ఎలాంటి థైరాయిడ్ సమస్య అయినా ఈ ఆహారం తింటే మటాష్ !

By Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

మన గొంతు దగ్గర మన గాలి గొట్టానికి సీతాకోక చిలుక ఆకారంలో ఆనుకుని ఉండేదాన్ని థైరాయిడ్‌ గ్రంథి అంటారు. శరీరం మొత్తం దీని కంట్రోల్ లో ఉంటుంది. దీని బాధ్యత కాస్త పెద్దదే. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల ద్వారానే శరీరానికి చురుకుదనం వస్తుంది. మన శరీర అవసరాలకు అనుగుణంగా థైరాయిడ్‌ గ్రంథి రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. అవే టి3, టి4. వీటి ఇవి శరీరానికి సరిపోతున్నాయా లేకుంటే వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉందా అని గమనిస్తూ... అందుకు తగ్గట్టుగా థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించే హార్మోను మరోటి మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో విడుదల అవుతుంది. దీన్నే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ - టీఎస్‌హెచ్‌ అంటారు.

అయితే చాలామందిలో థైరాయిడ్ కు సంబంధించి హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌థైరాయిడిజమ్‌ వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. హైపోథైరాయిడిజం అనేది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్‌ సమస్య. శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల ఇది వస్తుంది. ఇక హైపర్‌ థైరాయిడిజం సమస్య శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్ల అవసరాన్ని మించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయితే తలెత్తుతుంది. గొంతు కింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి అసహజంగా వాపునకు గురి కావడాన్నే గాయిటర్‌ అంటారు. ముఖ్యంగా ఇది అయోడిన్‌ లోపం వల్ల వస్తుంది.

hyperthyroidism diet

అలాగే కొన్నిసార్లు థైరాయిడ్‌ గ్రంథి వాపు వస్తూ పోతుంటుంది (ట్రాన్సియెంట్‌ థైరాయిడైటిస్‌). వాపు ఉన్నప్పుడు థైరాయిడ్‌ హార్మోన్లు తగ్గిపోతాయి. వాపు తగ్గినపుడు తిరిగి మామూలు స్థాయికి వచ్చేస్తాయి. కొందరిలో వాపు అలాగే ఉండిపోవచ్చు కూడా. ఇలాంటి వారిలో శాశ్వతంగా హైపోథైరాయిడిజమ్‌ తలెత్తుతుంది. హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌థైరాయిడిజమ్‌ వంటివాటిని కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల తగ్గించుకోవొచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఒక్కసారి చూద్దామా.

1. అయోడైజ్డ్ ఉప్పు

1. అయోడైజ్డ్ ఉప్పు

అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం, థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరమవుతుంది. అయోడిన్ లోపం వల్ల హైపో థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. కొందరిలో సహజంగా అయోడిన్ ఉత్పన్నం కాదు. అందువల్ల అయోడిన్ బాగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పు తింటే థైరాయిడ్ సమస్యల్ని ఎదుర్కోవొచ్చు.

2. బ్రెజిల్ నట్స్

2. బ్రెజిల్ నట్స్

బ్రెజిల్ నట్స్ లో మినరల్స్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ బాగా విడుదల కావడానికి ఇవి ఉపయోగపడతాయి.

బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని పలువురు పరిశోధనల్లోనూ తేలింది. ఇందులోని సెలీనియం వాపును తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోజుకు 8 బ్రెజిల్ నట్స్ ను తింటే మంచింది. వీటిని మోతాదుకు మించి తింటే వికారం, అతిసారం, వాంతులతో ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

3. చేపలు

3. చేపలు

చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిచేందుకు ఉపయోగపడతాయి. అలాగే సెలీనియం థైరాయిడ్ హార్మోన్స్ ను పెంచేందుకు తోడ్పడుతుంది. సాల్మొన్, సార్డైన్, ట్యూనా వంటి సముద్రపు చేపలను ఎక్కువగా తింటూ ఉండండి.

4. బోన్ బ్రోత్

4. బోన్ బ్రోత్

ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. వీటిలో అమైనో ఆమ్లాలు, గ్లైసిన్, ప్రోలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి హైపో థైరాయిడిజం సమస్యను పరిష్కరించగలవు. అందువల్ల రెగ్యులర్ గా బోన్ బ్రోత్ తీసుకుంటూ ఉండండి.

5. కూరగాయాలు, పండ్లు

5. కూరగాయాలు, పండ్లు

తాజా ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, ఆమ్లజనకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారిని వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. కాలీఫ్లవర్, పాలకూర, కాలే, బ్రోకలీ, సోయాబీన్, క్యాబేజీ, ముల్లంగి, చిలకడ దుంప, అవోకాడో, ఆవాలు గ్రీన్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

6. సీ వీడ్

6. సీ వీడ్

సీ వీడ్ అనేది నోరి, కెల్ప్, కోమ్బ్, హైపో థైరాయిడిజాన్ని నయం చేస్తుంది. అలాగే దీనిలో అయోడిన్, బీ విటమిన్లు, రిబోఫ్లావిన్, పాంటోథేనిక్ వంటివి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఈ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. మీరు రోజుకు 150 ఎంసీజీ వరకు సీ వీడ్ తీసుకోవొచ్చు.

