ఫర్ఫ్యూమ్స్ వాడటం వల్ల తలనొప్పి, ఆస్త్మా మరియు మైగ్రేన్ సమస్యలు వస్తాయా?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

పర్‌ఫ్యూమ్‌ను బాగా ఇష్టపడుతున్నారా....! పర్‌ఫ్యూవమ్‌ లేనిదే బయటికి వెళ్లడానికి ఇష్టపడటం లేదా? అయితే కాస్త జాగ్రత్తని హెచ్చరిస్తున్నారు నిపుణులు..!

పర్ఫ్యూమ్ గురించి మీరు విన్నారా? ఈ మద్య కాలం రిఫ్రెష్ నెస్ కోసమని పర్ఫ్యూమ్ వాడకాన్ని బాగా పెంచారు.ఒంటి నుంచి దుర్వాస రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో రకాల పెర్ఫ్యూమ్స్ అందుబాటులోకి వచ్చాయి.పెర్ఫ్యూమ్‌కి మీకు మాత్రమే తగినదిగా వుంటేనే బాగుంటుంది. ఇతరులెవరో చల్లుకున్నప్పుడు మంచి వాసన వచ్చింది కదా అని సరిగా ఆ పెర్ఫ్యూమ్‌నే మీరు ఎంచుకోవడం మంచిదికాదు. సెక్సీగా అనిపించే పెర్ఫ్యూమ్‌ చల్లుకున్నంత మాత్రాన మీ గ్లామర్ పెరగదు. సందర్భాన్ని బట్టి తగిన పెర్ఫ్యూమ్‌ ఎంపిక చేసుకునే ముందు దానిని మీ ముంచేయిమీద చల్లుకుని దాని వాసన చూసుకోండి. ఆ వాసన బాగుంటుందని అనిపిస్తే కొనుక్కోండి లేకుంటే వద్దు.

అంతే కాదు రోజూ మీరు వాడే పెర్ఫ్యూమ్ వల్ల మీ లాభాలెన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయన్న విషయం తెలుసుకోండి. మీరు వేసుకున్న ఫర్ఫ్యూమ్ మిమ్మల్ని అనారోగ్యం పాలుచేయగలదంటే మీరు నమ్ముతారా? పెర్ఫ్యూమ్ వాడే ప్రతి ముగ్గురిలో ఒకరు తలనొప్పి, ఆస్తమా మరియు ఫర్ ఫ్యూమ్ కి సున్నితంగా ఉండి ర్యాష్ లు వంటి లక్షణాలను కలిగివుంటారని 'ద కేస్ ఎగెయిన్స్ట్ ఫ్రాంగ్రెన్స్’ అనే పరిశోధనలో తేలింది. దీని రచయిత కేట్ గ్రెన్ విలె.

అదే సమయంలో, 2014లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం మైగ్రెయిన్ ఉన్న మూడొంతుల మంది స్త్రీలు తమ ఫర్ఫ్యూమే కారణమని చెప్పారని ద ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది. పరిశోధనలో, గ్రెన్ విలె తన చిన్నప్పుడు తల్లి ఫెర్ఫ్యూమ్ లకి ఎంత ఆకర్షితురాలయ్యేదో తెలిపారు.

డియోడరెంట్స్..పెర్‌ప్యూమ్స్‌ వాడకంలో మెలకువులు...!

Perfumes side effects

ఒక హోటల్లో ఉన్నప్పుడు కారిడార్లో వచ్చిన వాసనలను అరికట్టడానికి తన హోటల్ గది తలుపుల పగుళ్ళను, మైగ్రేయిన్ ఒస్తుందేమోనన్న భయంతో మూసివేస్తున్నప్పుడు, ఆమెకి ఈ కృత్రిమ వాసనల ప్రభావాన్ని పరిశోధించాలనిపించింది. ఈ పరిశోధనలో ఆమె కృత్రిమ రసాయనాలను వాడే ఈ ఆధునిక ఫర్ఫ్యూమ్ లను తయారుచేస్తారని తెలుసుకున్నారు.

Perfumes side effects

ఫర్ఫ్యూమ్ ఉత్పత్తిదారులు తమ వ్యాపార రహస్యంగా అందులో వాడే అసలు పదార్థాలను బయటపెట్టరు. పైగా సహజ సుగంధ నూనెల వాసనల విషప్రభావాలను ఈ మధ్యనే మరో పరిశోధనలో తెలుసుకున్నారు.

