కాపర్ టంగ్ క్లీనర్ తో నాలుకు శుభ్రం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్స్

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనం ప్రతిరోజూ నోటితో ఎన్నో పనులను చేస్తుంటాం. నోటి లోపల ఉండే సూక్ష్మ జీవాలు నోటితో చేసే పనులలో సహాయం చేస్తాయి. వీటి గురించి మరింత లోతుగా అర్ధం చేసుకొనే క్రమం లో, నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి అనే అవగాహనా కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రాచీన కాలం లో ఎంతో ప్రఖ్యాతి చెందిన వివిధ పద్దతుల ద్వారా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఎన్నో అధ్యయనాలు ఒక పద్దతి గురించి మాత్రం విసృత్తంగా చెప్పాయి, అదే నాలుకను గీకటం. దీనినే జిహ్వ ప్రక్షాళన అనికూడా అంటారు.

నాలుక గీకటం అనేది చాలా సులభమైన పద్దతి. సాధారణంగా పళ్ళు తోముకునే ముందు నాలుక గీకటం జరుగుతుంది. ఎన్నో అధ్యయనాలు సాధారణ, సులభతరమైన ఈ పద్దతి గురించి ఏమి చెప్పాయో ఇప్పుడు తెలుసుకుందాం...

The Science of Tongue Scraping with Copper

నోటిలో ఉండకూడని సూక్ష్మ జీవాలు అంటే, చిగుర్లకు, పళ్లకు మరియు నోటి యొక్క ఆరోగ్యానికి ఏవైతే హాని చేస్తాయో అటువంటి వాటిని బయటకు పంపడానికి ఈ పద్దతి ఎంతగానో ఉపయోగపడుతుంది. అస్థిరత ఎక్కువగా ఉండే సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇవి నోటిలో ఉండే సూక్ష్మ జీవుల నుండి వెలువడిన పదార్ధాలు. నోటి నుండి వచ్చే దుర్వాసనకు ఇవే ముఖ్య కారణం.

నాలుక పై పూతలాగా పేరుకుపోకుండా అరికడుతుంది మరియు రుచి త్వరగా తెలిసేందుకు ఎంతగానో దోహదపడుతుంది.

ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్లకోసం టాప్ 10 హెల్తీ ఫుడ్స్

నోటి లోపల ఉన్న వాతావరణాన్ని మార్చివేసి, ఉద్రిక్తతలు ఎక్కువ కలగకుండా మరియు చెడు సూక్ష్మ జీవులు ఎక్కువగా పెరగకుండా కీలక పాత్ర పోషిస్తుంది.

సంప్రదాయబద్ధంగా, ఆయుర్వేద పుస్తకాల ప్రకారం చరక సంహిత అంటే నాలుకను గీకడం కోసం వాడే పరికరాలను బంగారం, వెండి, రాగి, తగరము లేదా ఇత్తడి లోహాలతో మాత్రమే తయారు చేయమని చెప్పారు.

The Science of Tongue Scraping with Copper

కొన్ని విషపదార్ధాలు నాలుక వెనుక భాగాన సేకరించబడతాయి. ఇవి అలానే గనుక ఉంటే ఊపిరి తీసుకోవడానికి అడ్డంకి సృష్టిస్తాయి మరియు నోటి నుండి దుర్వాసన రావడానికి కారణం అవుతాయి.

ఎప్పుడైతే నాలుక మరియు నోటి లోపల ఉండే కొన్ని సూక్ష్మజీవులు కొన్ని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయో, అటువంటి సందర్భంలో అస్థిర సల్ఫర్ సమ్మేళనాలు విడుదల అవ్వడం జరుగుతుంది.

దీని కారణంగానే నోటి నుండి దుర్వాసన అనేది వెలువడుతుంది. నోటిని గీకటం అనేది చాలా మంచి పద్దతి అని, అస్థిర సల్ఫర్ సమ్మేళనాలను తగ్గించడం లో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నోటి దుర్వాసనను పోగొట్టడంలో పళ్ళు తోమటం కంటే కూడా నాలుక గీకటం వల్లనే అధిక లాభం చేకూరుతుంది.

