For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మగవారిలో గుండెపోటు సంభవిస్తాయని సూచించే సంకేతాలు!

  |

  జుట్టు ఊడిపోవటం మరియు బూడిద రంగులోకి మారడం అనేది మీరు వృద్ధాప్యములోనికి అడుగుపెడుతున్నారని దాని అర్థం. మీ వయస్సు 40 కి రాకముందే బట్టతలను కలిగి ఉండటం మరియు చాలా త్వరగా మీ జుట్టు బూడిద రంగులోకి వచ్చినట్లయితే, ఈ వ్యాసం గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పైన చెప్పిన కారణాలు ఆరోగ్యపరమైన ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలకు సంకేతమని చెప్పవచ్చు.

  ఒక కొత్త అధ్యయనం ప్రకారం, మగవారిలో అకాలంగా వచ్చే బట్టతల మరియు బూడిద రంగు జుట్టు (గ్రే హెయిర్) అనేవి పురుషులలో హృదయ ధమని వ్యాధి కావచ్చని సంకేతం !

  ఈ అధ్యయనం కోసం, పరిశోధకులు భారతదేశం లో 2,000 యువకులను పరీక్షించారు. ఇందులో పాల్గొనేవారిలో 790 మంది పురుషులు 40 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన కరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్న వారు కాగా, మరొక 1,270 ఆరోగ్యవంతమైన పురుషులు కలిగిన సమూహంగా వ్యవహరించారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థులకు - ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ECG), ఎఖోకార్డియోగ్రఫీ, రక్త పరీక్షలు మరియు కరోనరి ఆంజియోగ్రామ్ వంటి అన్ని క్లినికల్గా ఉన్న వారి గత చరిత్రను పరిగణనలోకి తీసుకున్నారు.

  Men! Identify These Warning Signs Of A Heart Disease

  కరోనరీ ఆర్టరీ వ్యాధి కలిగిన యువకుల యొక్క తాజా రిపోర్టులను - ఆరోగ్యకరమైన యువకులతో రిపోర్టులతో పోల్చితే, అకాలంగా వచ్చే గ్రేహెయిర్ (50 మరియు 30 శాతంగా) మరియు బట్టతల (49 మరియు 27 శాతంగా) నియంత్రణను కలిగి ఉన్నట్లుగా ఈ అధ్యయనంలో వెల్లడయింది.

  వయస్సును మరియు ఇతర కార్డియోవాస్కులర్ ప్రమాద కారకాలను సర్దుబాటు చేసిన తరువాత, ఆరోగ్యవంతమైన వ్యక్తి కన్నా - కరోనరీ ఆర్టరీ వ్యాధితో ఉన్న వారికి బట్టతల అనేది - 5.6 రెట్లు ఎక్కువగా ప్రమాదకరమైన స్థాయిలో ముడిపడివుంది మరియు ఆ కాలంలో వచ్చిన గ్రేహెయిర్ అనేది - 5.3 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన స్థాయిలో సంబంధమును కలిగి ఉంది.

  పరిశోధకుడిగా మరియు ప్రిన్సిపల్గా ఉన్న "డాక్టర్. కమల్ శర్మ" మాట్లాడుతూ, "అకాలంగా వచ్చే బట్టతలను మరియు బూడిద రంగు జట్టును; కొరోనరీ ఆర్టరీ అనే ప్రమాదకరమైన వ్యాధి కారకాలుగా పరిగణించాలి."

  యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ఈ అధ్యయనం కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) యొక్క 69 వ వార్షిక సదస్సులో సమర్పించబడినది.

  మరోవైపు, గుండె జబ్బు యొక్క ప్రధాన సంకేతాలను మరియు లక్షణాలను గురించి మరికొన్ని ముఖ్య విషయాలను తెలుసుకోండి. అవేమిటంటే,

  1. ఛాతీలో అసౌకర్యంగా ఉంటే :

  1. ఛాతీలో అసౌకర్యంగా ఉంటే :

  గుండె జబ్బు యొక్క మొట్టమొదటి మరియు సాధారణమైన లక్షణం "ఛాతీలో అసౌకర్యంగా" ఉండటం. ఏదైనా సమస్య వల్ల (లేదా) ధమనిలో ఒక రకమైన అడ్డంకి గాని ఉంటే, మీరు నొప్పిని, ఛాతీలో బిగువును మరియు ఒత్తిడిని కలిగి ఉంటారు.

  మీరు శారీరకంగా ఒత్తిడికి గురయినప్పుడు చాలా సమయాల్లో ఛాతీ భాగంలో ఇలాంటి నొప్పిని అనుభూతి చెంది ఉంటారు. ఇలా జరగటం అనేది సర్వసాధారణం. కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా ఈ నొప్పిని అనుభూతి చెందినప్పుడు మరియు ఆ నొప్పి తీవ్రత పెరుగుతూ దీర్ఘకాలంగా కొనసాగుతున్నట్లయితేే, మీరు గుండె సమస్యతో బాధపడుతున్నారనేందుకు ఇది ఒక సంకేతం కావచ్చు.

  2. అజీర్ణం & కడుపు నొప్పి:

  2. అజీర్ణం & కడుపు నొప్పి:

  కడుపు నొప్పి మరియు అజీర్ణం అనేవి సరైన ఆహారపు అలవాట్లను కలిగిలేని కారణంగా సంభవించవచ్చు. అయితే, మీరు ఎటువంటి కారణం లేకుండా, అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడం అనేది మొదలయ్యి, ఎక్కువ సమయం వరకూ అది కొనసాగినట్లయితే, అది మీ గుండె సమస్యను సూచించే సంకేతంగా ఉంటుంది.

  3. చేతులలో నొప్పి పుట్టటం :

  3. చేతులలో నొప్పి పుట్టటం :

  మీరు ఛాతీలో నొప్పిని అనుభూతిని చెందుతూ ఉన్నప్పుడు, ఆ నొప్పి బయటి వైపుగా కదులుతూ మీ శరీర భాగం యొక్క ఎడమచేతి వైపుగా క్రిందకు ప్రసరించినట్లయితే, అప్పుడు మీరు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. మీరు హృదయ సమస్య నుండి బాధపడుతున్నారనేందుకు ఇది ఒక సంకేతం.

  4. గురక:

  4. గురక:

  పురుషుల్లార, మీరు గాని చాలా బిగ్గరగా గురకను కలిగి ఉన్నటైతే, దాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. గ్యాస్పింగ్ (లేదా) ఊపిరి పెద్దగా తీసుకున్నట్లుగా ఉన్న గట్టి శబ్దాలు వంటివి "అప్నియాకు" సంకేతము కావచ్చు. ఈ కారణం చేత మీరు రాత్రివేళల్లో నిద్రలో ఉన్నప్పుడు, కావాలనే కొన్ని క్షణాల వరకు మీ శ్వాసను ఆపండి. అలా చెయ్యడం వల్ల ఇది మీ గుండె పైన అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

  English summary

  Men! Identify These Warning Signs Of A Heart Disease

  Principal investigator Dr Kamal Sharma said, "Baldness and premature greying should be considered risk factors for coronary artery disease." This study conducted by the European Society of Cardiology will be presented at the 69th Annual Conference of the Cardiological Society of India (CSI). Meanwhile, learn
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more