వర్షాకాలంలో హెల్తీగా ఉండాలంటే ఈ హోం మేడ్ డికాషన్ ఒక్కటి చాలు..

By: Mallikarjuna
Subscribe to Boldsky

వర్షాకాలంలో జలుబు చేయడం సాధారణం. అయితే దుమ్ము, ధూళి, పొగ, చల్లటి గాలి వలన కలిగే ముక్కు సమస్యను తేలికగా తీసివేయకూడదు. వాతావరణంలో అనేక రకాల సూక్ష్మక్రిములు (Viruses) వుంటాయి. అందులో రినో వైరస్, ఎడినో వైరస్, ఇతర వైరస్‌లు వుండవచ్చు. వాటి బారిన పడితే జీవిత కాల సమస్యలుగా వుండిపోతాయి. కనుక అవి సోకకుండా జాగ్రత్తలు పాటించడం అవసరం.

సాధారణ జలుబు అంటే వాతావరణ మార్పువల్ల వచ్చే జలుబు వారంలో తగ్గిపోతుంది. మందులు వాడితే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది అనే 'జోక్'వాస్తవమయినప్పటికీ, అంతకుమించి, తలనొప్పి, ముక్కు బిగవేత, ముక్కు వెంట ద్రవం కారడం, తుమ్ములు, గొంతు మంట వంటి లక్షణాలు వుంటే ఏదైనా వైరస్ కారణమని భావించి వైద్య సలహా పొంది జాగ్రత్తపడాలి.

వర్షాకాలంలో చేపలు తినడం మంచిదేనా?

natural health drink for monsoon

'కషాయం' ఈ పదం చాలా పాపులర్. ముఖ్యంగా సౌత్ ఇండియన్ విలేజస్ లో బాగా ప్రసిద్ది. కషాయం అంటే ఇది గొప్ప ఔషధగుణాలున్న పానీయం. నీటిలో ఏదైనా మూలికలు, లేదా మసాలా దినుసులు వంటివి వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని కషాయం అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది.

natural health drink for monsoon

రెగ్యులర్ గా వచ్చే చిన్న చిన్న జబ్బులను సీజనల్ గా వచ్చే జబ్బులను నివారించడుకోవడానికి, జలుబు, దగ్గు, జ్వరం వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కషాయాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. పురాతన కాలం నుండి ఇది బాగా వాడుకలో ఉన్న ఒక ఆయుర్వేద ఔషదం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఇది పురాతన కాలం నుండి బాగా పాపులరైనది.

natural health drink for monsoon

ముఖ్యంగా సీజనల్ గా వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మరియు అనాగరోగ్య సమస్యలను నివారించడంలో ఇది ఒక ప్రాధమిక చిత్సవంటిది. ఈ హోం రెమెడి(కషాయం)ను తయారుచేయడం చాలా సులభం. దీన్ని టీ తయారుచేసినట్లే తయారుచేసుకోవాలి. తులసి, మిరియాలు, అల్లం, ధనియాలు, లవంగాలు, వేపాకు, పసుపు, యాలకలు, యూకలిప్టస్, లవంగాలు, కొన్ని మెడిసినల్ హెర్బ్స్..ఇంకా మరికొన్ని పదార్థాలతోటి, విడివిడిగా తయారుచేసుకుంటారు. వ్యాధిని బట్టి, పదార్థాలను ఎంపికచేసుకుంటారు. వీటితో తయారుచేసే కషాయాలు కొద్దిగా డిఫరెంట్ గా, వగరు లేదా చేదుగా ఉంటాయి. కానీ వీటిలో నయం చేసే గుణాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. వ్యాధినిరోధకతను పెంచుతాయి. మరి అలాంటి న్యాచురల్ ఇమ్యూన్ డ్రింక్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

natural health drink for monsoon

కావల్సినవి:

అల్లం జ్యూస్ 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లి జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు

తేనె 1 టేబుల్ స్పూన్

వేడి నీళ్ళు 1 గ్లాస్

ఈ హోం మేడ్ రెమెడీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉంచుటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధుల బారీ నుండి కాపాడుతుంది. ఈ రెమెడీతో పాటు వర్షాల్లో ఎక్కువగా తడవకుండా ఇంట్లో ఉండటం మంచిది. గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం వల్ల దగ్గు జులుబు తగ్గించుకోవచ్చు.

అదనంగా, శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి. బయట తినడం మానేయాలి. రెగ్యులర్ గా చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. ఈ అలవాట్లన్నీ కూడా మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులకు కారణం అయ్యే బ్యాక్టీరియాకు దూరంగా ఉంచుతాయి.

వెల్లుల్లి, ఉల్లి, తేనె హాట్ వాటర్ మిశ్రమం తెల్ల రక్త కణాలను బలోపేతం చేస్తుంది. హెల్తీ న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది.

ఎప్పుడైతే వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయో, అప్పుడు వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి కలిగి ఉంటాయి.

ఇంకా ఈ న్యాచురల్ డ్రింక్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వర్షా కాలంలో వైరల్ వ్యాధులను నివారిస్తుంది.

natural health drink for monsoon

ఎలా తయారుచేయాలి:

పైన సూచించిన విధంగా పదార్థాలన్నీ ఒక గ్లాసు వేడి నీటిలో వేయాలి.

బాగా కలపాలి:

అన్ని పదార్థాలు బాగా కలిసే వరకూ కలిపి, తాగాలి. రోజులో ఒకసారి తాగితే మంచిది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగితే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

This Homemade Concoction Can Keep You Healthy During The Rainy Season!

The monsoon season is here in all its glory and throughout the country, people are experiencing the wrath of the heavy rains, as we have seen in the news lately, right?
Story first published: Sunday, September 24, 2017, 11:00 [IST]
Subscribe Newsletter