రసరణ మెరుగుపడడానికి సహాయపడుతుంది, ఇది కొంతమందిలో ప్రయాణ బడలికకు ప్రధాన కారణం కావొచ్చు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కాళ్ళల్లో వాపు, కండరాలు అలసిపోయి, నొప్పి రావడం వంటివి కూడా నివారించవచ్చు.

  4.నిద్రకు ఉపక్రమించడం:

  4.నిద్రకు ఉపక్రమించడం:

  ప్రయాణం చాలా అలసటతో కూడినది, ముఖ్యంగా మీరు ఎక్కువదూరం, రాత్రంతా ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు. కాబట్టి, అలాంటి పరిస్ధితుల్లో, మీరు ప్రయాణంలో మంచి నిద్రపోవడం అనేది ఎంతో ముఖ్యం.

  ఇది శరీర౦ విశ్రాంతిపొండడానికి సహాయపడి, ప్రయాణ బడలిక లక్షణాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. మంచి నిద్రను పొందడానికి, కళ్ళకు గంతలు, వెలుతురు, శబ్దాలు వినిపించకుండా చెవికి దూదులు పెట్టుకోవడం, లేదా నెక్ రెస్ట్ లు, ఎత్తుగా ఉండే తలగడలు చాలా సహాయపడతాయి.

  5.స్నానం చేయడం:

  5.స్నానం చేయడం:

  మీరు మీ గమ్యస్థానానికి చేరుకున్న తరువాత స్నానం చేయడం అనేది ప్రయాణ బడలిక ను పోగొట్టే ఉత్తమ మార్గాలలో ఒకటి. మీరు అర్ధరాత్రి మీ గమ్యస్థానాన్ని చేరుకుంటే, వేడినీటితో తప్పక స్నానం చేయండి.

  ఇది మీ ఉబ్బిన కండరాలకు విశ్రాంతిని ఇచ్చి, గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తరువాత శరీరంలో వేడిని తగ్గించడానికి సహాయపడి, చక్కటి నిద్ర, విశ్రాంతి పొందేట్లు చేస్తుంది.

  6.తేలిక బట్టలు వాడడం:

  6.తేలిక బట్టలు వాడడం:

  మీరు ప్రయాణం చేసేటపుడు, ముఖ్యంగా ఎక్కువ దూరం వెళ్ళేటపుడు, వదులుగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించండి. విమానం లోపల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులుగా ఉంటుంది కాబట్టి, క్యాబిన్ లోపల ఉండే పొడి గాలి మీకు దురదలను, అసౌకర్యాన్ని కూడా కలిగించ వచ్చు, మీరు బిగుతు దుస్తులు వేసుకుంటే భరించడం చాలా కష్టం.

  కాబట్టి, అనేక రకాల ప్రయాణ బడలికలు లేదా వికారం రాకుండా ఉండాలి అంటే, సౌకర్యవంతమైన బట్టలు ధరించడం చాలా ముఖ్యం.

  English summary

  Jet Lag Can Increase Cancer Risk, Ways To Overcome It

  Jet lag is very common among those who travel abroad and long distance to a different time zone. When the internal body clock gets disrupted due to a change in the time zone, this can cause jet lag. Following certain precautionary measures can help in preventing jet lag.
  Story first published: Monday, December 18, 2017, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more