For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శృంగారం గురించి సైకాలజిస్ట్ లు ఇచ్చే 9 ముఖ్యమైన చిట్కాలు మీకు సహాయపడవచ్చు!

  By Gandiva Prasad Naraparaju
  |

  మీరు ఈ ఆర్టికిల్ టైటిల్ చదివిన క్షణం, మీరు కొద్దిగా ఆశ్చర్యానికి గురయ్యుంటారు ఎందుకంటే సైకాలజిస్ట్ లు శృంగారం గురించి సలహాలు ఇస్తారని చాలామంది ఆలోచించరు, అవునా?

  ముఖ్యంగా భారతదేశం లాంటి సాంప్రదాయ సమాజంలో, అన్ని నాగరిక అవకాశాలు, అభివృద్ది జరిగినప్పటికీ, ఇప్పటికీ శృంగారం అనే టాపిక్ మాట్లాడకూడని విషయమే!

  కాబట్టి, ఇప్పటికీ పడకగదిలో సమస్యలు ఉన్న ప్రజలు, ఎంతో ఇబ్బందికరంగా భావించి, చాలామంది బైటపడరు, నిపుణుల నుండి ఎటువంటి సహాయం తీసుకోరు.

  ఆరోగ్యకరమైన శృంగారానికి చిట్కాలు

  అయితే, మీరు మీ శృంగార సమస్యలను పరిశీలించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే శృంగార సమస్యలు మీ ఆరోగ్యంలో ఒక భాగం, చాలా కేసులలో, ఇది శారీరకమైన, మానశికమైన సమస్య కావొచ్చు!

  కాబట్టి, లైంగిక విషయంలో శారీరక, మానసిక పరిస్ధితులు ఎదురైనపుడు, వైద్యపరమైన జాగ్రత్తలు చాలా అవసరం.

  ఆమె/అతను శృంగార జీవితంలో సమస్యలు ఉంటే నిపుణుల సహాయం తీసుకోవాలి అనే విషయం గుర్తుంచుకోండి, ఈ లైంగిక అనారోగ్యం భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనేక నిరాశను, సమస్యలను తెచ్చిపెడుతుంది.

  మనందరికీ తెలుసు, ప్రతి మనిషీ సంతృప్తి చెందడానికి శృంగారం ఒక ప్రాధమిక అవసరం, అది జరగకపోతే, ముఖ్యంగా అనుబంధంలో ఉన్నపుడు, అది అసంతృప్తికి దారితీస్తుంది.

  tips for healthy sex

  ఈ అసంతృప్తులు, అసహనాలు అనుబంధాల ముగింపునకు కారణమవుతాయి!

  అంతేకాకుండా, లైంగిక అసమర్ధత ఒక వ్యక్తి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, ముఖ్యంగా పురుషులు, అంగస్తంభనను ఎదుర్కు౦టున్నపుడు!

  అదేవిధంగా, స్త్రీలు స్తబ్దత అనే పరిస్థితిని అనుభవిస్తారు, ఇందులో వారు లైంగిక సంపర్కాన్ని ఆస్వాదించలేరు, అనుభవించలేరు.

  సైకాలజిస్ట్ లు ఒత్తిడి వంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారో, శృంగార తెరపిస్ట్ లు శృంగార సమస్యలను అలా పరిష్కరిస్తారు.

  కాబట్టి, ఇక్కడ మీకు ఉపయోగపడే శృంగార ఆరోగ్య తెరపిస్ట్ లు ఇచ్చే కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి. వాటిపై దృష్టి పెట్టండి....

  చిట్కా#1: బాధపడాల్సిన అవసరం లేదు

  చిట్కా#1: బాధపడాల్సిన అవసరం లేదు

  మీ భాగస్వామితో లైంగిక సంపర్కం లేదా ఫోర్ప్లె చేసేటపుడు, మంచంపై మీరు ఎలా నిర్వహిస్తున్నారు, మీ భాగస్వామిని ఎలా ప్రేమిస్తారు అనేదాని గురించి చింతించకండి. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసి, ప్రేరేపణను తగ్గిస్తుంది. మీ భావాలను ప్రేరేపించి, అనుభూతులను ఆనందించే విషయాలపై దృష్టి పెట్టండి.

  చిట్కా#2: ఫోర్ప్లే తప్పనిసరి

  చిట్కా#2: ఫోర్ప్లే తప్పనిసరి

  జ్ఞానం లేకనో లేదా సమయం లేకనో చాలామంది, ఫోర్ప్లె చేయకుండా, నేరుగా సంభోగం చేస్తారు. ఇది ముఖ్యంగా స్త్రీలలో, ఉద్రేకం పెంచడంలో చాలా అసమర్ధతను నిరూపిస్తుంది. ఫోర్ప్లె అంటే ముద్దులు, ఒకరి జననాంగాలను ఒకరు ఉద్రేక పరుచుకోవడం వంటివి ముఖ్యమైన స్ధాయిలో ప్రేరేపణను పెంచుతాయి.

