For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంట్లో దోమల బెడదా?అయితే ఈ ట్రిక్స్ ప్రయత్నించి చూడండి..!

|

సాధారణంగా జూన్, జూలై మాసాలలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో నిల్వ ఉన్న నీటి నుంచి దోమలు ఉత్పత్తి అవుతాయి. దోమ కాటుకు గురివావడం వలన మలేరియా జ్వరం సంభవిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. దోమ కాటు వల్ల జ్వరం లేదా మలేరియా రావొచ్చు.

ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వర్గానికి చెందిన పరాన్న జీవి వలన మలేరియా జ్వరం వస్తుంది. దీనిలో అత్యంత ప్రమాదకరమైన ప్లాస్మోడియం ఫాల్సిపేరం అనే పరాన్న జీవి వలన వచ్చు సెరెబ్రల్ మలేరియావ్యాధితో మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశముంటుంది. రొనాల్డ్‌రాస్ అను శాస్త్రవేత్త వివరించిన ప్రకారం మలేరియా జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేయుటలో ఆడ ఎనాఫిలస్ దోమ కీలక పాత్ర వహిస్తుంది.

మీ ఇంట్లో దోమల బెడదా?అయితే ఈ ట్రిక్స్ ప్రయత్నించి చూడండి..!

దోమలు కుడితే ఎంతటి ప్రాణాంతక విష జ్వరాలు ప్రబలుతాయో అందరికీ తెలిసిందే. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలకు దోమలే కారణం. అతి ప్రమాదకరమైన అంటు వ్యాధులను సూది లాంటి తన ముక్కుతో అలా కుట్టి.. ఇట్టే వ్యాపింప చేసి ప్రజలను పరలోక ప్రయాణానికి సిద్ధం చేసేస్తుంది. ఇటువంటి దోమకు యావత్ ప్రపంచం మొత్తం శత్రువులే..! అయితే మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఈ దోమలను నివారించడంలో మాత్రం పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నాం. ప్రస్తుతం దోమలను నివారించడానికి చాలా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. ఏదీ పూర్తి స్థాయిలో పనిచేయక పోవడం దురదృష్టకర విషయం.

ఇక మన ఇళ్లలో సాధారణంగా వాడే దోమల కాయిల్స్, మస్కిటో రీపెల్లెంట్స్ కొందరికి పడవు. శ్వాసకోశ సమస్యలను తెచ్చి పెడతాయి. కాబట్టి, ఇంట్లో తయారుచేసుకునే ఒక సింపుల్ నేచురల్ రెమెడీతో ఇంట్లో దోమలన్నింటి నాశనం చేయవచ్చు. ఈ రెమెడీ స్ప్రే చేసిన రెండు గంటల్లోపు మంచి ఫలితం ఉంటుంది.

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

పుదీనా ఆయిల్ : 1/2కప్పు

వెజిటేబుల్ ఆయిల్ : 1/2కప్పు

వెనిగర్ : 1/2కప్పు

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వేపనూనె-కొబ్బరి నూనె :

వేప నూనె దోమలను తరిమి కొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసనను దోమలు భరించలేవు. వేప నూనె, కొబ్బరి నూనెలను సమాన భాగాలుగా తీసుకుని బయటికి కనిపించే శరీర భాగాలపై రుద్దుకుంటే దోమలు దరిచేరవు.

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

నిమ్మగడ్డి నూనె:

పావు కప్పు వేణ్నీళ్లలో పన్నెండు చుక్కల నిమ్మగడ్డి నూనె కలపాలి. ఈ నీళ్లని ఒక స్ప్రే సీసాలోకి తీసుకోవాలి. తలుపులూ, కిటీల వద్ద ఈ నీళ్లని చల్లుతుంటే కీటకాలూ, ఇతర పురుగులు ఇంట్లోకి చొరబడకుండా ఉంటాయి.

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

తులసి:

ఈ కాలంలో ఈగలు ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు తులసి కొమ్మల్ని వంటగదీ, భోజనాల గది వద్ద ఉంచాలి. ఒకవేళ తాజా కొమ్మలు దొరక్కపోతే ఎండిపోయిన ఆకుల్ని మస్లిన్‌ వస్త్రంలో ఉంచి వేలాడదీస్తే సరి. అలానే లావెండర్‌, తమలపాకులూ, పుదీన వంటివి కూడా ఈగల్ని పారదోలతాయి.

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వెల్లుల్లి:

నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని.. బాగా దంచి గ్లాసు నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లని వడకట్టి స్ప్రే సీసాలో తీసుకోవాలి. చల్లారాక ఇంటి బయట, బాల్కనీలో చల్లితే లోపలికి దోమలు రాకుండా ఉంటాయి.

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

కర్పూరం:

కప్పు వేప నూనెలో మెత్తగా పొడి చేసిన కర్పూరం వేయాలి. ఈ మిశ్రమాన్ని దోమల రిపెల్లెంట్‌లో ఉంచి.. ప్లగ్‌లో పెట్టుకోవాలి. గదిలో దోమలూ, ఇతర పురుగులు ఉంటే వెంటనే చనిపోతాయి.

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

వీటిని కూడా ప్రయత్నించి చూడండి..

పుదీనా

పుదీనా, పుదీనా ఆయిల్ దోమల నివారణకు సమర్థంగా పనిచేస్తాయని జర్నల్ ఆఫ్ బయోరీసోర్స్ టెక్నాలజీ పేర్కొంది. పుదీనా ఆకులను నీళ్లలో కాచి ఇంట్లో స్ప్రే చేయడం, లేదా వేపరైజర్ గాను ఉపయోగించుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. పుదీనా ఆయిల్ ను చర్మంపై రాసుకోవచ్చు. పుదీనా మొక్కలను కిటికీల వద్ద ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించుకోవచ్చట.

English summary

Natural Spray After 2 Hours No More Bugs, Mosquitoes

Natural Spray After 2 Hours No More Bugs, Mosquitoes ,There exist numerous insecticides in the market and all eliminate bugs quick and simple, but they have products that are threats for us and health too. Also they are not eco friendly and pollute air.
Story first published: Thursday, July 13, 2017, 17:40 [IST]
Desktop Bottom Promotion