వక్షోజాల సైజు హఠాత్తుగా పెరగటానికి 8 కారణాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చాలామంది స్త్రీలకి తమ వక్షోజాల పరిమాణం ఇదివరకూ ఉన్నట్లు అన్పించదు. సరైన ఆకారంలో స్తనాలు ఉండటం మంచిదే కాని, వాటి పరిమాణం అంతకంతకూ పెరిగిపోతుంటే శరీరంలో ఏదో తప్పు జరుగుతున్నట్లు అర్థం. స్తనాలు అనేక కొవ్వు కణాలతో నిర్మితమవుతాయి అందుకని శరీర బరువు పెరగటం కూడా ఒక ముఖ్యకారణం కావచ్చు.

ఇంకా ఇతరకారణాల వల్ల కూడా మీ స్తనాల సైజు పెరగవచ్చు మరియు దీనిపట్ల మీరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటివి నిర్లక్ష్యపర్చటం వలన నష్టం జరుగుతుంది. అందుకని మీ శరీరమార్పుల గురించి అవగాహన కలిగివుండటం, చిన్నచిన్న విషయాలు కూడా పట్టించుకోవడం అవసరం. అంటే మీ పాత మరియు కొత్త పుట్టుమచ్చల లెక్క రాసుకోమని చెప్పట్లేదు కానీ వక్షోజాల సైజు పెరగటం తగ్గటం ముఖ్యమైన శరీరమార్పులను సూచిస్తుంది. అందుకని ఆ అవగాహన తప్పనిసరి.

స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

స్తనాల పరిమాణం పెరగటానికి ఎన్నో కారణాలుండవచ్చు. ఈ విషయం కూడా మీకు ఏ లింగరీ షాపుకి వెళ్ళి,బ్రాలు కొనుక్కుందామనుకున్నప్పుడే పాతవి పట్టనప్పుడు తెలుస్తుంది. సరైన శరీరాకృతి కలవారు హఠాత్తుగా తమ వక్షోజాల పరిమాణం రెండు రెట్లు పెరిగిందని తెలుసుకున్నప్పుడు బాధ అన్పిస్తుంది. అది పక్కనపెడితే, మీకు స్తనాల సైజులో తేడా కన్పిస్తే పట్టించుకోవాల్సిన ఇతర ముఖ్య విషయాలు కూడా ఉన్నాయి.

స్తనాల సైజు హఠాత్తుగా పెరగటానికి ఈ కింది 8 కారణాలుండవచ్చు..

స్తనాల సైజ్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి 10 మార్గాలు

1. యుక్తవయస్సులోకి అడుగుపెట్టడం

1. యుక్తవయస్సులోకి అడుగుపెట్టడం

స్తనాల పరిమాణం అటు ఇటూ అవ్వడానికి ఎక్కువశాతం యవ్వనదశలోకి అడుగుపెట్టడమే కారణమవ్వచ్చు - చిన్నగా స్తనాలు మొలవడం మొదలై చనుమొనల చుట్టూ ఉండే ప్రదేశం మెల్లమెల్లగా పెద్దదయి పూర్తి స్తనంగా మారుతుంది. ఇది ఒకరాత్రే జరిగిపోదు, కొన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టవచ్చు.

2. రుతుక్రమం

2. రుతుక్రమం

అండం విడుదలైన ప్రతిసారీ ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు మీ శరీరంలో పెరగటం వలన మీ స్తనాలలోకి రక్తప్రసరణ ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల మీ వక్షోజాల సైజు పెరిగినట్లు, సున్నితంగా మారినట్లు గమనిస్తారు. సాధారణంగా నెలసరి ముందు నీటిస్థాయిని నిలకడగా ఉంచటానికి స్తనాల సైజు పెరుగుతుంది.

3.గర్భం

3.గర్భం

కడుపుతో ఉన్నప్పుడు స్తనాల సైజు పెరగటం సర్వసాధారణం మరియు దానిగురించి మీరు చింతించక్కర్లేదు. గర్భసమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వలన, మీ స్తనాలలోకి రక్తప్రసరణ అధికంగా జరిగి అవి ఉబ్బినట్లు కన్పిస్తాయి.

4. బరువు పెరగటం

4. బరువు పెరగటం

అనేక మహిళలు అడిగే ప్రశ్న , ‘ 30 ఏళ్ల తర్వాత స్తనాలు పెరుగుతాయా?' అని. దానికి జవాబు, అవును, ముఖ్యంగా మీరు బరువు పెరిగితే తప్పకుండా. మీ స్తనాలలో స్తన కణజాలం, గ్రంథులు మరియు కొవ్వు కణజాలం ఉంటాయి. దానివల్ల మీ బరువు పెరగగానే మీ స్తనాల పరిమాణం కూడా పెరుగుతుంది.

5. సెక్స్

5. సెక్స్

రతి సమయం మధ్యలో కూడా మీ స్తనాల పరిమాణం పెరిగినట్లు అన్పించవచ్చు. ఎందుకంటే సెక్స్ ముందు జరిగే ఫోర్ ప్లేలో రక్తప్రసరణ బాగా జరిగి, మీ గుండెవేగం కూడా పెరుగుతుంది. అందువల్ల మీ స్తనాల పరిమాణం పెరిగినట్లు అన్పించి రక్తనాళాలు కూడా ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. మీ చనుమొనలు కూడా బయటకి పొడుచుకువచ్చి చుట్టూరా ప్రదేశం కూడా కొంచెం విస్తరిస్తుంది.

6. గర్భనిరోధక మాత్రలు

6. గర్భనిరోధక మాత్రలు

గర్భనిరోధక మాత్రల వాడకం కూడా స్తనాల పరిమాణం పెరగటానికి ఒక కారణం కావచ్చు. ఈ మాత్రలలో ఉండే కొన్ని పదార్థాలు స్తనాల సైజు పెరగటానికి కారణమవుతాయి. అదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ మందులలో ఈస్ట్రోజెన్ ను ఎక్కువ వాడటం మానేసారు. అందుకని ఆ మందులు వాడుతున్నప్పుడు మీ స్తనాల సైజు పెరిగినట్లు అనిపించినా ఫర్వాలేదు.

7. వక్షోజాలలో గడ్డలు

7. వక్షోజాలలో గడ్డలు

మీ స్తనాలలో గడ్డలు ఉన్నట్లు, సైజు పెరిగినట్లు అన్పిస్తే వెంటనే మీ వైద్యుడితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఏవన్నా వక్షోజాలలో సమస్యలుంటే వెంటనే తెలుస్తుంది.

8.శారీరక వ్యాయామం లేకపోవటం

8.శారీరక వ్యాయామం లేకపోవటం

మహిళల్లో స్తనాల పరిమాణం పెరగటానికి ఇది కూడా మరొక కారణం కావచ్చు. వ్యాయమం తప్పనిసరి మరియు మీరు చాలా కొవ్వు పదార్థాలు తింటూ, సరిగా వ్యాయామం కూడా చేయకపోతే మీ స్తనాల సైజు వేగంగా పెరుగుతుంది. అందుకని తప్పనిసరిగా వ్యాయామం చేసి స్తనాల పరిమాణాన్ని అనవసరంగా పెరగనీయకుండా చూసుకోండి.

English summary

8 Reasons For Sudden Increase In Breast Size

These changes could cause concern in many women as some women are comfortable having smaller size whereas some women crave to own a bigger size. So, if you are worried about the sudden changes during any phase of life then here are some common factors that could cause those changes.