  చిట్కా#3: ఇష్టాలు/అయిష్టాలు గురించి మీ భాగస్వామితో మాట్లాడడం

  చిట్కా#3: ఇష్టాలు/అయిష్టాలు గురించి మీ భాగస్వామితో మాట్లాడడం

  పడక దగ్గర మీ ఇష్టాలు, అయిష్టాల గురించి మీ భాగస్వామితో తప్పక మాట్లాడండి. అదేవిధంగా, మీ భాగస్వామి శృంగార రుచులు, ఆశక్తుల గురించి తెలుసుకోండి. ఇది మీ లైంగిక జీవితంపై ప్రయోగిస్తే, మీ శృంగార జీవితం స్పైసీ గా ఉండి, శృంగార అవరోధాలను తొలగించుకోవచ్చు.

  చిట్కా#4: రోజంతా పక్కనే కొంతసమయాన్ని గడపడం

  చిట్కా#4: రోజంతా పక్కనే కొంతసమయాన్ని గడపడం

  మీరు మీ భాగస్వామితో శృంగార సంపర్కానికి సమయాన్ని కేటాయించడంలో సమస్యలు ఎదుర్కుంటుంటే, ప్రతి వారం కొంత సమయాన్ని కేటాయించండి, ముఖ్యంగా దానికోసం. ఎందుకంటే, ఎక్కువ కాలం శృంగార సంపర్కం జరగకపోతే, భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడి, అంగస్తంభనకు కారణమవుతుంది!

  చిట్కా#5: సహజ కామోద్దీపన ఆహార౦ తీసుకోవడం

  చిట్కా#5: సహజ కామోద్దీపన ఆహార౦ తీసుకోవడం

  స్ట్రాబెర్రీ,డార్క్ చాకోలేట్స్, వెల్లుల్లి వంటి సహజ కమోద్దీపనాలను కలిగి ఉన్న ఆహార పదార్ధాలు మీ ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఈ పదార్ధాలు సంభోగ సమయంలో జననాంగాలకు ఆక్సిజేనేటేడ్ రక్త ప్రసారాన్ని పెంచుతాయి, తద్వారా మీ అనుభూతి ఎంతో ఆరోగ్యంగా, మంచిగా ఉంటుంది!

  చిట్కా#6: అన్ని వస్తువులను పక్కన పెట్టడం

  చిట్కా#6: అన్ని వస్తువులను పక్కన పెట్టడం

  సంభోగం సమయంలో మీ ఫోన్ లను లేదా ఇతర సంబంధంలేని సంభాషణలు మానుకోండి. ఇది మీ మనసుని స్థిరంగా ఉంచి, మీరు పూర్తిగా పనిలోనే ఉన్నట్టు మీ భాగస్వామికి తెలుస్తుంది, తద్వారా ఎటువంటి అడ్డంకులు లేకుండా, ప్రేరేపణ స్థాయిలు అభివృద్ది చెందుతాయి.

  చిట్కా#7: ప్రతిరోజూ వ్యాయామం

  చిట్కా#7: ప్రతిరోజూ వ్యాయామం

  మీరు మీ భాగస్వామి ప్రతిరోజూ కొన్ని వ్యాయామాలు తప్పనిసరిగా చేయండి. వ్యాయామాలు జననాంగాలకు మెరుగైన రక్తప్రసరణను ఇచ్చి, ప్రేరేపణ పెంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాక, వ్యాయామం మెదడులో ప్రేరేపణను మెరుగుపరిచే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది!

  చిట్కా#8: సంభోగం ముందు జననాంగాల జోలికి వెళ్లొద్దు

  చిట్కా#8: సంభోగం ముందు జననాంగాల జోలికి వెళ్లొద్దు

  మీ భాగస్వామితో సంభోగంలో పాల్గొనే ముందు జననాంగాల జోలికి వెళ్ళకండి. సంభోగానికి ముందు వాటివైపు వెళ్తే క్లైమాక్స్ కి చేరుకుంటారు, ఇది మీ భాగస్వామితో శృంగార సమయంలో ప్రేరేపణ, స్ఖలనం కష్టమవుతాయి.

  చిట్కా#9: మీరు ఇష్టపడని దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు

  చిట్కా#9: మీరు ఇష్టపడని దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు

  చివరిగా, మీరు సంభోగ సమయంలో మీకు ఇష్టంలేని పనులను వత్తిడితో చేయకండి. అది మీ భాగస్వామిని ప్రేరేపించే మంచి పని అయినప్పటికీ, కొత్తవాటిని ప్రయత్నించడం, మీ స్వంత నియంత్రణలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల ప్రేరేపణ కూడా తగ్గవచ్చు.

  English summary

  Important Tips About Lovemaking Given By Psychologists

  Sexual health is just as important as the rest of your health. So, when you are experiencing issues with sex, it is important to seek professional help. Here are a few health tips on lovemaking as told by sexual health therapists to better your experience in bed!.
  Story first published: Monday, December 11, 2017, 18:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more