For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 9 లక్షణాలు ఉంటే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువ ఉన్నట్లే లెక్క!

By R Vishnu Vardhan Reddy
|

శరీరం ఉత్త్పత్తిచేసే హార్మోన్ల లో టెస్టోస్టెరాన్ కూడా ఒక్కటి. ముఖ్యంగా పురుషుడి యొక్క వృషణాలు ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. పురుషుడి యొక్క బాహ్య ఆకారం మరియు శృంగారపరమైన అభివృద్ధి పై టెస్టోస్టెరాన్ ప్రభావం చూపుతుంది. ఇది పురుషుడిలో శృంగార కోరికను రేకెత్తిస్తాయి మరియు వీర్యం ఉత్పత్తికి ప్రేరేపిస్తాయి. అంతే కాకుండా ఇవి కండరాల ఎదుగుదలకు మరియు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి.

వయస్సు పేరేకొద్దీ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అమెరికా యూరలాజికల్ అసోసియేషన్ ప్రకారం 60 సంవత్సరాలు పై బడ్డ ప్రతి పదిమందిలో ఇద్దరికీ టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని, అలానే 70 నుండి 80 సంవత్సరాల పురుషుల్లో ప్రతిమందిలో ముగ్గురికి టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని అని గుర్తించారు. దీనిని బట్టి వయస్సు మీద పడేకొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతుంటాయి అనే విషయం అర్ధం అవుతోంది.

మగవారు ఆ విషయంలో వీక్ అవ్వడానికి టెస్టోస్టెరాన్ లోపమట..!మగవారు ఆ విషయంలో వీక్ అవ్వడానికి టెస్టోస్టెరాన్ లోపమట..!

టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గాల్సిన స్థాయి కంటే మరీ ఎక్కువగా తగ్గిపోతే కొన్ని రకాల లక్షణాలు ఆ పురుషుల్లో కనపడతాయి. వాటి వల్ల కొన్ని సమస్యలు అనుభవించాల్సి కూడా వస్తుంది. ఒక డెసి లీటర్ రక్తంలో 300 నానో గ్రాముల కంటే కూడా తక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్ ఉన్నట్లు గనుక నిర్ధారణ అయితే, అప్పుడు ఆ వ్యక్తిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు లెక్క. మాములుగా ఒక డెసి లీటర్ రక్తంలో 300 నుండి 1000 నానో గ్రాములు టెస్టోస్టెరాన్ ఉంటే అది సాధారణ స్థాయిలో ఉన్నట్లు అర్థం. టెస్టోస్టెరాన్ స్థాయిలు కనుక్కోవడానికి ఒక రక్త పరీక్ష చేస్తారు దానినే "సీరం టెస్టోస్టెరాన్" అంటారు.

టెస్టోస్టెరాన్ ఉత్పత్తి సాధారణ స్థాయిలో గనుక జరగకపోతే కొన్ని రకాల సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఆ సమస్యల తాలుకు లక్షణాలు మన శరీరంలో కనపడతాయి, అవి మనకు తెలుస్తాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా గనుక ఉంటే ప్రముఖంగా కనపడే 9 లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

పురుషుల్లో లైంగికశక్తి పెంచే హార్మోన్ల ఉత్పత్తికి: ఉత్తమ చిట్కాలు పురుషుల్లో లైంగికశక్తి పెంచే హార్మోన్ల ఉత్పత్తికి: ఉత్తమ చిట్కాలు

1. శృంగార ప్రేరణను కలిగించి ప్రేమించేలా చేయడం :

1. శృంగార ప్రేరణను కలిగించి ప్రేమించేలా చేయడం :

పురుషుల్లో శృంగార ప్రేరణను కలిగించి, రతిక్రీడ వైపు అడుగులు వేయడానికి టెస్టోస్టెరాన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొంతమంది పురుషుల్లో వయస్సు పెరిగే కొద్దీ వారిలో ఉన్న శృంగార కోరికలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే ఏ పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయో, అటువంటివారిలో శృంగార కోరికలు విపరీతంగా తగ్గుముఖం పడతాయి.

2. అంగస్తంభనలో సమస్యలు ఎదురవుతాయి :

2. అంగస్తంభనలో సమస్యలు ఎదురవుతాయి :

పురుషుడిలో శృంగార కోరికలు కలిగించడానికి టెస్టోస్టెరాన్ ఎంతగానో దోహదపడుతుంది. అంతే కాకుండా పురుషుల్లో అంగస్తంభన ఎక్కువసేపు ఉండటానికి కూడా సహకరిస్తుంది. అంగస్తంభన జరగడానికి టెస్టోస్టెరాన్ ఒక్కటే కారణం కాదు. కానీ మెదడుకు ప్రేరణ కలిగించి నైట్రిక్ ఆక్సైడ్ ని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనే అణువు కొన్ని రసాయన క్రియల ద్వారా కావాల్సినంత అంగస్తంభన జరగడానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయో ,అటువంటి వారిలో అంగస్తంభన సమయంలో సమస్యలు ఎదురవుతాయి. లేదా యాదృచ్ఛిక అంగస్తంభనలు జరిగిపోతాయి( ఉదాహరణకు నిద్రపోతున్నప్పుడు).

