For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదే పది నిముషాల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే మార్గాలు..

రోగనిరోధక శక్తి అనేది నిజంగా ఒక వరం వంటిది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే, ఎటువంటి వ్యాధులు,నొప్పులు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు.

By Lekhaka
|

రోగనిరోధక శక్తి అనేది నిజంగా ఒక వరం వంటిది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే, ఎటువంటి వ్యాధులు,నొప్పులు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు.

కానీ దురదృష్టవశాత్తు, నేటి వాతావరణం మరియు ఆహారాల కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి చాలా చిట్కాలు ఉన్నాయి. అలాగే ఇంటి నివారణలు కూడా ఉన్నాయి.

సాధారణ గృహ నివారణ మార్గాలు బాగా పనిచేస్తాయి. ఈ విషయాన్నీ కొంత మంది ప్రొఫెసర్లు కూడా అంగీకరించారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఇది పురాతనమైన పద్దతి

ఇది పురాతనమైన పద్దతి

ఒక పెద్ద బౌల్ లో 10 నుంచి 20 ఐస్ ముక్కలను మరియు కొన్ని గ్లాసుల చల్లని నీటిని పోయాలి. మీ పాదాలను ఆ నీటిలో 10 సెకన్ల పాటు ఉంచాలి. ఈ విధంగా రాత్రి పడుకొనే ముందు చేయాలి.

ఎప్పుడు చేయాలి

ఎప్పుడు చేయాలి

రోజుకి ఒకసారి చేయాలి. రోజులో సాయంత్రం చేస్తే మంచిది. రోజువారీ పనులు అయ్యాక చల్లని నీటిలో మీ పాదాలను పెట్టటం వలన మీ మొత్తం వ్యవస్థకు షాక్ కలగవచ్చు. అయితే ఈ అలవాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది.

ఎలా సహాయపడుతుంది

ఎలా సహాయపడుతుంది

ఒక రష్యన్ ప్రొఫెసర్ ఈ అలవాటు కొన్ని అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఫ్యాక్ట్ # 1

ఫ్యాక్ట్ # 1

ఇటీవల అధ్యయనాలు చల్లని జల్లులు మంచివని చెపుతున్నాయి. చల్లని జల్లులు తీసుకునే వ్యక్తుల్లో, తెల్ల రక్తకణాల సంఖ్య బాగా పెరుగుతుందని తెలిసింది. వ్యాధుల మీద తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.

ఫ్యాక్ట్ # 2

ఫ్యాక్ట్ # 2

చల్లని షవర్ సమయంలో, శరీరం మొదట తన్నుతాను వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఆపై రోగనిరోధక వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి మరింత ఎక్కువగా జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ శరీరం స్థితిస్థాపకంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

మరొక అధ్యయనం దీనికి మద్దతు ఇస్తుంది.నెలకు ఒకసారి చల్లని నీటిలో ఈత కొట్టటం మంచిదని చెప్పుతున్నారు. ఈ అభ్యాసం ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. శరీర బాహ్య పరిస్థితులను కూడా స్వీకరించడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాక వ్యాధినిరోధకతను బలపరుస్తుంది.

ఫ్యాక్ట్ # 4

ఫ్యాక్ట్ # 4

కొన్ని అధ్యయనాలు రోజుకి రెండు లేదా మూడు సార్లు చల్లని నీటిలో 10 సెకన్ల పాటు పాదాలను ఉంచితే బలహీనమైన నిరోధకత ఉన్నవారిలో మెరుగుదల ఉంటుందని అంటున్నాయి. అయితే మొదట డాక్టర్ తో చర్చించిన తర్వాత మాత్రమే ఈ పద్దతికి ప్రయత్నించాలి.

English summary

This Method Boosts Your Immunity In 10 Seconds!!

Though this remedy sounds so simple and too good to be true, it is said to work!
Desktop Bottom Promotion