7. పాల పదార్థాలు

7. పాల పదార్థాలు

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలు, యోగార్ట్, చీజ్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో అయోడిన్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని అమైనో యాసిడ్ టైరోసిన్ హైపో థైరాడిజంపై బాగా పోరాడుతాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను ఇవి పెంచుతాయి. రోజూ ఒక గ్లాస్ పాలు, 1/2 కప్పు యోగార్ట్, ⅙ కప్పు జున్ను తినొచ్చు.

8. బీఫ్, చికెన్

8. బీఫ్, చికెన్

అవసరమైన మేరకు జింక్ అందిస్తే థైరాయిడ్ పనితీరును వేగవంతం చేయవచ్చు. ఇది ఎక్కువగా బీఫ్, చికెన్ లో ఉంటుంది. థైరాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల మీరు రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.

9. గుడ్లు

9. గుడ్లు

గుడ్లలోనూ అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. హైపో థైరాయిడ్ ను తగ్గించేందుకు ఇవి చాలా మేలు చేస్తాయి. మీరు రోజుకి రెండు గుడ్లను తినొచ్చు. మీలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుడ్డులోని పచ్చసొన తినకుండా ఉండడం మంచిది. లేదంటే మీరు గుడ్డు మొత్తాన్ని తినొచ్చు.

10. షెల్ఫిష్

10. షెల్ఫిష్

షెల్ఫిష్ కూడా మేలు చేస్తాయి. చిన్నరొయ్యలు , ఎండ్రకాయలు వంటి వాటిని తింటూ ఉండాలి. వీటిలో అయోడిన్, జింక్ ఎక్కువగా ఉంటుంది.

ఇవన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్ ను పెంచేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ తీసుకుంటూ ఉండాలి.

11. ఆలివ్ ఆయిల్

11. ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెతో చేసిన ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ హార్మోన్ స్థాయిల ను పెంచడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆలివ్ నూనె శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది. దీంతో అధిక బరువు సమస్యను అధిగమిస్తారు. అలాగే మీ గుండెను కూడా ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు రోజుకు 10 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనెను వంటకోసం ఉపయోగించవచ్చు.

12. అవిసె గింజలు

12. అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే జింక్, సెలీనియం, అయోడిన్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు అవిసె గింజల నూనెను వంటలు వండుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. అవిసె గింజలను రకరకాలు తీసుకోవొచ్చు. స్మూతీగా లేదా తృణధాన్యాల మాదిరిగా అల్పాహారంగా తీసుకోవొచ్చు. మీరు రోజుకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల అవిసె గింజల నూనె లేదంటే అవిసె గింజల పిండిని ఆహారంలో భాగంగా చేసుకోండి.

13. లెగ్యూమ్స్

13. లెగ్యూమ్స్

వీటిలో అయోడిన్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకుంటే గ్లూటెన్-ఫ్రీగా ఉండొచ్చు. మీరు కాయధాన్యాలు, బీన్స్, బీన్ మొలకలు, చిక్ పీస్ మొదలైన వాటిని తినవచ్చు. మీ థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను పెంచడానికి ఇవి బగా ఉపయోపడతాయి.

14. ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్

14. ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా మీకు చాలా మేలు చేస్తాయి. మీరు హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్లయితే వీటిని కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే హైపో థైరాయిడిజం బారిన పడ్డవారు అజీర్తి, మలబద్ధకంతో బాధపడుతుంటారు. అందువల్ల ఈ ఫుడ్స్ తీసుకోవాలి. బొప్పాయి, ఆకు కూరగాయాలతో తయారు చేసిన ఆహారపదార్థాలు, గ్లూటెన్ రహిత తృణధాన్యాలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

15. నీరు

15. నీరు

నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దీంతో మీరు హైడ్రేటెడ్ గా ఉంటారు. మీ శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వెళ్తాయి. మీ బాడీకి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం. అందువల్ల మీరు నీరును అధికంగా తీసుకుంటూ ఉండాలి.

