ఓరల్ సెక్స్ వలన గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనిషి జీవితంలో ప్రాథమికంగా సుఖాన్ని, సంతోషాన్నిచ్చే విషయాలు కొన్నే ఉంటాయి. మంచి ఆహారం, మంచి సెక్స్ కూడా వాటిల్లోవి.

చరిత్రలో అనేక తత్వవేత్తలు, కవులు ఆనందాన్నిచ్చే సెక్స్ ను మంచి రుచికర ఆహారంతో పోల్చారు.

ఎందుకంటే, సెక్స్ అవసరాలు మరియు ఆకలి ప్రతి జంతువుకి ఉండే ప్రాథమిక అవసరాలు. వాటిని తీర్చుకోవడం వేరేస్థాయిలో సంతృప్తినిస్తుంది!

ఓరల్ సెక్స్ తో ఎయిడ్స్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న హెచ్ పివి..!

ఇప్పుడు ఊహించండి, చప్పగా ఉన్న పదార్థాన్ని, ఏ దినుసులూ లేకుండా తినాలంటే బోర్ కొడుతుంది, కదూ?

is oral sex safe

అలాగే, సెక్స్ సృజనాత్మకంగా, తేడాగా మారుతూ ఉండకపోతే, రొటీన్ గా మారి ఇద్దరు భాగస్వాములకి ఆసక్తి తగ్గిపోతుంది.

అందుకని డైనింగ్ టేబుల్ పైనే కాదు, పడకగదిలో కూడా అన్నివిషయాలను అన్నిరకాల దినుసులతో ఆసక్తికరం చేయటం చాలా ముఖ్యం!

సెక్స్ బోర్ కొడుతున్నప్పుడు, మీ భాగస్వామి మీతో తరచుగా సెక్స్ చేయటానికి ఇష్టపడకపోవచ్చు. జంటలు సెక్స్ లో తరచుగా పాల్గొనకపోతే, వారిలో ఘర్షణలకి దారితీస్తుంది!

నిజానికి, అనేక సర్వేలు, గణాంకాల ప్రకారం, ఆనందకర సెక్స్ జీవితం లోపించడం అనేక జంటల మధ్య బంధాలు తెగిపోవడానికి ముఖ్యకారణంగా ఉంటోంది.

is oral sex safe

సెక్స్ ను ఆసక్తికరంగా మార్చుకోటానికి, జంటలు తరచూ వివిధ సెక్స్ భంగిమలను ప్రయత్నిస్తూ, ఓరల్ సెక్స్ లో కూడా పాల్గొంటారు.

ఓరల్ సెక్స్ అంటే భాగస్వాముల్లో ఒకరు మరొకరి జననాంగాలను నోటితో ప్రేరేపించడం లేదా చూషించటం.

ఫోర్ ప్లేలో ఓరల్ సెక్స్ చాలా ఆనందాన్నిచ్చే ఒక ప్రక్రియ మరియు అందరూ ఎంతో ఇష్టంగా అందులో పాల్గొంటారు.

ఓరల్ సెక్స్ చేస్తున్నప్పుడు కండోమ్ వంటి సురక్షిత వస్తువులు వాడరు కాబట్టి లైంగిక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నది.

కొత్త పరిశోధన ప్రకారం ఓరల్ సెక్స్ వలన గొంతు క్యాన్సర్ వచ్చే రిస్క్ మరింత పెరుగుతుంది! ఎలానో తెలుసుకోండి.

is oral sex safe

ఓరల్ సెక్స్ మరియు గొంతు క్యాన్సర్ మధ్య సంబంధం

మనకి ఇదివరకే తెలిసినట్టు, మానవాళికి వచ్చిన పెద్ద వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది ఎంతో మందిని కబళించివేస్తూనే ఉంది.

క్యాన్సర్ వయస్సు, లింగబేధం లేకుండా ఎవరికైనా రావచ్చు. ఆరోగ్యకర జీవనవిధానాలతో జీవిస్తున్నవారు కూడా దీనిబారిన పడి నెలల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు!

చాలా రకాల క్యాన్సర్లున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పేగుల క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త క్యాన్సర్ మొదలగునవి.

శృంగారం మగ వాళ్లకు ఎంత అవసరమో ఆడవాళ్లకు కూడా అంతే అవసరం..

గొంతు క్యాన్సర్ గొంతు కణజాలంపై ప్రభావం చూపి, అక్కడ కణితులు పెరిగేలా చేస్తుంది. ఇది క్రమంగా మాట్లాడటం, మింగటం, శ్వాసపీల్చటాన్ని కూడా కష్టమయ్యేట్లు చేస్తుంది!

ఇటీవల జరిగిన పరిశోధన ప్రకారం హెచ్ పివి అనే వైరస్ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపించి, ఈ వైరస్ క్రమంగా క్యాన్సర్ కి దారితీస్తుంది.

ఇది ఎవరైతే ఓరల్ సెక్స్ తమ భాగస్వామికి ఇస్తున్నారో వారికి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వైరస్ వారి నోటినుంచి గొంతుకు నేరుగా చేరుకుంటుంది.

అందువల్ల సురక్షితమైన ఓరల్ సెక్స్ ను జరుపుతూ, ఇద్దరు భాగస్వాములు లైంగిక వ్యాధులకి దూరంగా ఉండండి.

English summary

Can Oral Intercourse Increase The Risk Of Throat Cancer?

Think twice before you practice unsafe oral sex the next time, because it could lead to a deadly disease!
Subscribe Newsletter