For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో ! అగరబత్తులు నిజంగా హానికరమా ? అది తెలుసుకోవాలంటే ఇది చదవండి

By R Vishnu Vardhan Reddy
|

అగరబత్తులు నిజంగా హానికరమా ? మనం ప్రతి రోజు ఇంట్లో ధూప దీపాల్లో భాగం గా అగరబత్తీలను వెలిగిస్తుంటాం. అది మన జీవితంలో ఒక భాగం. అగరబత్తులు నుండి వచ్చే పరిమళమైన సువాసన మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది, మరియు మనం ఉంటున్న ప్రదేశంలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుంది అని మనం భావిస్తుంటాం. ఇదంతా వింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా.

కానీ అగరబత్తులు మీకు చెడు చేస్తాయా ? అసలు సమస్య వాటిది కాదు, వాటి నుండి వెలువడే పొగది. ప్రస్తుతం మనం ఉంటున్న ప్రపంచం ఇప్పటికే పొగతో నిండిపోయి ఉంది. స్వచ్ఛమైన గాలి కరువైంది, కాలుష్యం ఎక్కువైపోయింది. మన పూర్వీకులు కాలుష్యరహిత పర్యావరణంలో జీవించారు. కానీ మనం ఇప్పుడు ఉంటున్న ప్రపంచం ఎంతో కాలుష్యంతో నిండిపోయి ఉంది. మరి ఇలాంటి సమయంలో అగరబత్తులను వెలిగించి మన చుట్టూ మరింత పొగను పెంచేలా చేయడం తెలివైన వ్యక్తులు చేసే పనేనా ?

పరిశోధకులు ఇదే విషయం పై పరిశోధనలు చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే అగరబత్తులు మనకు హాని చేస్తాయి అని కనుగొన్నారు. అవి మనకు ఎలా హాని చేస్తాయి? మన ఆరోగ్యం పై ఎంతలా ప్రభావం చూపిస్తాయో ఇపుడు తెలుసుకుందాం.

స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!

ఆ పొగలో విషతుల్యమైన పదార్ధాలు ఉంటాయి :

ఆ పొగలో విషతుల్యమైన పదార్ధాలు ఉంటాయి :

అగరబత్తులను వెలిగించినప్పుడు వెలువడే పొగలో బెంజీన్, కార్బొనైల్ మరియు పాలీ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్ వంటి క్యాన్సర్ కారక విషతుల్యమైన పదార్ధాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

మనం వాడే అగరబత్తులు ఎలాంటి పదార్ధాలను ఉపయోగించి తయారు చేశారో చాలా ముఖ్యమైన విషయం. వీటి తయారీలో మన శరీరానికి హాని కలిగించే పదార్ధాలను మరియు నూనెలను వాడుతారు. అటువంటి వాటిని మండించినప్పుడు అవి మన ఆరోగ్యం పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

కళ్ళకు మరియు చర్మానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి :

కళ్ళకు మరియు చర్మానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి :

అగరబత్తుల నుండి వెలువడే పోగొ మీ కళ్ళు మరియు చర్మానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీల పై ఈ పొగ తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. కొంత మంది దీని భారిన పడటం వల్ల, వాళ్ళ చర్మం విపరీతమైన దురదతో పాటు వివిధ రకాల చర్మ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది.

సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

విపరీతమైన మంటను కలిగిస్తాయి :

విపరీతమైన మంటను కలిగిస్తాయి :

అగరబత్తులు నిజంగా హానికరమా ? ఎవరైతే ఆస్తమా తో భాదపడుతుంటారో వాళ్లకు మాత్రం అగరబత్తుల నుండి వెలువడే పొగ చాలా హానికరం. ఈ పొగ వల్ల, మిగతా వాళ్ళు వారి యొక్క శ్వాస నాళాలు దగ్గర విపరీతమైన మంటను అనుభవిస్తారు.

మీ శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తుంది :

మీ శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తుంది :

అగరబత్తులను మీ ఇంట్లో ఎక్కువ రోజులు వాడటం వల్ల మీరు శ్వాస కోశ సంబంధిత కాన్సర్ భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అగరబత్తుల వల్ల తలెత్తే అతి ముఖ్యమైన సమస్య.

దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధులు భారినపడే అవకాశాలు ఎక్కువ :

దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధులు భారినపడే అవకాశాలు ఎక్కువ :

అగరబత్తుల నుండి వెలువడే పొగలో కార్బన్ మోనాక్సయిడ్ మరియు ఎన్నో రకాల రసాయనాలతో పాటు నైట్రోజన్ కారకాలు ఉంటాయి. వీటి వల్ల మనం ఆస్తమాతో పటు, దీర్ఘకాళిక శ్వాస కోశ వ్యాధులు బారిన పడే అవకాశాలు ఎక్కువ.

మీ శరీరం లో ఉన్న కణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి :

మీ శరీరం లో ఉన్న కణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి :

మీరు ఎంత సేపు ఈ పొగ బారినపడ్డారు మరియు ఆ పొగ ఎంత హానికరంగా ఉంది, ఆ అగరబత్తులు ఏ ఏ పదార్ధాలను ఉపయోగించి తయారు చేశారు, ఇలా ఎన్నో విషయాలపై మన శరీరంలో ఉన్న కణాలు ఎంత మేర నాశనం అవుతాయి అనే విషయం ఆధారపడి ఉంది.

ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు

మూత్రపిండాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి :

మూత్రపిండాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి :

అగరబత్తులు చాలా హానికరమా ? అవును కొన్ని అగరబత్తులలో ఐరన్, మెగ్నీషియం మరియు లెడ్ . వంటి రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇలాంటి వాటి నుండి వెలువడే పొగను మనం ప్రతిరోజూ పీల్చడం వల్ల ఈ రసాయనాలను మన శరీరంలో శుద్ధి చేయడానికి, మన మూత్రపిండాలు ఎల్లప్పుడూ విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఇది ఇలానే గనుక కొనసాగితే భవిష్యత్తులో అది మీ గుండె ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇంటి లోపల గాలిని కలుషితం చేస్తుంది :

ఇంటి లోపల గాలిని కలుషితం చేస్తుంది :

అగరబత్తుల నుండి వెలువడే పొగ ఇంటిలోని గాలి కలుషితం అవుతుంది. ఇందు వల్ల తలనొప్పి మరియు నరాల సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీ ఇల్లు మొత్తం ఈ పొగ నుండి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సయిడ్ తో నిండిపోతుంది .

English summary

Shocking! Are Incense Sticks (Agarbatti) Harmful? Read This To Find Out?

Researchers tried to study the same and came to a conclusion that the smoke from incense sticks could be harmful. Read on to know about the incense sticks health effects.
Desktop Bottom Promotion