For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉప్పు ఎక్కువ తినకూడదు ఎందుకు? 8 ఖచ్చితమైన కారణాలు!

|

ఉప్పు ఎక్కువగా తినకూడదు ఎందుకు? ఉప్పు అన్నది కేవలం వంటల్లో వేసుకునే చిటికెడంత పదార్థం అనుకుంటే అది పొరపాటే. ఉప్పు మన నిత్యవసర వస్తువుగా వాడుకోడానికి చిటికెడంతైనా మన సంస్కృతిలో దాని స్థానం బోలెడంత. మన జాతీయాల్లో, నుడికారాల్లో అది కోరికలకూ, కృతజ్ఞతకూ ప్రతీక. ఉప్పు ఒకనాటి కరెన్సీకి ప్రతిరూపం. వేతనానికి పర్యాయపదం. ఇలా సంస్కృతిలో దానిస్థానం ఎంత పదిలమో... ఆరోగ్యం విషయంలోనూ అంతే ప్రధానం. ఉప్పు ఎక్కువగా తినకూడదు ఎందుకు? 8 ఖచ్చితమైన కారణాలు!కూడా ఉన్నాయి.

పుట్టబోయే బిడ్డ మేధోవికాసం సరిగా జరగాలంటే అయొడైజ్‌డ్ ఉప్పు వాడాలి. మన దేహంలో మెదడు నుంచి అన్ని అవయవాలకు అందాల్సిన అన్ని రకాల కమ్యూనికేషన్ సరిగా జరగాలంటే ఉప్పు కావాలి. అయితే ఈరోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు తగ్గించాలనీ, ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకరమైన పరిణామాలెన్నో జరుగుతాయన్న మాటే. అది విని చాలామందిలో ఒక ఆందోళన. ఉప్పు నిజంగానే అంత ప్రమాదకరమా, ఆరోగ్యానికి చేటు కలగకుండా వాడుకోవాలంటే ఎంత పరిమాణంలో వాడాలి అన్న విషయాల గురించి తెలుసుకోవడానికే ఈ ఆర్టికల్.

ఉప్పు ఎక్కువ తినకూడదు ఎందుకు

మితిమీరిన ఉప్పు నిజంగానే ప్రమాదకరం. అందులో సందేహం లేదు. అయితే ఈ కారణం వల్ల నిజంగానే ఉప్పును పూర్తిగా మానేయాలా? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన ప్రధానలవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలూ ఉంటాయి.

ఉదాహరణకు రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉండటం వల్ల రక్తకేశనాళికలు (కేపిల్లరీస్) అంటారు. వీటి గోడలు చాలా పలుచగా ఉండటంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి పగిలిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. అదే పరిణామం గుండె గోడల్లో జరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పు మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని, ఆహార నిపుణుల వరకు అందరూ సలహా ఇస్తుంటారు. రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిని ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇచ్చేది కూడా అందుకే!

కాబట్టి నెక్స్ట్ టైమ్ మీరు వంటల్లో ఉప్పు ఉపయోగించాలంటే, దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే శరీరానికి జరిగే ముప్పు గురించి తెలుసుకుందాం..

బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది:

బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది:

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైపర్ టెన్షన్, హైబ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల వచ్చే ప్రధానమైన సైడ్ ఎఫెక్ట్ ఇది. రక్తంలో సోడియం కంటెంట్ పెరిగిందంటే, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి కారణమవుతుంది. అది ముందుముందుకు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది.

ఫ్లూయిడ్ రిటెన్షన్ :

ఫ్లూయిడ్ రిటెన్షన్ :

శరీరంలో సోడియం కంటెంట్ అధికమైతే శరీరం ఫ్లూయిడ్ కూడా పెరుగుతుంది. ఒంట్లో నీరు చేరడానికి ప్రధానకారణం ఉప్పు . ఫ్లూయిడ్స్ పెరగడం వల్ల కాళ్ళు, చేతులు, ముఖం , పాదాలలో వాపులు కనబడుతాయి. ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల శరీరంలో సోడియం కంటెంట్ శాతాన్ని తగ్గిస్తుంది.

కార్డియో వాస్క్యులర్ డిసీజ్ :

కార్డియో వాస్క్యులర్ డిసీజ్ :

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్డియో వాస్క్యులర్ డిసీజ్ లు పెరుగుతాయి. పరిశోధనల ప్రకారం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ సమస్యలు పెరుగుతాయి .

డీహైడ్రేషన్ :

డీహైడ్రేషన్ :

మీ శరీరంలో ఎక్కువ నీరు లేకపోతే, శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. ఎక్కువ నీరు చెమట రూపంలో బయటకు వచ్చేటప్పుడు చెమటతో పాటు సోడియం కంటెంట్ కూడా బయటకు వచ్చేస్తుంది. దాంతో శరీరంలో సోడియం కంటెంట్, వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల ఎక్కువ దాహం, వికారం, వాంతులు, కళ్ళు తిరగడం, పొట్ట తిమ్మెర్లు, వాంతులు, డయోరియా వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

గ్యాస్టోఎంటటైటిస్ :

గ్యాస్టోఎంటటైటిస్ :

ఎక్సెస్ సాల్ట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది స్టొమక్ లైనింగ్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇది హెలికోబ్యాక్టర్ ఫైలోరి ఇన్ఫెక్షన్ పెంచుతుంది. ఇది ఎక్కువ సాల్ట్ కంటెంట్ తీసుకున్నప్పుడు జరుగుతుంది. అంతే కాదు, ఎక్సెస్ సాల్ట్ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు ట్యూమర్ గ్రోత్ కూడా పెరుగుతుంది.

కిడ్నీ సమస్యలు :

కిడ్నీ సమస్యలు :

అదే విధంగా, మనం అంతర్గతంగా తీసుకునే ప్రతి ఆహారపానీయాలు కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. శరీరంలోకి ఎప్పుడైతే ఎక్సెస్ సాల్ట్ చేరుతుందో అప్పుడు కిడ్నీల పనితీరు తగ్గుతుంది మరియు వాటర్ కంటెంట్ ను తగ్గిస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.

ఓస్టిరియో ఫోసిస్ :

ఓస్టిరియో ఫోసిస్ :

శరీరంలో సోడియం కంటెంట్ పెరిగితే, శరీరంలో ఉండే క్యాల్షియం కంటెంట్ తగ్గుతుంది. దాంతో ఎముకలు పల్చగా మారుతాయి. దాంతో ఓస్టిరియోపోసిస్ పెరుగుతుంది. మోనోపాజ్ దశలో ఎక్కువ మందిలో క్యాల్షియం లోపానికి ఇదే కారణం. ఎక్సెస్ సాల్ట్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

స్ట్రోక్ లేదా పక్షవాతం:

స్ట్రోక్ లేదా పక్షవాతం:

మెదడుకు రక్తప్రసరణ తగ్గితే పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది బ్రెయిన్ కు ఆక్సిజెన్ సప్లై తగ్గిస్తుంది. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దాంతో హైబ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దాంతో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్సెస్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఇన్ డైరెక్ట్ గా ఇలా ప్రభావం చూపుతుంది.

English summary

Top 8 Reasons Why We Should Not Eat Excess Salt in Telugu

Small amount of salt is important for the normal functioning of the body. But, always remember that moderation is key. Next time, before putting salt in your dishes, just think of the side effects that you have to face if the amount is excess. Now, let us see some of the health effects of excess salt intake
Desktop Bottom Promotion