For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రతి తర్వాత అక్కడ నొప్పిగా ఉంటే..!

  By Madhavi Lagishetty
  |

  జీవితంలో శృంగారం అత్యంత ఆవశ్యకమైనది. ఆ మధుర క్షణాలను ప్రతీ క్షణం గుర్తుండేలా అనుభవించాలని దంపతులు తహతహలాడటం సహజం. శృంగార జీవితంలో అసంతృప్తి చెందితే అది చాలా చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది.

  మీ పార్ట్నర్ ను సంతృప్తి పరిచడమే కాదు మీరు కూడా సంతృప్తి చెందడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన స్త్రీలలో శృంగారం అనంతరం జననేంద్రియాల్లో ఒరిపిడి వల్ల నొప్పి పుట్టడం సహజం.

  ఈ 10 పనులను మహిళలు శృంగారానికి ముందు యోని తో అస్సలు చేయకూడదు

  ఫలితంగా అది మీ రోజు వారి శృంగారం జీవితంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, శృంగారానికి దూరంగా ఉంటే మీ పార్ట్నర్‌కు అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పలు మార్గాలున్నాయి.

  ఐస్‌ ప్యాక్స్ వాడకం :

  ఐస్‌ ప్యాక్స్ వాడకం :

  ర‌తి క్రియ‌ అనంతరం ఒరిపిడి వల్ల జననేంద్రియాల్లో కలిగే మంట లేదా నొప్పి నుంచి తక్షణం బయటపడేందుకు సులువైన మార్గం ఐస్‌ప్యాక్‌తో కాపడం పెట్టడం. ఇది చాలా అందుబాటులో ఉండే చర్య. యోని భాగంలో నొప్పి తగ్గేవరకూ ఐస్‌ప్యాక్ ఉంచుకోవడం కాస్త ఉపశమనం కలుగుతుంది.

  వెచ్చటి నీళ్లతో స్నానం:

  వెచ్చటి నీళ్లతో స్నానం:

  ర‌తి అనంత‌రం యోని భాగంలో క‌లిగే నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందే మరో మార్గం వేడి నీళ్ల స్నానం. ఒళ్లు నొప్పులు మాత్రమే కాదు కాస్త భరించగలిగే వెచ్చటినీళ్లను యోని కండరాలపై పోసుకుంటే తక్షణ ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అంతే కాదు వెచ్చటి నీళ్లలో కాస్త బేకింగ్ సోడా వేసి యోని భాగాన్ని కడిగితే అది యాంటి బ్యాక్టీరియల్‌గా పనిచేసి రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

  లుబ్రికెంట్ వాడకం:

  లుబ్రికెంట్ వాడకం:

  ర‌తి చేసేటప్పుడు జననేంద్రియాల ఒరిపిడి వల్ల నొప్పి కలిగుతుంది. ఫలితంగా అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. దీన్నుంచి బయటపడేందుకు రతి సమయంలో ఏదైన లుబ్రికెంట్ వాడాలి. అంటే మెత్తటి జెల్ లేదా నూనెను వాడాల్సి ఉంటుంది. ఫలితంగా మాయిశ్చరైజర్‌ కోల్పోకుండా ఒరిపిడి వల్ల కలిగే బాధలనుంచి తప్పించుకోవచ్చు. లేదా శృంగారం అనంతరం కూడా లుబ్రికెంట్ వాడితే ఫలితం ఉంటుంది.

  కొబ్బరి నూనె వాడకం :

  కొబ్బరి నూనె వాడకం :

  కెమికల్ లుబ్రికెంట్స్ ఉపయోగించడం కన్నా సహజంగా లభించే కొబ్బరినూనేను శ్రుంగార ప్రక్రియలో లుబ్రికెంట్‌గా వాడితే ప్రయోజనం ఉంటుంది.

  లోదుస్తులకు దూరంగా :

  లోదుస్తులకు దూరంగా :

  ఇంట్లో సాధారణంగా ఉన్నప్పడు అనవసరంగా బిగుతైన లోదుస్తులకు దూరంగా ఉండటం కూడా అవసరం. బిగుతైన అండర్‌వేర్ ధరించడం వల్ల ఒరిపిడి ఎక్కువై అసౌకర్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. గాలి తగిలేలా మెత్తటి దుస్తులు ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది.

  యోని క్లీన్ గా , హెల్తీగా ఉంచుకోవడానికి 16 చిట్కాలు

  కిగాల్ వ్యాయమం :

  కిగాల్ వ్యాయమం :

  ఇది చాలా సులభమైన వ్యాయామం. కుర్చీలో కూర్చొని నడుముభాగాన్ని లేపి మళ్లీ కూర్చోవడం ఈ వ్యాయామం రిపీట్ చేయడం ద్వారా, శరీరంలోని కింది భాగానికి ఉపశమనం కలుగుతుంది.

  ఒరిపిడి నుంచి దూరంగా :

  ఒరిపిడి నుంచి దూరంగా :

  శృంగారం సమయంలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఒరిపిడి కలగకుండా దూరంగా ఉండటం మేలు. స్త్రీపురుషులు ఇరువురు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే శృంగారం సాఫీగా సాగుతుంది.

  శుభ్రత :

  శుభ్రత :

  జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ప్రధానం. వ్యక్తిగత శుభ్రత లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

  రసాయనాలకు దూరంగా :

  రసాయనాలకు దూరంగా :

  రసాయన పదార్ధాలతో తయారు అయిన సబ్బులు కానీ, ఇతర లుబ్రికెంట్స్ కానీ యోనిలోపలి భాగాల్లోకి వెళ్లనీయకుండా జాగ్రత్తపడాలి.

  గోళ్లతో గోకడం :

  గోళ్లతో గోకడం :

  యోని ప్రాంతంలో ఎక్కువగా దురద వేసినప్పడు గోళ్లతో గోకడం చేయకూడదు. శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. అంతేకానీ ఒరిపిడిపై కలిగిన సున్నిత భాగాల్ని గోళ్లతో గోకితే మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

  English summary

  Ten tips to soothe a sore vagina

  A sore vagina after a rough sex session is unavoidable. It can also happen if you are a first timer. While it can actually leave you fatigued, tired and in pain, it needs just little attention from you to get back in shape and make you ready for more action. There are a lot of things you can do to heal it, here are a few of them:
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more