ఉల్లి థైరాయిడ్ ను తరిమేస్తేంది.. చాలా రోగాలకు చెక్ పెడుతుంది

Written By: Bharath
Subscribe to Boldsky

ఉల్లిపాయ వల్ల చాలా లాభాలున్నాయి. థైరాయిడ్ ను నయం చేయడానికి ఉల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు.

సెయింట్ పీటర్స్ బర్గ్కు చెందిన ఇగోర్ నజ్జాకిన్ అనే వైద్యుడు థైరాయిడ్ క్యాన్సర్ చికిత్స కోసం ఒక ప్రిస్క్రిప్షన్ను రాశాడు. అందులో అందులో ఆయన ఉల్లిని కూడా ఉపయోగించమని పేషెంట్ కు సూచించాడు.

థైరాయిడ్ సమస్యల నివారణకు

థైరాయిడ్ సమస్యల నివారణకు

ఒక ఎర్ర ఉల్లిగడ్డను తీసుకుని కట్ చేయండి. వాటితో సున్నితంగా మీ మెడ దగ్గర మసాజ్ చేసుకోండి. థైరాయిడ్ గ్రంథులు ఉండే చోట వాటితో రుద్దుకోండి. ఇలా సాయంత్రం పూట చేయడం మంచిది. తర్వాత మీరు దాన్ని కడుక్కోకుండా రాత్రి అలాగే నిద్రపోండి. ఉల్లిలోని ఔషధ గుణాలు థైరాయిడ్ సమస్యలను పరిష్కరించగలవు.

చాలా వ్యాధుల నుంచి ఉపశమనం

చాలా వ్యాధుల నుంచి ఉపశమనం

ఉల్లిగడ్డ థైరాయిడ్ కు మాత్రమే కాదు చాలా వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని ఎక్కువగా వినియోగించడం మంచిది. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఇందులో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

యాంటీబయోటిక్ గా

యాంటీబయోటిక్ గా

ఉల్లిపాయా యాంటీబయోటిక్ గా పని చేస్తుంది. ఫ్లూ నివారించే శక్తి దీనికి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిహిస్టామైన్, యాంటి కొలెస్ట్రాల్ లక్షణాలు ఉల్లిపాయలో ఉంటాయి. ఉల్లిపాయలు శరీరంలో ఉన్న మలినాలను, వ్యర్థాలను తొలగిస్తాయి,

సహజసిద్ధమైన మెడిసిన్

సహజసిద్ధమైన మెడిసిన్

ఉల్లిపాయ జలుబు, దగ్గు సమస్యలకు సహజసిద్ధమైన మెడిసిన్ గా పని చేస్తంది. అయితే కేవలం ఉల్లిపాయను మాత్రమే తీసుకోకుండా తేనెతో కలిపి ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే మంచిది. దీంతో దగ్గు ఈజీగా తగ్గుతుంది. ఇందులోని సల్ఫర్ సమ్మేళనాలు గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను, డయాబెటిస్, కీళ్ళనొప్పులను తగ్గిస్తాయి. అయితే సేంద్రియంగా పండిచిన ఉల్లిలో ఎక్కువ ఔషధ గుణాలుంటాయి.

జలుబుకు మంచి ఔషధం

జలుబుకు మంచి ఔషధం

ఉల్లిపాయలు జలుబును తగ్గించానికి బాగా ఉపయోగపడతాయి. మీరు పచ్చి ఉల్లిగడ్డను తింటే మంచిది. లేదంటే ఉల్లిని ఉడికించిన నీటిలో కాస్త అల్లం, తేనె కలుపుకుని తాగినా మంచిదే. అందువల్ల జలుబు చేసినప్పుడు ఉల్లిపాయ తినడం చాలా మంచిది. ఉల్లిపాయరసం + తేనె + అల్లం కలుపుకుని తాగితే కూడా చాలా మంచిది.

