Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
మీకు ఈ పీరియడ్ లక్షణాలు ఉంటే, ఈ ఆరోగ్యసమస్యలు ఉండే అవకాశం ఉన్నది.
టమోటాలో అనేకమైన చర్మసంరక్షణ పోషక విలువలున్నాయి. అందుకే, టమోటాని అతి ముఖ్యమైన స్కిన్ కేర్ పదార్థంగా పేర్కొంటారు. అనేకమైన చర్మ సమస్యలకు టమోటా చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ప్రత్యేకించి చాలా మందిని విసిగ
మీ నెలసరి రుతుక్రమం మీ జీవితంలో ఒక భాగం, మనందరం ఈ విషయానికి ఈపాటికి అలవాటు పడిపోయే ఉంటాం. ఇది సాధారణ విషయం అని అందరికీ తెలుసు కానీ అది అనుకున్నంత సాధారణం కాకపోతే?
చాలామంది స్త్రీలకి పీరియడ్స్ లో కొంచెం వైవిధ్యత,తేడా కన్పిస్తుంది మరియు మనం ఎక్కడో అక్కడ ఏదో సరిగా జరగట్లేదని అనుకుంటాం కూడా.

మీ రుతుక్రమం మీ ఆరోగ్యం గూర్చి చాలా చెప్తుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికి పీరియడ్స్ మంచి సూచకాలు. అక్కడేదైనా సరిగ్గా లేకపోతే వెంటనే మీ నెలసరిపై ప్రభావంతో తెలిసిపోతుంది.
మీకు ఏదన్నా సరిగ్గా అన్పించకపోతే వెంటనే మీ డాక్టర్ తో ఈ విషయం తెలియజేయటం మంచిది.
మేము ఇక్కడ వివిధ ఆరోగ్య సమస్యలను సూచించే పీరియడ్స్ లక్షణాలను లిస్టుగా అందించాం.చదివి అవేంటో తెలుసుకోండి.

1. రెగ్యులర్ గా పెద్ద రక్తం గడ్డకట్టి స్రావంగా అవుతుంటే;
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టిన స్థితిలో స్రవించడం సాధారణమే. కానీ ఆగకుండా రక్తం గడ్డకట్టిన స్థితిలో, పరిమాణంలో పెద్దవిగా అన్పిస్తే అవి గర్భాశయ ఫైబ్రాయిడ్లు కావచ్చు. ఇవి గర్భాశయంలో పెరిగే క్యాన్సర్ కాని అదనపు కణజాలాలు.

2.భారీగా రక్తస్రావం అవుతుంటే;
మీకు భారీ స్రావం అవటం మీ గర్భాశయంలో పాలిప్స్ లేదా ఫైబ్రాయిడ్లు ఉన్నాయనటానికి గుర్తు కావచ్చు. మీకు శ్వాస సరిగా ఆడకపోతే, భారీగా రక్తస్రావం అవుతున్నప్పుడు మత్తుగా, కళ్ళుతిరుగుతున్నట్లు ఉంటే, వైద్యున్ని సంప్రదించాలి.

3.ఏడురోజుల కన్నా ఎక్కువగా నెలసరి ఉంటే;
ఇలా జరగటానికి చాలా కారణాలు ఉండవచ్చు. మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం. సాధారణం కన్నా ఎక్కువసమయం రుతుక్రమం తీసుకుంటే, అది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఓఎస్) మరియు గర్భాశయ పాలిప్స్ వలన కావచ్చు.

4. మీ నెలసరి 20 రోజులలోపే వచ్చేస్తుంటే;
సడెన్ గా మీ రుతుక్రమ వలయం చిన్నదైపోయి, త్వరగా పీరియడ్స్ వచ్చేస్తుంటే, అది మీ అండాశయంలో లోపాలు లేదా థైరాయిడ్ సమస్యను సూచిస్తుంది. పిసిఓస్ లేదా గర్భాశయ పాలిప్స్ కూడా కావచ్చు.

5. పీరియడ్ రాలేదు కానీ మీరు గర్భవతి లేదా పాలిచ్చే తల్లి కూడా కాదు;
మీరు చాలా మానసిక వత్తిడిలో ఉంటే,లేదా ఏదైనా ఎక్కువ శ్రమనిచ్చే వ్యాయామాలు చేస్తూ ఉంటే, దానివల్ల మీ పీరియడ్ సరైన సమయానికి రాకపోవచ్చు. థైరాయిడ్ సమస్య కూడా మీ నెలసరిని ఆపేస్తుంది. కానీ అదేపనిగా రాకుండా ఉంటే మాత్రం వైద్యుడితో పరీక్ష చేయించుకోండి. అది హార్మోనల్ అసమతుల్యత వలన కావచ్చు.



Click it and Unblock the Notifications
