మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టిప్

Posted By:
Subscribe to Boldsky

తలనొప్పి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ఎదుర్కొంటుంటారు. తలనొప్పి వివిధ రకాల కారణాల వస్తుంటుంది. సరిగా ఆహారం తీసుకోకపోయినా, శరీరం డీహైడ్రేషన్ కు గురైనా, ఎండలో ఎక్కువ తిరడం వల్ల, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల, ఇతర సాధారణ జబ్బుల కారణంగా కూడా తలనొప్పి వస్తుంటుంది. తలనొప్పి కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. సాధారణంగా వచ్చే తలనొప్పి, తరచూ ఇబ్బంది కలిగించే తలనొప్పి. తరచూ ఉదయం , సాయంత్రంలో ఒకే సమయానికి ఇబ్బంది కలిగిస్తూ వచ్చే తలనొప్పినే మైగ్రేన్ హెడ్ ఏక్ అంటుంటారు. ఈ తలనొప్పి స్ట్రెస్ వల్ల వస్తుంది. అలాగే కొంత మందిలో ఎక్కువ ఎండలో తిరడగం, కొందరిలో ఫుడ్స పాయిజనింగ్ వల్ల వస్తుంది .

తలనొప్పి ఏరకంగా వచ్చినా.. చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు. ఇది టోటల్ గా మనిషిని కొన్ని గంటల పాటు క్రుంగదీసేస్తుంది. వెంటనే పిల్స్ తీసుకుని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు .

నిరంతరం పిల్స్ తీసుకోవడం ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు, పిల్స్ వాడటం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడాల్సి వస్తుంది. కొన్ని రకాల మందులు కాలేయంను దెబ్బతీస్తాయి. కొన్ని కిడ్నీల మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి, అటువంటి ఇన్ స్టాంట్ పిల్స్ తీసుకోకుండా..కొన్ని సింపుల్ రెమెడీస్ తో వెంటనే తలనొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి..

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

హిమాలయ సాల్ట్ తీసుకోవాలి. ఇది చూడటానికి పింక్ కలర్ లో ఉంటుంది. ఇది మనం నిత్యం వంటలకు ఉపయోగించే రెగ్యులర్ ఐయోడిన్ కాదు. బయట మార్కెట్లో దొరుకుతుంది. హిమాలయన్ సాల్ట్ చూడటానికి పింక్ కలర్ లో ఉంటుంది. ఈ సాల్ట్ తో పాటు ఒక నిమ్మకాయ తీసుకోవాలి.

ఎలా తీసుకోవాలి..

ఎలా తీసుకోవాలి..

ఒక గ్లాసులో నిమ్మరసం పిండుకోవాలి. దీనికి రెండు టీస్పూన్ల హిమాలయన్ సాల్ట్ ను మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ అయ్యే వరకూ స్పూన్ తో కలబెట్టాలి. దీనికి కొద్దిగా వాటర్ చేర్చి మిక్స్ చేయాలి. ఉప్పు పూర్తిగా కరిపోయేలా చూసుకోవాలి .

తర్వాత ఏం చేయాలి:

తర్వాత ఏం చేయాలి:

ఈ మిశ్రమాన్ని , కొన్ని నిముషాలు అలాగే ఉంచి తర్వాత తాగాలి. తాగిన కొద్దిసేపటికే మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలిగిన భావన మీలో కలుగుతుంది.

హిమాలయన్ సాల్ట్ గురించి :

హిమాలయన్ సాల్ట్ గురించి :

హిమాలయన్ సాల్ట్ లో 84 శాతం మినిరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. శరీరంలో ఆల్కలైన్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తుంది. మరింత బెటర్ గా ఫీలయ్యేందుకు సహాయపడుతుంది .

మరో హోం రెమెడీ :

మరో హోం రెమెడీ :

ఒక గ్లాసులో టండర్ కోకనట్ వాటర్ తీసుకుని అందులో చిటికెడు పింక్ హిమాయలన్ సాల్ట్ మిక్స్ చేయాలి. అందులోనే కొన్ని చుక్కల నిమ్మరసం కూడా మిక్స్ చేసి, ఈ రెండింటి బాగా బ్లెండ్ చేయాలి. సాల్ట్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత తాగాలి.

డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి ?

డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి ?

తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం అని ఇదివరకే తెలుసుకున్నాము. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి వస్తే ఈ రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .

ఇతర బెనిఫిట్స్

ఇతర బెనిఫిట్స్

ఈ సింపుల్ రెమెడీస్ కేవలం తలనొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, శరీరంలో మినిరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు, కాలేయంలోని టాక్సిన్స్ ను డిటాక్సిఫై చేస్తుంది. దాంతో కాలేయం ఆరోగ్యం ఉంటుంది.

English summary

Migraine Headache? Try This!!

Migraine Headache? Try This!!,There are so many types of headaches. Some of them could be migraine and some of them could be a result of stress. Some headaches could also be due to sun exposure and some could be due to food poisoning.
Story first published: Monday, March 20, 2017, 18:00 [IST]