For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో ఖచ్చితంగా తినాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ..!!

వింటర్లో శరీరానికి బయట రక్షణ సరే.. శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తాయి. మరి ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి.

By Lekhaka
|

నవంబర్- డిసెంబర్ వచ్చిందంటే చాలు చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. మారిన రుతువుకనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము.


అయితే శరీరానికి బయట రక్షణ సరే.. శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తాయి. మరి ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి. ముఖ్యంగా పండ్లు మరియు కూరగాలు ఈ సీజన్ కు తగ్గట్లు తీసుకోవాలి . సీజనల్ గా వచ్చే పండ్లు వెజిటేబుల్స్ ను ఆయా సీజన్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలను, ప్రోటీనుల, నూట్రీషియన్స్ ను పుష్కలంగా అంధిచవచ్చు. సీజనల్ గా లభించే పండ్లు చాలా విలువైనవి మరియ పూర్తి పోషకాంశాలు కలిగినవి అందుకే అవి అంత ఖరీదై ఉంటాయి.

ఆహారం అనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మీ శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. సీజన్ బట్టీ మీ శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం అవసరం, కాబట్టి మీరు వింటర్ సీజన్ లో రైట్ ఆహారం తీసుకోవాలి. వింటర్లో తీసుకొనే ఆహారాలు కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకొని ఖచ్చితంగా వాటిని తీసుకోవడం వల్ల చలి నుండి వ్యాధుల నుండి శరీరాన్ని బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము. మరి అటువంటి హెల్తీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

క్యారెట్ :

క్యారెట్ :

ఇతర వెజిటేబుల్స్ తో పోల్చితే క్యారెట్ లో కెరోటిన్ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా వీటిలో బిటమిన్ బి, సి,డి, ఇ, మరియు కె లు అధికంగా ఉన్నాయి. క్యారెట్స్ శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. వింటర్లో ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

వింటర్ లో వీటి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇంకా వీటిలోపొటాషింయ, మినిరల్స్, ఫొల్లెట్ మరియు ఫైబర్స్ అధికం. వీటిని అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్ ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం ఉండదు.

ఆపిల్స్:

ఆపిల్స్:

రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు. అది నిజం. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా వింటర్లో మార్కెట్లో బాగా అందుబాటులో ఉంటాయి.

 టర్నిప్స్ :

టర్నిప్స్ :

టర్నిప్స్ లో ఫైబర్, ఫొల్లెట్ , విటమిన్స్, మినిరల్స్, అధికంగా ఉంటాయి. వీటిని బెస్ట్ రూట్ బెజిటేబుల్ గా తీసుకుంటారు. ముఖంగా వింటర్ లో తినాల్సిన, హెల్తీ న్యూట్రీషియన్ వెజిటేబుల్ ఇది.

మస్టర్డ్ లీవ్స్ :

మస్టర్డ్ లీవ్స్ :

పండుగ సీజన్స్ మొదలైతే చాలు ముఖ్యంగా ఇండియన్ వంటల్లో ఖచ్చితంగా స్వీట్స్ ఉండాల్సిందే, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ వెవల్స్ మీద కంట్రోల్ తప్పుతారు. ఇందులో విటమిన్స్, మినిరల్స్, ఫైబర్ , ఫైటోన్యూట్రీషియన్స్ అధికంగా ఉంటుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఫెవనాయిడ్స్ , విటమిన్స్ మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా విటిమన్ ఎ, సి, కె మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇది ఒక బెస్ట్ గ్రీనీ లీఫీ వెజిటేబుల్,ఇవి వింటర్లో తప్పనిసరిగా అవసరం అవుతాయి.

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలు వింటర్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ కె ఎక్కువ.

ముల్లంగి:

ముల్లంగి:

ముల్లంగిలో పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఆక్సార్బిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానిిక చాలా అవసరం అవుతాయి. ఇవి వింటర్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూట్ వింటర్లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి, వింరట్ వెజిటేబుల్ మెటబాలిజం రేటు పెంచుతుంది. ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

English summary

Top 10 Fruits/Vegetables To Be Consumed In Winter & Why You Should Eat Them

Winter is the time when you will have to nourish yourself, as you require enough body heat to keep yourself warm, in order to do your daily chores. In this article, we have presented to you a list of fruits and vegetables that are to be consumed during the winter season.
Desktop Bottom Promotion