For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు నొప్పి కారణాలు, లక్షణాలు, తగ్గడానికి సింపుల్ చిట్కాలు!

|

సీజ‌న్ మారిందంటే చాలు. చాలా మందికి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. దీంతో పాటు అనేక మందిని గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్‌ పెయిన్‌) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమగాలి సరి పడకపోవడం వల్ల, అలర్జీలు, డ్రై హెయిర్, కాలుష్యం, స్మోకింగ్, జలుబు, దగ్గు, ఫ్లూ మొదలగు కారణాలతో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది.

గొంతు నొప్పితో పాటు, గొంతులో కిచ్ కిచ్, దురద, ఇరిటేషన్ , గొంతు, మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనబడుతాయి, ఆహార, పానియాలు మ్రింగడానికి చాలా ఇబ్బంది పడుతారు. వారం రోజులకూ తగ్గకపోతే, గొంతునొప్పితోపాటు అనుబంధ సమస్యలు జలుబు, దగ్గు మరియు ఫ్లూ, ఫీవర్, రన్నీ నోస్, ముక్కుదిబ్బడ, తలనొప్పి, పొట్ట ఉదరంలో నొప్పి, వాంతులు వంటివి తోడవుతూ ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఆహారంతో గొంతునొప్పి మాయం అవుతుందా అంటే అవుననే చెప్పచ్చొ. మీ గొంతు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు మీకు తెలియగానే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ప్రారంభించాలి. దాంతో గొంతు నొప్పి చెక్ పెట్టవచ్చు. మనం సాధారణంగా ఇంట్లో వంటకు వినియోగించే కొన్ని వస్తువులు గొంతు నొప్పిని నివారిస్తాయి. గొంతునొప్పిగా ఉంటే ఎవరైనా సాధారణంగా మొదటగా ఇంటివైద్యాన్నే ఆశ్రయిస్తారు.

ఉదాహరణకు హెర్బల్ టీ గొంతు నొప్పికి చాలా అద్భుతమైనటువంటిది. దీనికి కొంచెం అల్లం చేర్చితే చాలు. ఫలితం మెండుగా ఉంటుంది. అంతే కాదు గొంతు ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. వేడి వేడి సూపులు.. మరికొన్నిఇతర ఆహారాలు కూడా గొంతు నొప్పిని చాలా సులభంగా తగ్గిస్తాయి. ఎక్కువగా గొంతు నొప్పితో బాధపడుతుంటే కనుక హాట్ చికెన్ సూప్ లేదా టమోటో సూప్ వంటివి చాలా అద్భుతంగా పనిచేసి గొంతునొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది. ఇవి మాత్రమే కాదు ఈ కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే గొంతు నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వేడి నీటితో ఉప్పు వేసి గార్గిలింగ్ చేయడం 1.

1. వేడి నీటితో ఉప్పు వేసి గార్గిలింగ్ చేయడం 1.

ఒక టేబుల్ స్పూన్ గ‌ళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి క‌లియ‌బెట్టాలి. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు ఈ పని చేయరాదు.

2. హాట్ టడ్డీ:

2. హాట్ టడ్డీ:

గొంతు నొప్పి నివారించడంలో హాట్ టడ్డీ గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా జలుబు కూడా ఎఫెక్టివ్ గా తగ్గతుంది. వేడి నీటిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంతో పాటు, మంచి నిద్రపడుతుంది.

మరో రెమెడీ: 2 oz విస్కీ, ఒక స్పూన్ తేనె, 4 ఔన్సుల హాట్ వాటర్, ఒక నిమ్మకాయలోని సగ భాగం నిమ్మరసం. ఈ పదార్థాలన్నింటిని ఒక మగ్ లో పోసి, దీనికి కొద్దిగా తేనె చేర్చి వేడి నీళ్లు జోడించి బాగా మిక్స్ చేసి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి తాగితే చాలు మంచి ఫలితం ఉంటుంది

3. యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ :

3. యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ఎసిడిటి లెవల్స్ బ్యాక్టీరియాను ఎఫెక్టివ్ గా నాశనం చేస్తుంది. గొంతు నొప్పి, గొంతులో దురదను తగ్గిస్తుంది ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కు ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి, ఒక కప్పు వేడి నీటిలో మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, వేడి వేడిగా తాగాలి

4. వెల్లుల్లి తినాలి :

4. వెల్లుల్లి తినాలి :

గొంతు నొప్పి తగ్గించడంలో వెల్లుల్లి గ్రేట్ రెమెడీ. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడుతుంది. క్రిములను నాశనం చేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.

