For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఈ వ్యాధులతో బాధపడే వారు బొప్పాయ తినడం వల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్..!

బొప్పాయి బాగా పండిన తర్వాత తింటారు, అలాగే గ్రీన్ పపాయను కూడా ఉడికించి, వంటల్లో ఉపయోగించి, సలాడ్స్ మరియు స్టీవ్స్ రూపంలో తీసుకుంటారు. బొప్పాయి బాడీ హీట్ ను పెంచుతుందని చాలా మంది ఫీలవుతుంటారు. కానీ...

|

బొప్పాయి లేదా బొప్పాయ, పపాయ వివిధ రకాలుగా పిలుచుకునే ఈ పండును పాపులర్ అయినటువంటి పండు. ముఖ్యంగా ఇండియాలో, బ్రెజిల్ దేశాల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలసిన విషయమే.

వందగ్రాముల సర్వింగ్ కు బొప్పాయి ఫ్రూట్ 43క్యాలరీల అందిస్తుంది. విటమిన్ సి కూడా ఈ ఫ్రూట్ లో అధికంగా ఉంటుంది. (75 శాతం రోజుకు సర్వ్ అవుతుంది) మరియు ఇందులో ఫొల్లెట్ కూడా 10 శాతం వరకూ ఉంటుంది.

బొప్పాయి బాగా పండిన తర్వాత తింటారు, అలాగే గ్రీన్ పపాయను కూడా ఉడికించి, వంటల్లో ఉపయోగించి, సలాడ్స్ మరియు స్టీవ్స్ రూపంలో తీసుకుంటారు. బొప్పాయి బాడీ హీట్ ను పెంచుతుందని చాలా మంది ఫీలవుతుంటారు, మరి ఇది నిజమా? తెలుసుకుందాం..

బొప్పాయిలో ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్ , న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కొన్ని హెల్త్ సమస్యలున్నవారు బొప్పాయి తినకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఈ క్రింది సూచించిన హెల్త్ కండీషన్స్ ఉన్నవారు బొప్పాయను ఖచ్చితంగా తినకూడదు..

ప్రెగ్నెన్సీ :

ప్రెగ్నెన్సీ :

ప్రెగ్నెన్సీలు బొప్పాయకాయన్ ఖచ్చితంగా తినకూడదు. ఇది తినడం వల్ల గర్భస్రావం జరుగుతుంది. పచ్చిబొప్పాయిలో లాటెక్స్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది యుటేరియన్ కాంట్రాక్షన్ కలిగి ఉండటం వల్ల గర్భస్రావానికి దారితీస్తుంది. కాబట్టి గర్భిణీలు బొప్పాయి తినడం మానేయాలి.

శ్వాససంబంధిత సమస్యలు:

శ్వాససంబంధిత సమస్యలు:

బొప్పాయలో పెపైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది పవర్ఫుల్ అలర్జెన్ కలిగిస్తుంది. శ్వాససంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మీరు కనుక శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఈ ఫ్రూట్ కు దూరంగా ఉండాలి.

రీనల్ స్టోన్స్ :

రీనల్ స్టోన్స్ :

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది వ్యాధినిరోధకను పెంచుతుంది. ఎక్కువగా తినడం వల్ల హాని కలిగిస్తుంది. విటమిన్ సి ఆరోగ్యానికి మంచిదే అయినా, విటమిన్ సి మోతాదుకు మించితే రీనల్ స్టోన్స్ పెరుగుతాయి.

మేల్ ఫెర్టిలిటి:

మేల్ ఫెర్టిలిటి:

మగవారు బొప్పాయిని తినడం వల్ల రీప్రొడక్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. అయితే ఎక్సెసివ్ గా తింటే మాత్రమే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. మగవారు వారి పాట్నర్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉంటే మాత్రమం బొప్పాయి మితంగా తీసుకోవాలి. లేదా బొప్పాయికి దూరంగా ఉండాలి.

పొట్ట సమస్యలున్నవారు:

పొట్ట సమస్యలున్నవారు:

గ్యాస్ట్రో ఇన్ టెన్షన్ లక్షణాలున్న వారు బొప్పాయిని తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. అలాగే బొప్పాయిలో ఉండే పెపైన్ అనే కంటెంట్ స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతుంది. పొట్ట సమస్యలున్నవారు బొప్పాయి కాయ ఎక్సెస్ గా తినడం వల్ల స్టొమ్ అప్ సెట్ కు దారితీస్తుంది. అందుకోసం మితంగా తీసుకోవడం మంచిది.

చర్మ సమస్యలు:

చర్మ సమస్యలు:

స్కిన్ డిస్కలరేషన్, పేల్ ఎల్లో స్కిన్ ముఖ్యంగా అరచేతుల్లో చర్మం పేల్ గా ఉన్నట్లైతే కారోటినీమా అనే చర్మ వ్యాధితో బాధపడుతారు . వీరు బొప్పాయ కాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల బీటాకెరోటీన్ కారణంగా చేతులు ఆరెంజ్ కలర్లో మారుతాయి. కెరోటినాయిడ్ ఫ్యామిలీకి చెందిన విటమిన్ ఎ ఎక్సెస్ తీసుకోవడం వల్ల పీలింగ్ స్కిన్ కు దారితీస్తుంది.

 లోబ్లడ్ షుగర్ :

లోబ్లడ్ షుగర్ :

బొప్పాయి లోబ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. అయితే బ్లడ్ షుగర్ లెవల్స్ అతి తక్కువగా ఉన్నవారు బొప్పాయ కాయన్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను మరింత తక్కువ చేస్తుంది .

కాబట్టి, బొప్పాయి నోరించే ఫ్రూట్ అయినా, న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్న ఫలమైనా, దీన్ని తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. కాబట్టి, బొప్పాయకాయను పూర్తిగా నివారించమని చెప్పడం లేదు, అయితే మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

English summary

People Suffering From These Health Problems Should Avoid Eating Papaya

Papaya is good for one's health; however, a few people suffering from certain medical conditions must make sure to avoid it. We have listed about the medical conditions here.
Story first published: Monday, April 24, 2017, 12:45 [IST]
Desktop Bottom Promotion