అయితే అంగస్తంభన బాగా జరగడానికి అతి ముఖ్యమైన వాటిల్లో టెస్టోస్టెరాన్ కూడా ఒకటి. అంగస్తంభన సరిగ్గా జరగకపోతే టెస్టోస్టెరాన్ లోపాన్ని చికిత్స ద్వారా భర్తీ చేయాలనుకుంటున్న పరిశోధనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అంగస్తంభనలో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి చేసిన అధ్యయనాలను సమీక్ష చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, టెస్టోస్టెరాన్ చికిత్స చేసిన తరువాత కూడా సగం మందిలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఆ వ్యక్తిలో ఉన్న మిగతా ఆరోగ్య సమస్యలు అంగస్తంభన జరగకుండా ఉండటానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

మధుమేహం

థైరాయిడ్ సమస్యలు

అధిక రక్త పోటు సమస్య

అధిక కొవ్వు

ప్రొగతాగడం

మద్యం సేవించడం

అధిక ఒత్తిడికి లోనుకావడం

విచారంగా ఉండటం

3. తక్కువ స్థాయిలో వీర్యం ఉత్పత్తి అవడం :

3. తక్కువ స్థాయిలో వీర్యం ఉత్పత్తి అవడం :

వీర్యం ఉత్పత్తి అయ్యే ప్రక్రియలో టెస్టోస్టెరాన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీర్యం అనేది పాలవంటి ఒక ద్రవం. దాని స్వభావము వల్ల అది సులువుగా చలిస్తుంది. పురుషుల్లో ఎవరికైతే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయో, అటువంటి వ్యక్తులు స్కలించినప్పుడు వీర్య ఉత్పత్తి అనేది చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది.

4. జుట్టు ఊడిపోవడం :

4. జుట్టు ఊడిపోవడం :

శరీరంలో జరిగే చాలా ప్రక్రియల్లో టెస్టోస్టెరాన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందులో వెంట్రుకలు మొలవటం కూడా ఒకటి. వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో బట్టతల రావడం అనేది సాధారణ విషయం. వంశపారంపర్యంగా కూడా పురుషుల్లో బట్టతల రావొచ్చు. ఏ వ్యక్తుల్లో అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయో, అటువంటి వ్యక్తులకు తల పై ఉన్న వెంట్రుకలతో పాటు శరీరం పై ఉన్న వెంట్రుకలు కూడా ఎక్కువగా ఊడిపోతాయి.

5. అలసిపోవడం :

5. అలసిపోవడం :

ఏ వ్యక్తుల్లో అయితే తక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్ ఉంటుందో, అటువంటి వారు విపరీతంగా అలసిపోతారు మరియు వారిలో శక్తి స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఏ వ్యక్తులు అయితే సరిపడినంత సమయం నిద్రపోయినా కూడా అలసిపోయినట్లు భావిస్తారో మరియు శారీరిక వ్యాయామం చేయడానికి అస్సలు ఆసక్తి చూపారో అటువంటి వారిలో కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువ ఉన్నట్లు భావించవచ్చు.

6. కండరాల యొక్క దృఢత్వం తగ్గిపోతుంది :

6. కండరాల యొక్క దృఢత్వం తగ్గిపోతుంది :

కండరాల నిర్మాణం లో టెస్టోస్టెరాన్ చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఏ వ్యక్తుల్లో అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయో, అది వారి కండరాల ఆకృతి పై ప్రభావం చూపవచ్చేమో కానీ, కండరాల శక్తి మరియు వాటి పని తీరు పై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని చెప్పలేము అని అధ్యయనాలు చెబుతున్నాయి.

7.శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది :

7.శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది :

ఏ వ్యక్తుల్లో అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయో, అటువంటి వారిలో విపరీతంగా కొవ్వు పెరగడం మొదలవుతుంది. ముఖ్యంగా కొన్ని సార్లు పురుషుల్లో స్తనవృద్ధి ( గైనకోమస్తియా ) జరుగుతుంది. ఇలా శరీరం పై ప్రభావం చూపడానికి కారణం, ఆ పురుషుల్లో టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిల సమతుల్యత దెబ్బ తినడం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

8. ఎముకల బరువు మరియు దృఢత్వం తగ్గిపోతుంది :

8. ఎముకల బరువు మరియు దృఢత్వం తగ్గిపోతుంది :

ఎముకల యొక్క దృఢత్వం మరియు బరువు తగ్గిపోవడం అనే స్థితిని సాధారణంగా స్త్రీలలో గమనిస్తుంటాము. అయితే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్న పురుషుల్లో కూడా ఈ ఎముకలకు సంబంధించిన లోపాలు కనపడుతుంటాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి వల్ల ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ముసలి వారిలో ఎముకలు చాలా పెలుసుగా ఉంటాయి. అందుకే చాలా త్వరగా వారి ఎముకలు విరిగిపోతుంటాయి మరియు పగుళ్లు ఏర్పడుతుంటాయి.

9. ఆలోచనలు త్వరగా మారిపోతుంటాయి :

9. ఆలోచనలు త్వరగా మారిపోతుంటాయి :

ఏ వ్యక్తుల్లో అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయో వారిలో ఆలోచనలు త్వరగా మారిపోతుంటాయి. ఎందుకంటే శరీరంలో జరిగే చాలా ప్రక్రియలపై టెస్టోస్టెరాన్ ప్రభావం చూపుతోంది. అంతే కాకుండా వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు మానసిక సామర్ధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఏ వ్యక్తులు అయితే తరచూ క్రుంగిపోతారో, వేగంగా కోపం వస్తుందో లేదా ఏ విషయం పైన అయినా దృష్టి పూర్తిగా కేంద్రీకరించలేకపోతారో అటువంటి వ్యక్తులలో టెస్టోస్టెరాన్ తక్కువ మోతాదులో ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

English summary

Nine Signs of Low Testosterone

Here are a few signs that could indicate low levels of testosterone in Men should never ignore.
Desktop Bottom Promotion