Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
అలర్ట్ : 40ఏళ్ళ తర్వాత పురుషులు ఎదుర్కొనే ప్రమాదకరమైన సమస్యలు!
పురుషుడికి 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే, పక్షవాతం, డయాబెటీస్, ప్రొస్టేట్ కేన్సర్ వంటివి సాధారణంగా వస్తూంటాయి. వీటిలో కొన్ని అనారోగ్య జీవన విధానం కారణంగా వున్నప్పటికి మరి కొన్ని వయసు సంబంధితమే. మరి పురుషుడికి వయసు పెరుగుతున్న కొలది ఏ రకమైన వ్యాధులు వస్తాయనేది పరిశీలిద్దాం.

పురుషుడికి 20 నుండి 30 సంవత్సరాలకు
పురుషుడికి 20 నుండి 30 సంవత్సరాలకు - ఈ వయసులో అతను చాలా వరకు ఆల్కహాల్, స్మాకింగ్, డ్రగ్స్, సంతాన లేమి సమస్య, సుఖ వ్యాధులు, మరికొన్ని మానసిక వైకల్యాలకు గురవుతాడు.

ఇక 50 ఏళ్ళ వయసు వారికైతే,
ఇక 50 ఏళ్ళ వయసు వారికైతే, వారి ఆరోగ్యం చాలావరకు క్షీణిస్తుంది. అనేక రకాల మందులు వాడుతూనే వుంటారు. వచ్చే వ్యాధులు సర్వ సాధారణమని, ఆహారాలు కలుషితమని లేదా తమకు వంశ పారంపర్యంగా వస్తున్నాయని భావిస్తూంటారు.

మీరు 50 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా
మీరు 50 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా వుండాలనుకుంటే, మీ 20 లేదా 30 సంవత్సరాల వయసునుండే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆల్కహాల్ తాగటం మానండి. పొగ తాగటం మానండి. మీ బరువు ఎత్తుకు తగినట్లు సరిగా వుందా? లేదా అనేది పరిశీలించుకోండి. అవసరమనుకుంటే బరువు తగ్గండి అంటున్నారు నిపుణులు.

గుండె జబ్బుల చరిత్ర కుటుంబంలో కల పురుషులు
గుండె జబ్బుల చరిత్ర కుటుంబంలో కల పురుషులు లేదా అధిక రక్తపోటు వున్న వారు కనీసం సంవత్సరానికొకసారైనా వైద్యులను సంప్రదించాలి. గుండె జబ్బులు వచ్చే సూచనలు వుంటే వారు ఇసిజి లేదా ట్రెడ్ మిల్ వంటి టెస్టులు చేసి ముందస్తుగానే వాటిని కనిపెట్టి తగిన వైద్యం చేసే అవకాశం వుంటుంది. గుండె జబ్బులు అనేవి ఒకే సారి అన్ని వేళలా వచ్చి మరణింపజేయవు. చాలామందికి ముందుగా వాటి సూచనలు వుంటాయి. తగిన వైద్య పరిష్కారం కూడా లభిస్తుంది. కనుక పురుషులు తమ 40 సంవత్సరాల వయసుపైన పడితే, తప్పక గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాలి.

పురుషుడికి నలభై సంవత్సరాలవయసునుండి
పురుషుడికి నలభై సంవత్సరాలవయసునుండి గుండె జబ్బులు, డయాబెటీస్ వ్యాధులే కాక, లైంగిక జీవిత సమస్యలుకూడా వస్తాయి. మూత్రాశయం నుండి మూత్రం సరిగా రాకపోవటం, లేదా తాను మహిళతో సంభోగించినపుడు స్కలన సమయంలో మంటపెట్టటం, అంగం ఎరుపెక్కటం, సమర్ధవంతంగా రతినిర్వహించలేకపోవడం వంటివి లైంగిక వ్యాధుల కారణంగా కూడా ఏర్పడవచ్చు.

పురుషుడికి ఈ దశలో
పురుషుడికి ఈ దశలో తన వృషణాలు బాగా గట్టిపడ్డా లేదా పూర్తిగా మెత్తబడిపోయినా, తక్షణమే అతను అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాలి. టెస్టికిల్స్ సైజు ఫలదీకరణ సమస్యలను సూచిస్తుంది.

పురుషుడికి టీన్స్ చివరి దశనుండి
పురుషుడికి టీన్స్ చివరి దశనుండి సుమారు 20 సంవత్సరాలవరకు అనేక మానసిక ఆరోగ్య సమస్యలుంటాయి. పురుషులలో మూడు వంతులమంది షుమారుగా మొదటి సారి తమ 25 , 26 సంవత్సరాల వయసులో స్కిజోఫ్రేనియా వ్యాధికి గురవుతారు.

