కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా? పొర‌పాటున కూడా ఇలా చేయ‌కండి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

కాంటాక్ట్ లెన్స్ వాడేవారు చాలా మంది వాటి ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వారు కొన్ని అల‌వాట్లు మానుకోవాలి లేక‌పోతే రానురాను తీవ్ర కంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే ప్ర‌మాద‌ముంది.

కాంటాక్ట్ లెన్స్‌లు అనేవి వైద్య‌ప‌ర‌మైన‌వి. వాటిని ఎలాంటి జాగ్ర‌త్త‌లు లేకుండా తీసేయ‌డం, పెట్టుకోవ‌డం లాంటివి చేయ‌కూడ‌దు. కొంద‌రు వాటిని క‌ళ్ల‌లోప‌ల అమ‌ర్చుకొని ఇక దాని గురించి మ‌ర్చిపోతుంటారు.

కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చెయ్యడానికి సులభ మార్గాలు

ఇలా చేయ‌డం వ‌ల్ల క‌నుపాప‌ల‌కు చాలా ప్ర‌మాదం. కాంటాక్ట్ లెన్స్ పట్ల అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. అదే విధంగా ఇప్ప‌టి దాకా వాటిని స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండా ఉప‌యోగిస్తే వెంట‌నే ఆ అలవాట్ల‌ను దూరం చేసుకోవాలి.

చాలా మంది స‌ర్వ‌సాధార‌ణంగా చేసే పొర‌పాటు కాంటాక్ట్ లెన్స్‌ల‌ను అలాగే ఉంచుకొని ప‌డుకోవ‌డం. అలా క‌నుక చేస్తున్న‌ట్ల‌యితే కార్నియా అల్స‌ర్లు, కంటి ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది.

ఇక ఇత‌ర పొరపాట్ల‌లో భాగంగా లెన్స్‌ను న‌ల్లా నీళ్ల కింద క‌డ‌గ‌డం లాంటివి అస్స‌లు చేయ‌కూడ‌దు. వాటి కోసం ప్ర‌త్యేకంగా కేటాయించిన సొల్యూష‌న్ మాత్ర‌మే వాడాలి.

కాంటాక్ట్ లెన్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు

వాడాల్సిన స‌మ‌యం కంటే ఎక్కువ‌గా వాడినా న‌ష్ట‌మే. ఈ క‌థ‌నంలో కాంటాక్ట్ లెన్స్‌న‌కు సంబంధించి కొన్ని సాధార‌ణ పొర‌పాట్లు వాటిని నివారించే మార్గాల గురించి తెలుసుకుందాం.

లెన్స్‌ల‌ను ఎక్కువ‌సేపు వాడితే..

లెన్స్‌ల‌ను ఎక్కువ‌సేపు వాడితే..

వైద్యులు సిఫార‌సు చేసిన స‌మ‌యం కంటే ఎక్కువ సేపు లెన్స్‌ల‌ను క‌ళ్ల‌ల్లో ఉంచుకోవ‌డం అంత మంచిది కాదు. చాలా మంది లెన్స్‌ల‌తో కంటికి ఇబ్బంది క‌లిగిన‌ప్పుడే వాటిని కాసేపు తొల‌గిస్తారు. ఇది అన్నివేళలా మంచిది కాదు. ఎంత సేపు ఉంచుకోవాలో అంతే సేపు ఉంచ‌డం మేలు.

తాకే ముందు చేతుల శుభ్రం

తాకే ముందు చేతుల శుభ్రం

చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోకుండా లెన్స్ ముట్టుకుంటే కార్నియ సంబంధిత ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. కాబ‌ట్టి లెన్స్‌ను తీసే ముందు, పెట్టుకునే ముందు చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం ముఖ్యం.

త‌డి చేతుల‌తో అలాగే...

త‌డి చేతుల‌తో అలాగే...

చేతులు శుభ్రంగా క‌డుక్కుంటే స‌రిపోదు. లెన్స్‌ను తాకే ముందు చేతులు బాగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. త‌డి ఉంటే అనేక ర‌కాల సూక్ష్మ‌క్రిములు పెరుగుతాయి. అవి లెన్స్ ద్వారా కంటిలోకి చేరే ప్ర‌మాద‌ముంది. అందుకే చేతుల‌ను కూడా పొడిగా మారే దాకా వేచిచూడాలి.

