ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల శరీరానికి కలిగే నెగటివ్ ఎఫెక్ట్స్..!

By Lekhaka
Subscribe to Boldsky

ఫాస్ట్ ఫుడ్ ని తినడం ద్వారా మీరు ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ నైనా ఎదుర్కొన్నారా? ఈ ఆర్టికల్ ని చదివి తెలుసుకోండి.

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని అమితంగా ప్రేమిస్తారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ మనల్ని ఆకర్షిస్తుంటాయి.

అయితే, సమయం ఇంకా మించిపోలేదు. ఇప్పటికైనా ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతాము. ఫాస్ట్ ఫుడ్స్ ని తినడం మానకపోతే శరీరం అనేకరకాలైన అనారోగ్యాలకు గురవుతుంది.

ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రభావాలు

జంక్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుంది. అంతేకాకుండా, జంక్ ఫుడ్స్ లో కేలరీలు మోతాదుకు మించి ఉంటాయి. పోషకవిలువలు శూన్యం. అనారోగ్య సమస్యలతో పాటు అధిక బరువు సమస్యలకు గురిచేస్తాయి.

అలాగే, ఫాస్ట్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత అనారోగ్యంతో పాటు స్ట్రోక్స్ వంటి వివిధ రకాల రోగాల బారిన పడే అవకాశాలు ముమ్మరం. కార్బోహైడ్రేట్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్స్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరుగుతాయి.

ఫాస్ట్ ఫుడ్స్ వలన కలిగే అనేకరకమైన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేందుకు ఈ వ్యాసాన్ని చదవండి.

1. ఇన్సులిన్, టైప్ 2 డయాబెటిస్ పై ప్రభావం:

1. ఇన్సులిన్, టైప్ 2 డయాబెటిస్ పై ప్రభావం:

ప్రతి రోజూ ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకువడం లేదా వారానికి మూడు సార్లైనా ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు అధికం. ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాలలో ఇది ముఖ్యమైనది.

2. డిప్రెషన్, అడిక్షన్ ల బారిన పడే అవకాశాలు:

2. డిప్రెషన్, అడిక్షన్ ల బారిన పడే అవకాశాలు:

ఫాస్ట్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే, ఫాస్ట్ ఫుడ్స్ కి అడిక్ట్ అయిపోవడం కూడా ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే దుష్ప్రభావం.

3. ఒబెసిటీ:

3. ఒబెసిటీ:

ఫాస్ట్ ఫుడ్స్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఒబెసిటీ బారిన పడే అవకాశాలు ఎక్కువ.

4. కార్డియోవాస్క్యులర్ వ్యాధుల బారిన పడే అవకాశాలు:

4. కార్డియోవాస్క్యులర్ వ్యాధుల బారిన పడే అవకాశాలు:

చాలా మటుకు ఫాస్ట్ ఫుడ్స్ లో కొవ్వు పదార్థాలు అధికం. ఇవి గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తాయి. తద్వారా హృదయ కండరాల వాపు, ఎథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు కలవు. ఫాస్ట్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల కలిగే నెగటివ్ ఎఫెక్ట్స్ లోఇవి ముఖ్యమైనది.

5. క్యాన్సర్:

5. క్యాన్సర్:

ఫాస్ట్ ఫుడ్ ని తరచూ తీసుకోవడం వల్ల కోలోరెక్టాల్ క్యాన్సర్ తో పాటు ప్రేగు క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో ఇది కూడా ఒకటి.

6. బ్లడ్ ప్రెజర్:

6. బ్లడ్ ప్రెజర్:

ప్రిజర్వేటివ్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువగా వాడతారు. ఇవి శరీరంలో నున్న ఉప్పు శాతాన్ని పెంచుతాయి. తద్వారా అధిక రక్తపోటు సమస్య వేధిస్తుంది. గుండెపై, కిడ్నీ పై ఫాస్ట్ ఫుడ్స్ హానికర ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఫాస్ట్ ఫుడ్స్ ని తినే ముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి.

7. హానికర కొలెస్టెరాల్:

7. హానికర కొలెస్టెరాల్:

ఫాస్ట్ ఫుడ్స్ లో ఉండే ట్రైగ్లైసెరాయిడ్స్ (హానికర కొవ్వు) హైపెర్టెన్షన్ అనే సమస్యకు గురిచేస్తాయి. ఫాస్ట్ ఫుడ్స్ ని అత్యధికంగా తీసుకోవడం వల్ల కలిగే ఈ దుష్ప్రభావాన్ని గమనించి ఫాస్ట్ ఫుడ్స్ నుండి దూరంగా ఉండటం మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Negative Effects Of Fast Food On Your Body

    There is no denying that most of us are big fans of fast food. Though we are crystal clear about the fact that it does no good to our body, we just can't simply resist the sight and smell of oozing mayonnaise sauce or those crispy delights, whose sight is difficult to escape.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more