వీరిలో ఆందోళన, డిప్రెషన్ వంటివి
వీరిలో ఆందోళన, డిప్రెషన్ వంటివి తరచుగా వస్తూంటాయి. వారు ఆ సమయంలో ఒకవైపు తమ కెరీర్ బాగోగులు చూసుకోవాలి మరో పక్క తల్లితండ్రులు మరో పక్క ఇతర సంబంధాలు నిర్వహించవలసి వుంటుంది. ఆ సమయంలో వీరికి మానసిక సంబంధమైన సమస్యలు అధికంగా కలుగుతాయి. ఆ వయసులో వీరు ఎవరితోనూ మనసువిప్పి చెప్పుకోలేరు. తమ తోటి వారిని చూసి మరింత గిల్టీగా వీరు భావించే అవకాశాలుంటాయి.

ఇక పురుషుడికి 40 నుండి 50 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి
ఇక పురుషుడికి 40 నుండి 50 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి, గుండె వ్యాధులు, డయాబెటీస్, డిప్రెషన్ కలోన్ కేన్సర్, మూత్రాశయ, కిడ్నీ సంబంధిత వ్యాధులు పూర్తిగా వచ్చేస్తాయి.

రక్తపోటు వుంటే,
అతనికి రక్తపోటు వుంటే, కొల్లెస్టరాల్ లేదా అధిక బరువు సమస్య కూడా వుంటుంది. ఊబకాయం కలుగుతుంది, ఊబకాయంతోపాటు డయాబెటీస్ వచ్చేస్తుంది.

ఏభై సంవత్సరాలు పైబడితే
ఏభై సంవత్సరాలు పైబడితే పురుషులలో వచ్చే ప్రొస్టేట్ కేన్సర్ లేదా కలోన్ కేన్సర్ వస్తాయి. ప్రొస్టేట్ కేన్సర్ లో అతనికి మూత్రం పోయటంలో కష్టంగా వుంటుంది. కలోన్ కేన్సర్ లో గుద భాగం నుండి రక్తం రావటం, మలం సరిగా విసర్జించలేకపోవటం వుంటుంది.

పేగు పరీక్షలు
పేగు పరీక్షలు 50, 55, 65 సంవత్సరాల వయసులలో ప్రతి రెండు సంవత్సరాలకు చేయించాలి. 50 సంవత్సరాల పై బడ్డ పురుషులు ప్రొస్టేట్ పరీక్షలకై డాక్టర్ ను సంప్రదించాలి.

బ్లాడర్ కేన్సర్, కిడ్నీ కేన్సర్
ఈ వయసులో బ్లాడర్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ వస్తాయి. ముఖ్యంగా పొగ తాగే వారికి వస్తాయి. వీటి లక్షణాలు బ్లడ్ లేదా మూత్రంలో కనపడతాయి. ఇవే కాక, గుండె పోటు వంటివి కూడా వెన్నంటి వుంటాయి.

చర్మ కేన్సర్
చర్మ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలు 50 సంవత్సరాల వయసులో పురుషుడికి వుంటాయి. ప్రతి మూడు నెలలకు ఏవైనా మార్పుల కొరకు పరీక్షింపచేసుకోవాలి.

పక్షవాతం
60 సంవత్సరాల పైబడిన పురుషులకు గుండె జబ్బులు, పక్షవాతం, డయాబెటీస్, పేగు కేన్సర్, చర్మ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ వంటివి వస్తాయి.

55 సంవత్సరాలు దాటితే
55 సంవత్సరాలు దాటితే ప్రతివారూ డయాబెటీస్ పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటీస్ లక్షణాలు అలసట, అధిక దాహం అధిక మూత్రం రావటం, చర్మ వ్యాధులుగా వుంటాయి.
పురుషులకు సాధారణంగా ప్రొస్టేట్ కేన్సర్, పేగు కేన్సర్ , చర్మ కేన్సర్ ప్రధాన ఆరోగ్య సమస్యలు. ఈ దశలో రెగ్యులర్ పరీక్షలు, ఆరోగ్య నియంత్రణ అవసరం. అనారోగ్యపుటలవాట్లు వుంటే ఈ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం వుంటుంది.

ఈ అనారోగ్య సమస్యలన్ని
ఈ అనారోగ్య సమస్యలన్ని ఆరోగ్యకర ఆహారం, రెగ్యులర్ వ్యాయామాలు చేయటం ద్వారా నివారించుకోవచ్చని కూడా ప్రొఫెసర్ డార్ట్ తెలుపుతున్నారు.



Click it and Unblock the Notifications