జ్వరం నుంచి ఉపశమనం

జ్వరం నుంచి ఉపశమనం

జ్వరం నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి కూడా ఉల్లి ఉపయోగపడుతుంది. బంగాళాదుంపల ముక్కలు, ఉల్లిపాయలు ముక్కలు, కాసిన్ని వెల్లుల్లి ముక్కలు మెత్తగా చేసుకోండి. తర్వాత మీరు ఆ మిశ్రమాన్ని అరికాలపై ఉంచి సాక్స్ ధరించండి. మీ నుదిటిపై ఆపిల్ సైడర్ వెనీగర్ లో టవల్ ని తడిపి ఉంచుకోండి. త్వరగా జ్వరం తగ్గుతుంది.

దగ్గుకు

దగ్గుకు

ఉల్లిపాయను కట్ చేసుకుని దాని నుంచి రసం తీసుకోండి. ½ టేబుల్ స్పూన్ బ్రౌన్ సుగర్ తీసుకోండి. ఈ రెండిని మిక్స్ చేసి సిరప్ తయారు చేసుకోండి. దాన్ని రోజు రెండుసార్లు తాగితే చాలు.ఉల్లిపాయ రసంలో కాస్త తేనేను కలుపుకుని తాగితే కూడా చాలా మంచిది.

చెవికి సంబంధించి

చెవికి సంబంధించి

చెవికి సంబంధించిన నొప్పితో బాధపడుతుంటే చెవిలో ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకుంటే చాలు. త్వరగా నొప్పి తగ్గుతుంది.

కంటికి సంబంధించి

కంటికి సంబంధించి

ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కళ్లనిండా నీరు పెట్టుకుంటారు. అయితే దాని వల్ల మీకు మంచే జరుగుతుంది. కళ్లలోని మలినాలను ఉల్లిపాయ ఆ విధంగా తొలగిస్తుంది.

కట్ అయితే

కట్ అయితే

ఏదైనా కట్ చేసేటప్పుడు చెయ్యి తెగి రక్తం వస్తూ ఉంటుంది. అయితే ఉల్లిపాయ ముక్కను తీసి అక్కడి పెట్టి కట్టు కడితే చాలు త్వరగా తగ్గిపోతుంది.

శస్త్రచికిత్స గాయాలను నయం చేస్తుంది

శస్త్రచికిత్స గాయాలను నయం చేస్తుంది

శస్త్రచికిత్స చేసినప్పుడు గాయాలు లేదా పుండ్లు ఏర్పడుతుంటాయి. వాటిని కూడా ఉల్లి నయం చేస్తుంది. అక్కడ కాసింత ఉల్లిపాయ రసం పూస్తే చాలు త్వరగా పుండ్లు మానిపోతాయి.

ఇన్ ఫెక్షన్ రాకుండా

ఇన్ ఫెక్షన్ రాకుండా

ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఉల్లి బాగా పని చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని దెబ్బతగిలిన చోట పూస్తే మీకు ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రావు.

కాలిన గాయాలకు

కాలిన గాయాలకు

వంట చేసేటప్పుడు సాధారణంగా చేతులుకాలుతుంటాయి. అలాంటి సందర్భంలో ఉల్లిపాయను ముక్కను కాలిన చోట ఉంచితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

తేనెటీగలు కుట్టినప్పుడు

తేనెటీగలు కుట్టినప్పుడు

తేనెటీగ లేదా కందిరీగ, తదితర క్రిమికీటకాలు కుట్టినప్పుడు మీకు చాలా బాధ అనిపిస్తుంది. అయితే మీరు వెంటనే దాన్ని రుద్దడం చేయవద్దు దాంతో అక్కడ ఉన్న విషం మీ శరీరం మొత్తం పాకుతుంది. ఉల్లిపాయ రసాన్నిగానీ లేదంటే ఉల్లిపాయ ముక్కను తీసుకుని అక్కడ కాసేపు ఉంచినా, చిన్నగా రుద్దినా ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుుగుతుంది.

English summary

red onion treatment for thyroid

Red Onion: Do Wonders For The Thyroid Gland And Its Other Medicinal Qualities. Doctors confirmed..Red onion do wonders for the thyroid gland.
Subscribe Newsletter