ఒక ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బను తీసుకుని, నమిలి మ్రింగడం వల్ల దగ్గు మందులా పనిచేస్తుంది.

వర్షాకాలంలో జలుబు దగ్గు నివారించే ట్రెడిషినల్ హోం రెమెడీస్ వర్షాకాలంలో జలుబు దగ్గు నివారించే ట్రెడిషినల్ హోం రెమెడీస్

5. స్టీమింగ్ :

5. స్టీమింగ్ :

ఒక బౌల్లో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అవసరం అయితే అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి స్టీమ్ చేయాలి. ఆవిరి పట్టడం వల్ల ముక్కుదిబ్బడ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

6. కేయాన్ :

6. కేయాన్ :

కేయాన్ లో క్యాప్ససిన్ అనే కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అర టీస్పూన్ కేయాన్ పెప్పర్ కు , 1 కప్పు బాయిలింగ్ వాటర్ మిక్స్ చేసి, ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. గొంతు నొప్పి తగ్గించడంలో గ్రేట్ హోం రెమెడీ.

7. లికోరైస్ రూట్ టీ :

7. లికోరైస్ రూట్ టీ :

లికోరైస్ రూట్ లో యాంటీ వైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది గొంతు నొప్పి, గొంతు వాపు, చీకాకును నివారిస్తుంది, మ్యూకస్ ను స్మూత్ గా మార్చుతుంది.

ఒక కప్పు లికోరైస్ రూట్, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, 1 టీస్పూన్ లవంగాల పొడి, చమోమెలీ ఫ్లేవర్ కొద్దిగా తీసుకుని, అన్నింటింటి మిక్స్ చేసి, టీలా తయారుచేసి, తాగాలి.

8. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

8. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

గొంతునొప్పికి ఉపశమనం కలిగించే వాటిలో బెస్ట్ ఫ్లూయిడ్ వాటర్. అలాగే హెర్బల్ టీ, ఆరెంజ్ జ్యూస్ వంటివి తీసుకోవాలి. కెఫిన్, ఆల్కహాల్ వంటివి నివారించాలి. గొంతు నొప్పి నివారించడంలో ఫ్లూయిడ్స్ న్యాచురల్ రెమెడీస్.

9. బేకింగ్ సోడా టీ :

9. బేకింగ్ సోడా టీ :

బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది గొంతులో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇందులో ఉండే ఆల్కలైన్ నేచర్ గొంతులోని కణాలను స్మూత్ గా మార్చి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది

10. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించడం:

10. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించడం:

బ్యాక్టీరియాను నాశనం చేయడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

హైడ్రోజన్ పెరాకైడ్ ను తీసుకుని, అందులో కొద్దిగా నీరు మిక్స్ చేసి, వేడి చేయాలి. ఈ నీటితో గార్గిలింగ్ చేసి నీరును ఉమ్మేయాలి.

11. దానిమ్మ:

11. దానిమ్మ:

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్, ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ మరియు వాపులను తగ్గిస్తుంది.

ఒక దానిమ్మకాయలోని విత్తనాలు తీసుకుని జ్యూస్ చేసి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. గొంతు నొప్పి తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ రెమెడీ

12. అల్లం:

12. అల్లం:

గొంతు నొప్పిని పోగొట్టుటలో అద్భుతంగా పనిచేసే ఔషదం అల్లం రసం. అల్లంను నీళ్ళతో కానీ లేదా ఆల్కహాల్ తోకానీ మరిగించడం వల్ల ‘జింజర్ ఎలా' అనే ఓ చిక్కటి ద్రవం తయారవుతుంది. ఇది తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గొంతు నొప్పిని క్షణాల్లో పోగొడుతుంది.

English summary

Quick Sore Throat Remedies That You Can Make At Home

These simple home remedies for sore throat that we have mentioned here will help you get rid of sore throat as fast as it came.
Story first published:Wednesday, June 14, 2017, 12:02 [IST]
Desktop Bottom Promotion