For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి హాని చేసే ఫుడ్స్

మనకు తెలియకుండానే మనం రోజూ కొన్ని హానికర ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. ఈ ఆహారపదార్దాల నుంచి పోషకాలను పొందడానికి బదులుగా అనారోగ్యాన్ని పొందుతాము. మరి శరీరానికి హాని కలిగించే ఆహారపదార్ధాలు ఏమిటో తెలుసుకుందామ

By Y. Bharath Kumar Reddy
|

మనకు తెలియకుండానే మనం రోజూ కొన్ని హానికర ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. ఈ ఆహారపదార్దాల నుంచి పోషకాలను పొందడానికి బదులుగా అనారోగ్యాన్ని పొందుతాము. చాలా రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయకపోతే ఏ సమస్యా ఉండదు. కాని కొన్ని ఆహారాల వల్ల కడపులో వికారంగా ఉండడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.

harmful foods

అలాగే జీర్ణక్రియ కూడా సక్రమంగా సాగదు. జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగాలంటే.. కొన్ని ఆహారాల పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్, పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. మరి శరీరానికి హాని కలిగించే ఆహారపదార్ధాలు ఏమిటో తెలుసుకుందామా.

1. ఫ్రూట్ జ్యూస్

1. ఫ్రూట్ జ్యూస్

పండ్లరసాలన్నీ తాజాగా ఉంటాయి. వీటిని తాగితే అన్నీ ఆరోగ్యప్రయోజనాలే ఉంటాయని మనం అనుుంటాం. కానీ వీటిలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతుంటారు. మంచి రంగురావాలని ఇలా చేస్తుంటారు. బయటే దొరికే పండ్ల రసాలను తాగకపోవడం చాలా మంచిది. వీటిలో పంచదార కూడా ఎక్కువగా వేస్తారు. బయట మనం తాగే ఫ్రూట్ జ్యూస్ మొత్తం ఇలాగే ఉంటాయి. వీటికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లు అవుతారు.

2. గ్రానోలా బార్స్

2. గ్రానోలా బార్స్

వీటిని తయారు చేయడానికి ఎక్కువగా నట్స్, ప్రూట్స్ ఉపయోగిస్తారు. వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పోషకాలుండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వీటిని రుచి కోసం తినాలే తప్ప వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలుండవు.

3. బేక్డ్ బీన్స్

3. బేక్డ్ బీన్స్

బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొన్ని రకాల ఫైబర్స్ మనకు మేలు చేస్తాయి. కానీ ఇవి కావు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. బేక్ డ్ బీన్స్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుండవు.

4. ప్రెట్జెల్స్

4. ప్రెట్జెల్స్

వీటిని చాలామంది స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయి. వీటిలో ఎలాంటి పోషకాలుండవు. సోడియం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ అస్సలు ఉండవు. వీటిని తినడం దండుగా.

5. వెజ్జీ చిప్స్

5. వెజ్జీ చిప్స్

వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. అందువల్ల వీటిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఇవి ఆరోగ్యానికి హానికరం కూడా. అందువల్ల వీటిని తీసుకోకపోవడమే మంచిది.

6. ప్రాసెస్ చేసిన పదార్థాలు

6. ప్రాసెస్ చేసిన పదార్థాలు

చక్కెరలో ఫ్యాట్ ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు అది అంత రుచిగా ఉండదు. కొన్నిపదార్థాలను తయారు చేసేటప్పడు ఎక్కువగా రుచిరావాలని తయారీదారులు చక్కెరను ఎక్కువగా కలుపుతారు. అందువల్ల ఎక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలను తినకపోవడం చాలా మంచిది.

7. రైస్ క్రాకర్స్

7. రైస్ క్రాకర్స్

రైస్ క్రాకర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది ఆరోగ్యానికి హానికరం. దీనిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉండవు. వీటిని కార్బ్-డెన్స్ స్నాక్ అని అంటారు. దీన్ని తినకపోవడం ఆరోగ్యానికి మంచిది.

8. స్పోర్ట్స్ డ్రింక్స్

8. స్పోర్ట్స్ డ్రింక్స్

స్పోర్ట్స్ పానీయాల్లో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఎలెక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తాగకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి బదులుగా మంచి నీటిని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

9. నట్స్

9. నట్స్

నట్స్ ను ఒక మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనవే. అయితే ఎప్పుడైతే మోతాదుకు మించి వీటిని తీసుకుంటామో అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల నట్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. మోతాదుకు మించి క్యాలరీస్ శరీరానికి ఇవ్వడం కూడా చాలా హానికరం. అందువల్ల లిమిట్ లో నట్స్ తినండి.

10. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్

10. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్

వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రాసెస్ చేసిన ధాన్యాలను, అనారోగ్యకరమైన నూనెలను వీటి తయారీకి ఉపయోగిస్తారు. వీటిలో ఎలాంటి పోషకాహారాలుండవు. కాబట్టి వీటిని తినడం అవసరం లేదు. ఈ ఆహారాలన్నీ ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వకపోగా.. పైగా అనారోగ్యానికి హానికరం చేస్తాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండండి.

English summary

foods bad for the body

Here, we have listed the foods that are harmful for your health. So, read further to know about the list of bad foods that you need to keep off from.
Story first published:Saturday, November 18, 2017, 12:12 [IST]
Desktop Bottom Promotion