Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
లో-క్యాలరీ డైట్ ని పాటించడం వల్ల డయాబెటిస్ రాదు: స్టడీ
మీరు మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే అది ఇంకా దారుణంగా అవకుండా నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.మాములుగా మధుమేహం పెరుగుతూ ఉంటుందని మరియు కంట్రోల్ చేయబడదని చెబుతారు.
అయితే, ఒక కొత్త అధ్యయనంలో తక్కువ కాలరీల డైట్ ని తీసుకోవడం వలన డయాబెటిస్ను రివర్స్ లో తగ్గించవచ్చని కనుగొన్నారు.

UKలో న్యూకాజిల్ యూనివర్శిటీ లోని పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం, రకం 2 మధుమేహం కాలేయం మరియు ప్యాంక్రియాస్ రెండింటిలోనూ క్రొవ్వు ఎక్కువ అవడం ద్వారా వస్తుందని పేర్కొన్నారు.
ఇది ఇన్సులిన్ ని సరిగా స్పందించకుండా ఉండేలా కాలేయం కారణమవుతుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ ని తయారు చేసే సాధారణ ప్రక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. అప్పుడు కాలేయం చాలా గ్లూకోజ్ ని ఉత్పత్తి చేస్తుంది.
అదే సమయంలో, కాలేయంలోని అధిక కొవ్వు అన్ని కణజాలాలకు కొవ్వును ఎగుమతి చేసే సాధారణ ప్రక్రియను పెంచుతుంది. ఇలా చేయడం వలన ప్యాంక్రియాస్ లోని ఈ అదనపు కొవ్వు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే కణాలు విఫలం కావడానికి కారణమవుతుంది.

పరిశోధకులు కాలేయ కొవ్వు పదార్ధంలో లోతైన క్షీణతను గుర్తించారు, ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో చాలా తక్కువ కేలరీల తో మొదలయ్యి ఏడు రోజులపాటు తీసుకొనే ఈ డైట్ తో హెపాటిక్ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఏడు రోజులలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ నార్మల్ అవడాన్ని వారు కనుగొన్నారు.
ఎనిమిది వారాల్లో, పెరిగిన ప్యాంక్రియాస్ కొవ్వు పదార్ధం తగ్గిపోయింది మరియు ఇన్సులిన్ స్రావం మళ్లీ సాధారణ స్థాయి మొదటి దశ లోకి వచ్చి ప్లాస్మా గ్లూకోజ్ నియంత్రణ లో కి వచ్చింది.
"టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఒక శుభవార్త! మీకు ఒకవేళ 10 సంవత్సరాల పాటు ఈ డయాబెటిస్ కలిగివున్నప్పటికీ, మీరు క్లోమం యొక్క కొవ్వు ని అంతా ముఖ్యమైన చిన్న మొత్తం ద్వారా బయటకు తరలించడం ద్వారా రివర్స్ చేయగలిగే అవకాశముందని మా వర్క్ చూపిస్తుంది. "రాయ్ టేలర్, న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలో ని ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు. "ప్రస్తుతం, ఇది గణనీయమైన బరువు నష్టం ద్వారా మాత్రమే చేయబడుతుంది," టేలర్ చెప్పాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
