పొడి దగ్గును చిటికెలో మాయం చేసే పాలు+ఖర్జూరం

Posted By:
Subscribe to Boldsky

పొడి దగ్గు అనేది.. పెద్ద సమస్య కాకపోయినా.. చాలా ఇబ్బంది పెడుతుంది. గొంతు, ఛాతీలో నొప్పి, ఛాతీలో పట్టేయడం వంటి లక్షణాల వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అలాగే చాలా సాధారణంగా వచ్చే సమస్య కూడా. ప్రతి ఒక్కరీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్య ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది. కానీ.. ఇది పెద్ద అనారోగ్య సమస్య కాకపోయినా.. నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సరైన రెమిడీస్ పాలో అవ్వాలి.

చాలా సందర్భాల్లో పొడి దగ్గు అలర్జీ, వైరల్ ఇన్ఫెక్షన్ కి సంకేతంగా చెప్పవచ్చు. అలాగే పొడి దగ్గును తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే.. నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. నిర్విరామంగా దగ్గడం వల్ల.. గొంతులో ఏదో అడ్డుపడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇటువంటి సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్లైతే మీకోసం తక్షణ ఉపశమనం కలిగించే రెమెడీ ఒకటి ఉంది.

వేసవిలో పొడి దగ్గుకు కారణాలు-నివారణ

డ్రై కఫ్ కు వివిధ రకాల కారణాలున్నాయి. గొంతు బ్లాక్ అయినప్పుడు డ్రై కఫ్ ఇబ్బంది పెడుతుంది. ఇతర కారణాల వల్ల అయితే వైరల్ ఫ్లూ, స్మోకింగ్ మరియు ఆస్త్మా, ట్యుబర్ క్యులోసిన్ లక్షణాలున్నప్పుడు కూడా డ్రై కఫ్ వస్తుంటుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవడం చాలా మంచిది. లేదంటే మరో సీరియస్ కండీషన్ లంగ్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

మిమ్మల్నివేధించే పొడి దగ్గుకు 8 బెస్ట్ హోం రెమడీస్

డ్రై కఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఫ్లూ వల్ల వస్తే మాత్రం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండే హోం రెమిడీస్ ని ఫాలో అవడం వల్ల.. పొడి దగ్గును చాలా తేలికగా నివారించుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అటువంటి సింపుల్ అండ్ సూపర్ హోం రెమెడీ మీకోసం ఈ క్రింది విధంగా..

#1.

#1.

ఎండు ఖర్జూరాలు

#2.

#2.

అరలీటర్ పాలు తీసుకోవాలి.

#3.

#3.

తర్వాత పాలను వేడి చేయాలి. ఖర్జూరాలను ఓపెన్ చేసి విత్తనాలను తొలగించి మరిగే పాలలో వేయాలి

#4.

#4.

పాలతో పాటు ఖర్జూరం కూడా అరగంట పాటు మీడియం మంటలో ఉడికించాలి

#5.

#5.

ఇలా కాచిన ఒక కప్పు పాలను రోజుకు మూడు సార్లు, డ్రై కఫ్ తగ్గే వరకూ తీసుకుంటే మంచిది.

English summary

One Super Recipe To Cure Dry Cough

Dry cough makes you irritated. The itching around the throat and chest because of the congestion makes you uncomfortable and at times causes pain as well. For sure most of you might have got this problem at least once. The experience is bad, and the moment you have this problem all that you want is to get rid of it instantly.
Story first published: Saturday, March 25, 2017, 15:09 [IST]
Subscribe Newsletter