16. హైపోథైరాయిడిజం డైట్ చార్ట్

16. హైపోథైరాయిడిజం డైట్ చార్ట్

ఉదయం (7:00 - 7:30) : ఒక కప్పు వేడ నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగాలి

అల్పాహారం (ఉదం 8:15 - 8:45 ) - 1 ఉడికించిన గుడ్డు + వోట్స్ తయారు చేసిన పదార్థాలు, ఆపిల్, అవిసె గింజ పొడి+ 3 బ్రెజిల్ నట్స్ లంచ్ ( మధ్యాహ్నం 12:00 - 12:30 ) సీ విడ్ సలాడ్ లేదా రొయ్యలతో తయారు చేసిన పదార్థాలు

ఈవెనింగ్ స్నాక్ ( సాయంత్రం 4:00) 1 పీచ్ + 1 కప్ కొబ్బరి నీరు

డిన్నర్ ( సాయంత్రం 7:00 ) 1 బోన్ బ్రోత్ / లెంటిల్ సూప్ ( కూరగాయాలతో వండినది)

17. హైపోథైరాయిడిజం ఉన్న వారు తినకూడని ఆహారాలు

17. హైపోథైరాయిడిజం ఉన్న వారు తినకూడని ఆహారాలు

ముడి లేదా హాప్ కుక్ డ్ ఆకుకూరలను తినకుండా ఉండాలి. క్యాబేజీ, బోక్ చోయ్, బ్రొక్కోలి, కాలీఫ్లవర్, పాలకూర, కాలే, మొదలైనన ఆహారాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు.

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వేయించిన ఆహారాలు, బంగాళాదుంపకు సంబంధించి ఆహారాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనవి తినకూడదు. వీటిలో డియానికి సంబంధించిన ట్రక్లోడ్ గుణాలను కలిగి ఉంటాయి.

గ్రీన్ టీలో యాంటి థైరాయిడ్ లక్షణాలను కలిగి ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే అధికంగా గ్రీన్ టీ తాగితే మాత్రం హైపో థైరాయిడిజం బారిన పడాల్సి వస్తోంది. అందువల్ల గ్రీన్ టీ తాగకపోవడమే మంచిది.

18. హైపర్ థైరాయిడిజం నివారణకు తినాల్సిన ఆహారాలు

18. హైపర్ థైరాయిడిజం నివారణకు తినాల్సిన ఆహారాలు

థైరాక్సిన్ ఎక్కువ మోతాదులో థైరాక్సిన్‌ను విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం సమస్య ఎదురవుతుంది. హైపర్ థైరాయిడిజం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సన్నగా అయిపోతారు. మీ గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. అలాగే ఆందోళన ఎక్కువవుతుంది. చిరాకుతో ఇబ్బందుులపడాల్సి వస్తుంది. కళ్లు ఉబ్బుతాయి. నిద్రలేమి సమస్య వస్తుంది. హైపర్ థైరాయిడ్ ను నివారించుకోవడానికి ఈ కింది ఇచ్చిన ఐదు రకాల ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది.

19. ముడి పండ్లు, కూరగాయాలు

19. ముడి పండ్లు, కూరగాయాలు

ముడిపండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. ఇవి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. బ్రోకలీ, బచ్చలికూర, కాలే, బోక్ చోయ్, క్యాబేజీ, పాలకూర, చైనీస్ క్యాబేజీ, క్యారట్, కాలీఫ్లవర్, ముల్లంగి, ఆకుకూరలు, పాలకూర, బ్రస్సెల్స్, మొలకలు, బెల్ మిరియాలు, టమోటా, ఆపిల్, బెర్రీలు, కివీ, నారింజ, నిమ్మ, ద్రాక్షపండు మొదలైనవి చాలా మంచివి.

20. మిల్లెట్స్, బ్రౌన్ రైస్

20. మిల్లెట్స్, బ్రౌన్ రైస్

మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ల్లోనూ అధిక గోట్రోజనిక్ కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక ఉత్పత్తిని అణిచివేసేందుకు మీరు రోజుకు 1 కప్ బ్రౌన్ బియ్యం లేదా మిల్లెట్లను తినవచ్చు.

21 . లీన్ ప్రోటీన్లు

21 . లీన్ ప్రోటీన్లు

చికెన్ బ్రెస్ట్, చేపలు, పుట్టగొడుగులు, సోయా చుంక్స్ ఎక్కువగా తీసుకోవాలి. హైపర్ థైరాయిడిజం వల్ల ఆకలి మందగించి సన్నగా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

22. గ్రీన్ టీ

22. గ్రీన్ టీ

ఇది థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తిని అదుపులో ఉంచుతుంది. అందువల్ల మీరు గ్రీన్ టీ తీసుకోవాలి. వీటిలో యాంటీ థైరాయడ్ గుణాలుంటాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

23. హెర్బ్స్

23. హెర్బ్స్

హైపర్ థైరాయిడిజం నివారణకు బాసిల్, ఒరేగానో, రోజ్మేరీ వంటి వాటిని తీసుకోవాలి. వీటికి హైపర్ థైరాయిడిజం సమస్యను అదుపులో పెట్టే లక్షణాలుంటాయి. ఈ ఆహారాలన్నీ చాలా మేలు చేస్తాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    thyroid diet what foods to eat and avoid?

    let me tell you about the foods to eat and avoid for hypothyroidism and hyperthyroidism and the diet charts. Let’s begin!
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more