దానిమ్మ తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకుంటే, పడేయడానికి మనస్సు రాదు..!

Posted By:
Subscribe to Boldsky

బ్రైట్ గా రెడ్ కలర్లో ఉండే దానిమ్మ గింజల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దానిమ్మ పండును తొక్క తీసి లోపలి విత్తనాలు మాత్రమే తిని, తొక్కను పడేస్తుంటారు. కానీ ఇలా వేస్ట్ గా పడేసే తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా?ఖచ్చితంగా అవుననే అంటున్నాయి అనేక పరిశోధనలు. దానిమ్మ పండు తొక్క మీద రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వాటి యొక్క ఔషధ గుణాలు కనుగొన్నారు.

ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?

దానిమ్మ గింజల్లోలాగే, దానిమ్మ తొక్కలో కూడా అనేక న్యూట్రీషియన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. అయితే విత్తనాల్లో కంటే దానిమ్మ తొక్కలో యాంటీఆక్సిడెంట్స్ రెట్టింపుగా ఉన్నట్లు కనుగొన్నారు . అంతే కాదు, దానిమ్మ తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెద్ద మొత్తంలో విటమిన్ సిలు ఉన్నట్లు కనుగొన్నారు. దానిమ్మ తొక్కలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ వల్ల మన చర్మ ఆరోగ్యాన్ని కూడా గొప్పగా మెరుగుపరుస్తుందని కనుగొన్నారు.

డయాబెటిస్ ని ఎఫెక్టివ్ కంట్రోల్ చేసే.. దానిమ్మ ఫ్లవర్..!!

అయితే తొక్కను తినడానికి కానీ, ఉపయోగించడానికి కానీ, చాలా మంది ఇష్టపడరు. అయితే ఇందులో ఉపయోగకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని వాడకుండా ఉండరు . టేటీగా ఉండటానికి ఒక హెల్తీ రిసిని తయారుచేసుకోవచ్చు. దానిమ్మ తొక్కను ఇతర వెజిటేబుల్స్ తో కలిపి సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు లేదా ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవడం టేస్టీ ఆప్షన్. మరి ఇలా తయారుచేసుకోవడానికి ముందు అందులోని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

హార్ట్ హెల్త్ :

హార్ట్ హెల్త్ :

దానిమ్మ తొక్కతో ఒక అద్భుతమైన ప్రయోజనం హార్ట్ డిసీజెస్ తో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, హానికరమైన ఫ్రీరాడికల్స్ ను తొలగించి హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది .

దంత సంరక్షణకు :

దంత సంరక్షణకు :

నోటి దుర్వాసన తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే దానిమ్మ తొక్క గ్రేట్ గా సహాయపడుతుంది. దానిమ్మ తొక్కను ఎండలో ఎండలో ఎండబెట్టి, పౌడర్ చేసి, వాటర్ తో మిక్స్ చేయాలి. దీన్ని దంతాల మీద అప్లై చేసి రుద్దాలి. ఇది దంత సమస్యలతో పాటు, మౌత్ అల్సర్ ను కూడా నివారిస్తుంది.

బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

దానిమ్మ తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా మోనోపాజ్ మహిళల్లో ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మ తొక్కతో తయారుచేసిన డికాషన్ ను తాగడం వల్ల ఓస్టిరియో పోసిస్ ను నివారిస్తుంది. దాంతో బోన్ డెన్సిటిని తగ్గిస్తుంది

దగ్గు , గొంతు నొప్పిని నివారిస్తుంది:

దగ్గు , గొంతు నొప్పిని నివారిస్తుంది:

దగ్గు, గొంతు నొప్పి తగ్గించడానికి దానిమ్మ తొక్క అద్భుతమైన హోం రెమెడీ. . దానిమ్మ తొక్క పౌడర్ ను వాటర్ లో వేసి, గోరువెచ్చగా మరిగించాలి. ఈ నీటిని నోట్లో పోసుకుని, గార్గిలింగ్(పుక్కిలించాలి), ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు .

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది

ఎల్లప్పుడూ యంగ్ అండ్ ఫ్రెష్ లుక్ తో కనబడాలనుకుంటే, దానిమ్మ తొక్క బెస్ట్ ఆప్షన్. వయస్సైనవారిలా కనబడేలా చేసే కొల్లాజెన్ ఉత్పత్తిని బ్రేక్ డౌన్ చేస్తుంది. కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

దానిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్కిన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అలాగే సన్ బ్లాక్ ఏజెంట్ గా గొప్పగా సహాయపడుతుంది.

డిటాక్సిఫై ఏజెంట్ :

డిటాక్సిఫై ఏజెంట్ :

దానిమ్మ తొక్క డిటాక్సిఫై ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ చేరకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అందుకు గొప్పగా సహాయపడుతాయి.

ఫేస్ క్లియర్ గా మార్చుతుంది:

ఫేస్ క్లియర్ గా మార్చుతుంది:

దానిమ్మ తొక్క అద్భుతంగా పనిచేస్తుంది. మీ ముఖాన్ని క్లీన్ గా మరియు క్లియర్ గా ఉంచుతుంది. ఇది మొటిమలు, మచ్చలతో పోరాడుతుంది. దానిమ్మ తొక్కను ఎండలో ఎండబెట్టి , దీన్ని పౌడర్ చేసి రోజ్ వాటర్ మరియు తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

చుండ్రును నివారిస్తుంది

చుండ్రును నివారిస్తుంది

చుండ్రును నివారించటంలో దానిమ్మ తొక్క గ్రేట్ గా సహాయపడుతుంది. దానిమ్మ తొక్క పౌడర్ ను గోరువెచ్చని కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, తలకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరి ఇకెందుకు ఆలస్యం, దానిమ్మ తొక్క వేస్టే కదా అని పడేయకుండా, దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో, అన్ని రకాలుగా వాడేసుకోండి..

English summary

Not Just Fruit, Pomegranate Peel Too Has These Health Benefits

Not just the fruit, even pomegranate peel is said to be loaded with health benefits. This article explains about a few of its major health benefits.
Story first published: Wednesday, April 12, 2017, 14:52 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter