సమోసా వెర్సస్ పిజ్జా: వీటిలో ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకుందాం!

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

సమోసా వర్సస్ పిజ్జా అని ఈ ఆర్టికల్ టైటిల్ చదువుతుండగానే మీకు నోరూరి ఉండుంటుంది, కదూ? ఒక వేళ మీరు గనక ఆఫీస్ పనితో బిజీగా ఉండి లంచ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నట్టయితే సమోసా వెర్సస్ పిజ్జా టైటిల్ మీ ఆకలిని మరింతగా పెంచి ఉండుంటుంది.

అయితే, మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, మనలో చాలా మందికి కంఫర్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ అంటే ఇష్టత ఉంటుంది. ఎందుకంటే, అవి అమోఘమైన రుచితో మనల్ని సంతోషపెడతాయి. అయితే, జంక్ ఫుడ్ పై మనకుండే ఇష్టం గురించి మనలో చాలా మంది ఒప్పుకోరు.

అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం కొన్నిపద్దతులను పాటించాలి. అందులో ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం. తద్వారా అనేకరకములైన వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకున్నవారమవుతాము. ఈ విషయం మనందరికీ తెలుసు.

samosa calories

మనందరికీ తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, తరచూ జంక్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన అధిక బరువు సమస్యతో పాటు అనేక రకములైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇవన్నీ తెలిసినప్పటికీ మనం జంక్ ఫుడ్స్ పై అభిమానాన్ని తగ్గించుకోలేకపోతున్నాము. మన టేస్ట్ బడ్స్ ని ఎప్పుడైనా ఒకసారైనా సంతృప్తిపరచాలని జంక్ ఫుడ్స్ పై మక్కువ పెంచుకుంటున్నాము. ఇది సహజసిద్ధమైన మానవ స్వభావము.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యుల సూచన మేరకు జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలనే ఆలోచనతో పాటు అప్పుడప్పుడు జంక్ ఫుడ్స్ తిన్నా నష్టం లేదు అన్న భావన ఎక్కువైపోతోంది.

అందుకే, మనలో చాలా మంది ఆహారంలో కాస్తంత మార్పు కోసం తమ ఫేవరెట్ జంక్ ఫుడ్స్ ని తీసుకుంటున్నారు.

ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అనేకరకాలైన జంక్ ఫుడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీస్ వంటి వెస్ట్రన్ జంక్ ఫుడ్స్ ఒకవైపు సమోసాలు, కచోరీలు, ఛాట్ వంటి నోరూరించే భారతీయ జంక్ ఫుడ్స్ మరోవైపు జనాలని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

మన చుట్టూ ఇన్ని రకాల రుచికరమైన అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్ ఉన్నప్పుడు వీటినుంచి దూరంగా ఉండటం మనకి కాస్త కష్టతరమే.

ఒకవేళ, ఈ జంక్ ఫుడ్స్ వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే జంక్ ఫుడ్స్ ని రుచి చూద్దామని మీరు భావిస్తున్నవారైతే ఏయే జంక్ ఫుడ్స్ అనారోగ్యకరమైనవో తెలుసుకుంటే సరిపోతుంది. తద్వారా, అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఈ ఆర్టికల్ లో, ప్రపంచవ్యాప్తంగా భోజనప్రియుల మనసు దోచుకున్న రెండు రకాల జంక్ ఫుడ్స్ అంటే పిజ్జా మరియు సమోసాలలో ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకుందాం.

samosa calories

పిజ్జా క్యాలరీస్:

పిజ్జా వర్సెస్ సమోసా: ఏది ఆరోగ్యకరమైనది?

పిజ్జాలో కార్బోహైడ్రేట్స్ అధికశాతం ఉంటాయన్న విషయం తెలిసినదే. పిజ్జా తయారీలో బేస్ ఇంగ్రీడియెంట్ బ్రెడ్ అన్న విషయం కూడా తెలిసినదే. అదనంగా చీజ్ రూపంలో కొవ్వుతో పాటు అధిక కేలరీల మాంసం అలాగే కొన్ని రకాల కూరగాయలు పిజ్జాపై దర్శనమిస్తాయి. పిజ్జా అనేది వేపుడు పదార్థం కాదు ఉడకబెట్టిన పదార్థం.

మరోవైపు, సమోసా అనేది కొన్ని రకాల స్పైసెస్, బఠాణీలు అలాగే పొటాటోతో కలిపి ఒక డౌ రూపంలో తయారు చేసి డీప్ ఫ్రై చేసిన పదార్ధం. పొటాటోలో కూడా అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సమోసాలని డీప్ ఫ్రై చేస్తారు. అందువల్ల, వీటిలో కొవ్వు శాతం కూడా అధికమే.

బేక్ చేసిన పీజ్జాల కంటే సమోసాలలో కొవ్వు శాతం అలాగే నూనె శాతం అధికంగా ఉంటాయి . సమోసాలను డీప్ ఫ్రై చేయడమే ఇందుకు కారణం.

100 గ్రాముల పిజ్జాలో 276 కేలరీలుంటే, 100 గ్రాముల సమోసాలొ దాదాపు 400 కేలరీలుంటాయన్న విషయం మనం తెలుసుకోవాలి.

కాబట్టి, కొవ్వు శాతంతో పాటు కార్బోహైడ్రేట్స్ శాతం ఎక్కువగా ఉండటం వలన పిజ్జాలని కూడా అనారోగ్యకరమైన స్నాక్ గా భావించాలి. అలాగే, సమోసాలో కూడా అనారోగ్యకరమైన కొవ్వు శాతం ఎక్కువ.

అందువలన, మీకు గనక సమోసా తినాలనిపించినట్లైతే బేక్డ్ లేదా షాలో ఫ్రైడ్ సమోసాని ప్రిఫర్ చేయండి. డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రై సమోసా చాలా బెటర్.

English summary

Pizza Or Samosa – Which Is Healthier

Junk food is something most of us love and indulge in from time to time. Some junk foods are healthier than the others. Find out if pizza is healthier than samosa or vice versa, here.
Story first published: Thursday, December 7, 2017, 8:00 [IST]
Subscribe Newsletter