ఎందుకు రాగిణి మాత్రమే వాడాలి :

ఎందుకు రాగిణి మాత్రమే వాడాలి :

బంగారం లేదా వెండి తో నాలుక గీసే పరికరాన్ని తయారుచేస్తే చాలా అద్భుతంగా ఉండొచ్చు. కానీ, నాలుక గీసే పరికరాన్ని రాగితో చేస్తే ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయని, ఇంక ఏ లోహంతో చేసినా అన్ని లాభాలు చేకూరవని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది.

కొన్ని వందల సంవత్సరాల క్రితమే, సూక్ష్మ జీవులను తట్టుకొనే లోహంగా రాగిణి వాడేవారు. ఆ విషయాన్ని మరియు ఆ ప్రాచీన విధానాలు సరైనవే అని రుజువుచేస్తూ ఈ కొత్త అధ్యయనాలు రాగి వల్ల కలిగే అసాధారణ లాభాలను, నిజాలను వెల్లడించాయి, ధృవీకరించాయి.

 ప్రమాదకరమైన సూక్ష్మ జీవాలను అంతమొందించడం..

ప్రమాదకరమైన సూక్ష్మ జీవాలను అంతమొందించడం..

మన నోటిలో మంచి మరియు అంతగా మంచివి కాని ఇలా రెండు రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాగిణి ఉపయోగించి నాలుక గీయటం చాలా ఉత్తమం అని చెబుతున్నారు. ప్రమాదకరమైన సూక్ష్మ జీవాలను అంతమొందించడంలో రాగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నోటిలో ఉన్న మంచి సూక్ష్మ జీవులుఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సిన ఎంజైములు అందించడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది.

నోరు శుభ్రంగా ఉంచుకోక పోతే ఈ జబ్బులకు గురికాకతప్పదు...!

క్రిమినాశక గుణాలు రాగి లోహంలో చాలా అత్యధికంగా ఉన్నాయి

క్రిమినాశక గుణాలు రాగి లోహంలో చాలా అత్యధికంగా ఉన్నాయి

క్రిమినాశక గుణాలు రాగి లోహంలో చాలా అత్యధికంగా ఉన్నాయని, ఒక అధ్యయనం చెబుతోంది. అందుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ఒకానొక ఆసుపత్రి లోపలి గదిలో రాగిని ఉపయోగించి వివిధ రకాల వస్తువులను మరియు ఆ గది పరిసరాలను అలంకరించారు. దీంతో ఆయా గదులలో చెడు సూక్ష్మ జీవులు శాతం ఘననీయంగా తగ్గిందని గుర్తించారు. క్రిమి సంహారక వ్యూహాలలో భాగంగా చాలా ఆసుపత్రులు గదులను మరింత ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉంచడంలో భాగంగా, రాగితో చేయబడిన వివిధ రకాల వస్తువులను అలంకరణలో భాగంగా ఆసుపత్రుల గదులలో పెట్టడం ప్రారంభిస్తున్నాయి.

నోటిని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా అంతకు మించిన లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి :

నోటిని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా అంతకు మించిన లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి :

నాలుక గీకటం, పళ్ళు తోముకోవడం మరియు ఒక గ్లాస్ నీటిని ఉపయోగించి ఎప్పటికప్పుడు పళ్ళను పుక్కలించడం ద్వారా ఆరోగ్యవంతమైన మరియు పరిశుభ్రంగా నోటిని ఉంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా జీర్ణ ప్రక్రియ కూడా చాలా సజావుగా సాగుతుంది. నాలుక గీయటం ద్వారా రుచిని చూసే మొగ్గలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తేజవంతమవుతాయి. అందువల్ల మీరు రుచిని త్వరగా గ్రహించడమే కాకుండా, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. నాలుక పై ఉండే రుచి మొగ్గలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తేజం అవడం ద్వారా, ఉదయం పూట కాలకృత్యాలు పూర్తిగా సక్రమంగా అయ్యేలా చిన్న ప్రేగులకు సందేశాలు పంపి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాయట.

