For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడానికి గల 6 కారణాలు

|

పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రతి స్త్రీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థలో ఒకటి (లేదా) వారు తరచుగా అనుభవించే ఒక యాదృచ్ఛిక విషయము. వారు మీ చెవులలో ఒక హెచ్చరిక గంటను మోగిస్తుంది, వాస్తవానికి చాలా ఋతుస్రావ సమయాల్లో రక్తంతో గడ్డకట్టడం అనేది చాలా సాధారణమైనవి, అది ఒకవేళ తారాస్థాయిలో ఉన్నప్పటికీ కూడా !

<strong>పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!</strong>పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!

పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడానికి గల కారణాలు

Top 6 Causes Of Blood Clots During Periods

"రక్తం గడ్డకట్టుటను తగ్గించే పదార్ధమును" (ప్రతిస్కంధకమును) అనే ఉత్ప్రేరక కారకాలను సాధారణంగా రక్తమే ఉత్పత్తి చేస్తుంది, దాని కారణంగానే రక్తం యొక్క స్నిగ్ధతని (చిక్కదనాన్ని) కలిగి ఉంటుంది. కానీ రక్త ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ ప్రతిస్కంధక కారకాలు పని చేయడానికి తగినంత సమయాన్ని అనుకూలంగా లేకపోడం వల్ల రక్తం - గడ్డలుగా ఏర్పడతాయి. ఏదేమైనా, ఇది పీరియడ్స్ కాలంలో జరిగే సాధారణ పద్దతి. ఏమైనా రక్తం గడ్డలుగా, ఒక మహిళ యొక్క పిడికిలి పరిమాణం కంటే పెద్దవిగా అయినప్పుడు ఆందోళన చెందినప్పుడు,

అవి కాలానుగుణంగా అంతరించిపోతాయి, ఇలా ఎక్కువగా పీరియడ్స్ తరువాత జరుగుతాయి మరియు పీరియడ్స్ నొప్పితో పాటు ఇలా వస్తాయి.

రక్తం గడ్డకట్టడానికి గల కారణాలలో ఇవి కూడా చేర్చబడతాయి

1. పాలీ సిస్టిక్ అవారీ సిండ్రోమ్ (PCOS) :

1. పాలీ సిస్టిక్ అవారీ సిండ్రోమ్ (PCOS) :

PCOS అనేది మహిళల్లో అత్యంత సాధారణంగా వచ్చే ఒక హార్మోన్ల సమస్య. ఒక మహిళ పిసిఒఎస్తో బాధపడుతున్నప్పుడు స్త్రీ హార్మోన్ల మధ్య అనగా, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ సున్నితమైన సమన్వయం లోపించడం కారణంగా, అవి చెదిరిపోతాయి. ఇలా వాటికి భంగం కలగటం వల్ల క్రమరహితమైన మరియు భారీ రక్తస్రావంతో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది.

2. ఎండోమెట్రియోసిస్ (endometriosis) :

2. ఎండోమెట్రియోసిస్ (endometriosis) :

ఎండోమెట్రియం అని పిలువబడే గర్భాశయం యొక్క అంతర్గత శ్లేష్మపొర, గర్భాశయ లోపలి భాగం నుండి బయటవైపుగా పెరగడం ప్రారంభమవుతుంది, ఇదే "ఎండోమెట్రియోసిస్" గా పిలువబడుతుంది. ఈ శ్లేష్మ పొర కేవలం సాధారణ ఎండోమెట్రిమ్ శ్లేష్మపొర వలె ప్రవర్తిస్తుంది మరియు పీరియడ్స్లో రక్తస్రావం అనేది ప్రారంభమవుతుంది. ఈ శ్లేష్మపొర బయటకు వచ్చేటప్పుడు ముద్దలుగా ఉండే పదర్థం (గ్లోబ్స్) లాగా పీరియడ్స్ లో పెద్ద గడ్డలుగా కనిపిస్తాయి. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా బాధాకరమైన స్థితి కూడా.

3. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ :

3. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ :

తల్లులు పిల్లలకు కనే సమయంలో, గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అనేవి సాధారణంగా సంభవిస్తాయి. ఒక అంచనా ప్రకారం, 5 మందిలో మహిళలలో ఒకరు మాత్రమే గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లను కలిగి ఉంటారు. శుభవార్త ఏమిటంటే, గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ నిరపాయమైన (కేన్సర్ కాని) కణితులు. అవి గర్భాశయ కుహరంలో (లేదా) గర్భాశయ గోడపై గాని పెరుగుతాయి. ఫైబ్రాయిడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి, వీటిని మైక్రోస్కోప్ లోనే చూడాలి, కానీ ఇవి స్త్రీ రుతుస్రావం వరకు నెమ్మదిగా పెరిగి, కొంతకాలం తర్వాత పెద్ద పరిమాణంలోనికి మారతాయి. సాధారణంగా, ఒక మహిళ యొక్క గర్భంలో ఒకటి కన్నా ఎక్కువ కండరాలు పెరుగుతాయి. ఈ ఫైబ్రాయిడ్లు, ఈస్ట్రోజెన్ హార్మోన్కు తీవ్ర సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. ఒక మహిళ పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగినప్పుడు, ఈ కణితులు కూడా పెరుగుతాయి మరియు వాటి పెరుగుదల వల్ల పెద్ద స్థాయిలో రక్తం గడ్డలుగా ఉండి, భారీ రక్తస్రావము చోటుచేసుకుంటాయి.

4. పాలీప్స్ (polyps) :

4. పాలీప్స్ (polyps) :

పాలీప్స్ అనేది ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర ధాతువులు గర్భాశయ లోపలి గోడలో అభివృద్ధి చెంది, అవి ఉబ్బి ఉన్న కారణం చేత గర్భాశయ కుహరంలోనికి గురవుతాయి. ఈ పాలీప్స్ పెద్ద పరిమాణంలో పెరిగి ఉంటే, ఋతుస్రావం సమయంలో అవి గర్భాశయం నుండి రక్తం ప్రవహానికి అడ్డంకిగా ఉంటుంది. ఆ కారణంగా గర్భాశయంలో రక్తం గడ్డకట్టే నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

5. ఇతర దీర్ఘకాల కారకాలు :

5. ఇతర దీర్ఘకాల కారకాలు :

శరీరంలో కొన్ని ఇతర దీర్ఘకాలిక కారకాలు కూడా రెండు స్త్రీ హార్మోన్ల మధ్య సమతౌల్యాన్ని ప్రభావితం చేసి, పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడానికి దారితీయవచ్చు. అలా సంభవించడానికి ఇవి కారకాలు : ఆకస్మిక బరువు పెరుగుట (లేదా) నష్టపోవడానికి, స్టెరాయిడ్స్ల దీర్ఘకాలం వినియోగించడం, రుతువిరతి కారణంగా స్త్రీ యొక్క హార్మోన్ల స్థాయిలలో మార్పులు, వంధ్యత్వానికి లేదా ఇతర పునరుత్పత్తి సమస్యలకు హార్మోన్ ఆధారిత మందుల వాడకం, మొదలైన అంశాలు.

6. విస్తృత గర్భాశయము :

6. విస్తృత గర్భాశయము :

గర్భధారణ సమయంలో, పెరుగుతున్న శిశువుకు అనుగుణంగా గర్భాశయం పెరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత, గర్భాశయం దాని సాధారణ ఆకారం మరియు పరిమాణం తిరిగి రావటానికి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు, గర్భాశయం దాని సాధారణ పరిమాణంలో కుప్పకూలిపోకపోతే, గర్భాశయంలో పెద్ద మొత్తంలో రక్తపు కొలనులు ఏర్పడుతుంది. ఈ రక్తం బయటకు రావడానికి ముందే గర్భాశయం లోపల గడ్డకట్టబడి ఉంటుంది మరియు ఇది ఋతుస్రావం సమయంలో పెద్ద గడ్డలలో రూపంలో బయటకు వస్తుంది.

పెద్ద మొత్తంలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే గాయాలు, బాధాకరమైన తిమ్మిరితో పాటుగా సాధారణమైన లక్షణంగా మారితే అప్పుడు మీరు దానిని తీవ్రంగా పరిగణించి, వైద్యపరమైన సలహా కోసం, ఏ విధమైన అసమానతలనైన పక్కన పెట్టడానికి ప్రయత్నించాలి.

English summary

Top 6 Causes Of Blood Clots During Periods

Did you observe clots in blood during period? Well, period blood may not be the same every month. Sometimes, the colour appears too dark and sometimes the consistency gets thicker due to many reasons. Sometimes, clots may become a cause of concern. Do clots occur only in some women? They could occur in most of the women at least once in a life time.
Desktop Bottom Promotion