For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక వాంఛలు తగ్గాయా? అయితే ఇలా చేయండి!

స్త్రీ, పురుషులిద్దరూ బాగా ఆనందించేది సెక్స్. శృంగారం దాంపత్య జీవితంలో కేవలం పునరుత్పత్తికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేందుకు ఇది బాగా తోడ్పడుతుంది. లైంగిక వాంఛలు ప్రతి వ్యక్తి

By Bharath
|

స్త్రీ, పురుషులిద్దరూ బాగా ఆనందించేది సెక్స్. శృంగారం దాంపత్య జీవితంలో కేవలం పునరుత్పత్తికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేందుకు ఇది బాగా తోడ్పడుతుంది. లైంగిక వాంఛలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఒకప్పుడు లైంగిక వాంఛలు బాగా ఉండి క్రమంగా అవి తగ్గిపోవడాన్ని లాస్‌ ఆఫ్‌ లిబిడో అంటారు.

లిబిడో లేదా లైంగిక వాంఛలు తక్కువగా అవడానికి చాలా కారణాలుంటాయి. మీ శరీరంలోని విటమిన్ డి తగిన స్థాయిలో ఉండాలి. లేదంటే మీలో సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది. మీలో విటమిన్ - డీ పెరిగితేనే మళ్లీ లిబిడో పెరుగుతుంది. దీంతో మీకు సెక్స్ లో పాల్గొనాలనే ఆసక్తి పెరుగుతుంది. కొన్ని ఆహారాలను తీసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. పుట్టగొడుగులు, కార్న్ ఫ్లేక్స్, ముయెస్లీ, గుడ్లు, మెకెరెల్, తృణధాన్యాలు వంటి వాటి వల్ల మీలో డీ - విటమిన్ పెరుగుతుంది. అలాగే పలు ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మీలో లిబిడో ( లైంగిక సామర్థ్యం, సెక్స్ పై కోరికలు) పెరుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఒక్కసారి చూద్దామా.

1. వెల్లుల్లి

1. వెల్లుల్లి

వెల్లుల్లిని మీలో సెక్స్ కోరికలను పెంచుతుంది. మహిళలు, పురుషుల్లో ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. వెల్లుల్లిలో అనిలిసిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. రోజూ మీరు తినే ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగిస్తూ ఉండాలి. లేదంటే వెల్లుల్లి రెబ్బలను తిన్నా మంచి శక్తి వస్తుంది.

2. డార్క్ చాక్లెట్లు

2. డార్క్ చాక్లెట్లు

స్వీట్స్ తినాలంటే చాలామంది భయపడుతుంటారు. కానీ పరిమితంగా తీసుకుంటే వీటివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. డార్క్ చాక్లెట్లలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి యోని, పురుషాంగాలకు సక్రమంగా రక్తాన్ని ప్రసరణ చేస్తాయి. దీంతో మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

3. పాలకూర

3. పాలకూర

ముదురు ఆకుకూరలు మీ ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడవచ్చేమోగానీ మీలో సెక్స్ కోరికలను పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పాలకూర తినడం వల్ల యోనికి రక్త ప్రసరణను మెరుగవుతుంది. మీలో లైంగిక వాంఛలు తక్కువగా ఉంటే మీరు పాలకూరను తరచుగా తింటూ ఉండండి.

4. గుడ్లు

4. గుడ్లు

ఎల్-అర్జినైన్ అనే రసాయనం గుడ్లలో ఉంటుంది. ఇది టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచుతుంది. మీలో లైంగిక వాంఛలు కలిగిలే చేస్తుంది. ఇక మగవాళ్లు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనే శక్తిని కూడా గుడ్లు ఇస్తాయి. త్వరగా వీర్య స్కలనం కాకుండా గుడ్లు బాగా ఉపయోగపడతాయి.

5. నట్స్

5. నట్స్

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైంగిక వాంఛల్ని, లిబిడోను పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. జీడిపప్పు, వేరుశెనగ, బాదం, పిస్తాపప్పులు వంటి వాటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టెరోన్ ఉత్పత్తి పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే లిబిడోను పెంచడానికి నట్స్ బాగా ఉపయోగపడతాయి.

6. రెడ్ వైన్

6. రెడ్ వైన్

రెడ్ వైన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీలో లైంగికవాంఛలు బాగా కలుగుతాయి. రెడ్ వైన్ లోని ఆమ్లజనకాలు శరీరంలో నైట్రిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. యోనికి రక్త ప్రసరణను పెంచడానికి రెడ్ వైన్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రెడ్ వైన్ ను ఎక్కువగా తాగుతూ ఉండండి.

English summary

lack of vitamin d affects your libido

If you have low sexual desire then here are some breakfast foods that may get you better luck in the sack as what we eat has a major influence on our sex drive.
Story first published:Saturday, November 25, 2017, 18:03 [IST]
Desktop Bottom Promotion