వాటితోనే నిద్ర‌పోతున్నారా

వాటితోనే నిద్ర‌పోతున్నారా

కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రించేవారు మామూలు వారితో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ‌గా కార్నియా సంబంధిత రుగ్మ‌త‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. ఇది వ‌ర‌కే చెప్పిన‌ట్టు డాక్ట‌ర్లు సిఫార‌సు చేసిన దానికంటే ఎక్కువ స‌మ‌యం లెన్స్ వాడితే ప్ర‌మాదాలు కోరి తెచ్చుకున్న‌ట్టే. ఇలా కాంటాక్ట్ లెన్స్‌తోనే ప‌డుకొనే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.

సొల్యూష‌న్‌తో జాగ్ర‌త్త‌

సొల్యూష‌న్‌తో జాగ్ర‌త్త‌

కాంటాక్ట్ లెన్స్ శుభ్ర‌ప‌రిచేందుకు వాడే సొల్యూష‌న్ మంచి డిస్ ఇన్‌ఫెక్టెంట్‌. అది చాలా మంచిది. అయితే దానిని మూత తెరిచి అలాగే ఉంచితే బ్యాక్టీరియా చేరే ప్ర‌మాద‌ముంది. అదే విధంగా అదే సొల్యూష‌న్‌ను లెన్స్ శుభ్ర‌ప‌రిచేందుకు ఉప‌యోగిస్తే ఇక బ్యాక్టీరియాను కోరి పెంచుకున్న‌ట్టే.

కేస్‌ను శుభ్రంగా...

కేస్‌ను శుభ్రంగా...

కాంటాక్ట్ లెన్స్‌ను భ‌ద్ర‌ప‌ర్చుకునే కేస్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. బ్యాక్టీరియాకు త‌డి అంటే ఇష్టం. కార్నియా అల్స‌ర్‌తో ఆసుప‌త్రిపాలు కాకుండా మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకునేందుకు కాంటాక్ట్ లెన్స్‌ల‌ను త‌డి లేకుండా పొడిగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

నోట్లో పెట్టుకుంటున్నారా...

నోట్లో పెట్టుకుంటున్నారా...

నోరు అనేక బ్యాక్టీరియాల‌కు నిల‌యం. నోట్టో లెన్స్ పెట్టుకొని అలాగే కళ్ల‌ల్లో పెట్టుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం. అది ఇన్పెక్ష‌న్ల‌కు దారి తీయ‌వ‌చ్చు.

మేక‌ప్ అలాగే వ‌దిలేస్తున్నారా...

మేక‌ప్ అలాగే వ‌దిలేస్తున్నారా...

క‌ళ్ల‌కు ఐ లైన‌ర్ వేసుకునేట‌ప్పుడు కాస్త పెన్సిల్ మ‌ర‌క‌లు లెన్స్‌కు తాకే అవ‌కాశ‌ముంది. అలా జ‌రిగితే వెంట‌నే క్లీన్ చేసుకోవ‌డం ముఖ్యం. డిస్ ఇన్ఫెక్టెంట్ వాడి శుభ్రం చేసుకోవాలి.

న‌ల‌క‌గా ఉన్నా కూడా...

న‌ల‌క‌గా ఉన్నా కూడా...

క‌ళ్లు ఎర్ర‌గా ఉండి న‌ల‌క‌గా ఉండి ఇరిటేష‌న్ క‌లిగిస్తున్నా స‌రే కొంద‌రు కాంటాక్ట్ లెన్స్‌ను బ‌య‌ట‌కు తీయ‌రు. కాంటాక్ట్ లెన్స్ చిరిగిపోతే ఇలా జ‌ర‌గ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది, కాబ‌ట్టి జాగ్ర‌త్త‌.

ష‌వ‌ర్ బాత్ చేసేప్పుడు

ష‌వ‌ర్ బాత్ చేసేప్పుడు

ష‌వ‌ర్ కింద‌, వేడి నీళ్ల ట‌బ్బులో, స్విమ్మింగ్ పూల్‌లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. అవి మీ క‌ళ్లకు ప్ర‌మాద‌క‌రం. కాంటాక్ట్ లెన్స్ వాడేవారికి ఇది సున్నిత‌మైన విషయం. ఏ కొంచెం అజాగ్ర‌త్త‌గా ఉన్నా చూపు పోయే ప్ర‌మాద‌ముంది.

కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్లు మ‌రి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయి మీ క‌ళ్ల‌ను సంర‌క్షించుకుంటారు క‌దా!

English summary

Common Contact Lens Mistake To Avoid

Get rid of these common contact lens mistakes that you're making to protect your vision. Read to know what are the contact lens mistakes to avoid.
Story first published: Sunday, October 22, 2017, 9:00 [IST]
Subscribe Newsletter