పెర్ఫ్యూమ్ ని ఇలా స్ప్రే చెయ్యడం వల్ల ఒంటి దుర్వాసనను పోగొట్టవచ్చు

Perfumes side effects

దీనిప్రకారం ఎలా ఫర్ఫ్యూమ్ ల వాసనలు ప్రయాణించి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ చర్యలను ప్రేరేపిస్తాయో ఫార్మకాలజీ సీనియర్ అధ్యాపకుడు ఇయాన్ ముస్గ్రేవ్ వివరించారు

Perfumes side effects

ఉదాహరణకి, గులాబి సహజ నూనెలో మరియు కెంచుకీ బోర్ బర్న్ లో ఉండే బీటా- డామాసెనోన్ అనే మూలకం సగటు మనిషి వాడే పరిమితికన్నా మించితే అలర్జీ చర్యలను కలిగిస్తుంది. అదే సమయంలో యూకలిప్టస్ కి ఆ వాసననిచ్చే – 1,8-సినియోల్- ఎక్కువ వాడితే కాలేయాన్ని పాడుచేయవచ్చు.

మీకు ఇష్టమైన పర్‌ఫ్యూమ్‌లో 14 రకాల రసాయనిక పదార్థాలు దాగి ఉన్నాయట. వీటివల్ల ముఖ్యంగా వాతావరణంలో ఉండే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు పర్‌ఫ్యూమ్‌కు తొందరంగా ఆకర్షించబడతాయి. అతినీల లోహిత కిరణాల్లో ఉండే శక్తివంతమైన క్యాన్సర్‌కు కారకాలు తొందరగా శరీరాన్ని చేరతాయట. అంతేకాదు... వాటి ద్వారా వచ్చే పరిమళాన్ని పీల్చడం వల్ల హార్మోన్ల అసమత్యులత ఏర్పడుతుంది. అలాగే అలర్జీ, మైగ్రేన్లు, శ్వాసకోశ సమస్యలు, వికారం వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

వీలైనంత వరకు పర్‌ఫ్యూమ్స్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించటం చాలా మంచిది. పర్‌ఫ్యూమ్‌కు ప్రత్యామ్నాయంగా సహజ పదార్థాలను ఉపయోగించటం చాలా మంచిది. మరీ ముఖ్యంగా పరిమళలు వెదజల్లె నూనెల్లో కూడా అనేక రసాయనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఉపయోగించటం వల్ల క్యాన్సర్‌, హార్మోన్ల అసమత్యులత, అలెర్జీ, వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

పర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగించటం వల్ల ఎన్నో దుష్ప్రభావాలుంటాయి. అలా కాకుండా నిపుణుల సలహా మేరకు పర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగించటం మంచిది.

చాలా మంది పువ్వులతో తయారు చేసిన పర్‌ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు. పువ్వులతో తయారు చేసేటప్పుడు వాటిలో కొన్ని పండ్ల ఫ్లెవర్స్‌ను చేర్చడం వల్ల అవి సుగంధం భరితంగా ఉంటాయి. ఈ పర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగించటం వల్ల చెమట వాసన దూరం కావటంతో పాటు చుట్టూ సహజమైన గంధం వాసనను వెదజల్లుతాయి. అలాంటి వాటినే ఎక్కువగా ఉపయోగించాలి.

పర్‌ఫ్యూమ్‌ వాసన పడని వారు ఇలా చేయాలి. ముందుగా బట్టలకు పర్‌ఫ్యూమ్‌ చల్లి పది నిమిషాల తర్వాత వేసుకుంటే సరిపోతుంది.

విటమిన్‌ 'సి' ఉన్న పండ్లతో తయారు చేసిన పర్‌ఫ్యూమ్స్‌ ఉపయోగించటం వల్ల తాజాదనం పొందుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

ఇంకా ఆరోమెటిక్‌ పర్‌ఫ్యూమ్‌ను తయారు చేయటానికి జీలకర్ర, గడ్డి మొక్కలు, యాలకులు, లావెండర్‌, రోజ్‌ మేరి వంటివి పువ్వులను ఉపయోగిస్తారు.

ఇలాంటి న్యాచురల్ పర్‌ఫ్యూమ్స్‌ ఉత్సాహభరితమైన వాసనను కలిగి ఉంటాయి. అలాగే శ్వాస సంబంధిత వ్యాదులను దూరం చేస్తాయి.

అలాగే గంధంతో చేసిన పర్‌ఫ్యూమ్స్‌ మంచి వాసనతనో పాటు, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతాయి.

కాబట్టి మార్కెట్లో దొరికే ఖరీదైన పర్‌ఫ్యూమ్స్‌ కాకుండా మిమ్మల్ని చెమట చిరాకు నుంచి దూరంగా ఉంచే సహజ సిద్ధమైన పర్‌ఫ్యూమ్స్‌ను వాడండి. రసాయనాలతో తయారుచేసే ఫర్ఫ్యూమ్స్ కు దూరంగా ఉండటం వల్ల ఇటు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు..

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Perfumes, artificial fragrances can cause headaches, asthma and migraine

    Perfumes, artificial fragrances can cause headaches, asthma and migraine,. Read to know more about..
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more