 నోటికి సంబంధించి ఎన్నో లాభాలున్నాయి..

నోటికి సంబంధించి ఎన్నో లాభాలున్నాయి..

రాగితో చేసిన నాలుక గీసే పరికరాన్ని వాడటం ద్వారా నోటికి సంబంధించి ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా రాగిని ఉపయోగించి గీకడం ద్వారా చెడు సూక్ష్మ జీవులు నోటిలో పెరగ కుండా ఇవి అరికడతాయి. లాభదాయమైన విషయాలను దృష్టిలో ఉంచుకున్నట్లైతే, రాగి తర్వాత వెండితో చేసిన నాలుక గీసే పరికరాన్ని ఉపయోగించడం ఉత్తమం. మనం చేసే పనికి తుప్పుపట్టని ఉక్కు తో చేసిన పరికరం కూడా సరిపోతుంది.

నాలుకను ఎలా గీకాలి ?

నాలుకను ఎలా గీకాలి ?

1. ప్రతి రోజు లేచిన వెంటనే మీ నాలుకను గీకండి. ఇది మీరు లేచిన వెంటనే చేయాల్సిన మొదటి పనిగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు గనుక మధ్య రాత్రుల్లో గనుక లేచినట్లైతే ఆ సమయంలో కూడా నాలుక గీకటం మంచిది. ఇలా చేసిన తర్వాత ఒక గ్లాస్ నీటిని త్రాగండి. ఇలా చేయడం ద్వారా విషపదార్ధాలు వృద్ధి చెందకుండా అరికట్ట వచ్చు.

నాలుకను ఎలా గీకాలి ?

నాలుకను ఎలా గీకాలి ?

2. మీ నాలుకను బాగా వదులు చేసి, యు ఆకారంలో ఉన్న నాలుక గీకే పరికరాన్ని తీసుకొని, సున్నితంగా నాలుక వెనుక భాగానికి వెళ్లి వెనుక నుండి ముందుకు నాలుకను గీయటం ప్రారంభించండి. వీలైనంత ఎక్కువ నాలుక వెనుక భాగానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ ప్రక్రియను 5 నుండి 10 సార్లు చేయాలి. నాలుక గీసే సమయంలో నాలుక వెనుక భాగం నుండి ముందుకు రావాలి. అలా వచ్చిన ప్రతి సరి మీ యొక్క పరికరాన్ని నీటితో కడగండి. ఇలా చేసే సమయంలో మీ గొంతులో ఇరుక్కున్న గళ్ళ కానీ లేదా ఏవైనా పదార్ధాలు లేదా చెడు సూక్ష్మజీవులు బయటకు వచ్చేస్తాయి.

నాలుకను ఎలా గీకాలి ?

నాలుకను ఎలా గీకాలి ?

3. నాలుక గీయటం అయిపోయిన తర్వాత, ప్లోరైడ్ తో తయారుచేయబడని టూత్ పేస్ట్ ని వాడి పళ్ళు తోమండి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా పుక్కలించి, ఒక గ్లాస్ నీటిని త్రాగండి.

నాలుకను ఎలా గీకాలి ?

నాలుకను ఎలా గీకాలి ?

4. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతిరోజు నోటిని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలని భావిస్తే, ఆయిల్ పుల్లింగ్ విధానాన్ని కూడా అనుసరించాల్సి ఉంటుంది. కానీ, ఇలా చేసిన తర్వాత పళ్ళను మరొక్కసారి తోముకోవాల్సి ఉంటుంది.

నాలుకను ఎలా గీకాలి ?

నాలుకను ఎలా గీకాలి ?

5. పళ్ళు తోముకొనే ముందు ఖచ్చితంగా నాలుక గీయాలి అనే ప్రక్రియను తూచా తప్పకుండా పాటించాలి అని గుర్తుపెట్టుకొని, అదొక అలవాటుగా మార్చుకోండి.

English summary

The Science of Tongue Scraping with Copper

Tongue scraping is the simple practice of scraping your tongue before brushing your teeth. Studies have shown that this simple technique: