అలర్ట్ : శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగడం లేదని తెలిపే 10 వార్నింగ్ సంకేతాలు..!!

Posted By:
Subscribe to Boldsky

మన శరీరానికి ఆయువు రక్తం. వాహనాన్ని నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు పుష్క‌లం.

రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం ప్రసరించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్ అందిస్తుంది. మరియు హార్మోనుల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం.

Top Warning Signs Of Poor Blood Circulation

శరీరంలో రక్తప్రసరణ జరగుతున్నదా లేదా అని కనిపెట్టడం కష్టం ఎందుకంటే, ఇది సైలెంట్ నేచర్ కలిగి ఉంటుంది. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి, రక్తప్రసరణ స్థితిగతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రక్తప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభంలో గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందివ్వొచ్చు . ఈ ఆర్టికల్ మీ శరీరంలో రక్త ప్రసరణ చాలా బలహీనంగా ఉన్నది తెలపడానికి కొన్ని లక్షణాలు తెలపడం జరిగింది.

శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం అనేది అన్ని వయస్సుల వారిలోను ఉన్న సమస్య. సమయానికి గుర్తించి వెంటనే చికిత్సను అందివ్వకపోతే బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ మరియు లింబ్స్ డ్యామేజ్ అయ్యే తీవ్ర ప్రమాధం ఉన్నది. . ఇది పెద్దవారిలో చాలా సాధారణం అయినా, ఏవయస్సు వారైనా ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవడం మంచిది.రక్తనాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల మరియు ఇతర కారణాల వల్ల రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో హార్ట్, చేతులకు, కాళ్ళకు, మరియు శరీరంలోని మరికొన్ని ముఖ్యమైన అలవాయాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది.

ముఖ్యంగా ధూమపానం, వ్యాయామం, ఎక్కువ సమయం కూర్చోవడం, ఆహారపు అలవాట్లు మంచిగా లేకపోవడం, మరియు కొన్ని వైద్యపరిస్థితులు వంటి కొన్ని జీవనశైలిలోని మార్పులు మరియు అలవాట్ల వల్ల ఒక వ్యక్తి ఈ సమస్యలను లోనయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ మరియు బరువు పెరగడం కూడా బలహీనమైన రక్తప్రసరణకు కారణం అవుతుంది. మరి లక్షణాలు ఎలా గుర్తించాలి? పూర్ బ్లడ్ సర్క్యులేషన్ కు కొన్ని వార్నింగ్ సైన్స్ క్రింది విధంగా ...

చేతులు మరియు పాదాల్లో తిమ్మెర్లు :

చేతులు మరియు పాదాల్లో తిమ్మెర్లు :

శరీరంలో రక్తం సరిగా సరఫరా కలేదంటే ముఖంగా కొన్ని శరీర భాగాలకు రక్త సరిగా సరఫరా కాలేదంటే ఆ ప్రాంతంలో తిమ్మెర్లు(జోమ్ పట్టినట్లు )అగుపిస్తుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు చేతులు, పాదాల్లో ఎక్కువగా కనిపిస్తుంది .

శరీరంలో క్రింది బాగం నుండి వాపులు కనబడుతాయి :

శరీరంలో క్రింది బాగం నుండి వాపులు కనబడుతాయి :

ఎక్కువ సమయంలో లేదా ఎక్కువ రోజులు కాళ్ళు లేదా పాదాల్లో వాపులు కనబడ్డాయంటే రక్త ప్రసరణ సరిగా జరగట్లేదని సంకేతం. ఇటువంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం వల్ల లెగ్ అల్సర్ కు దారితీస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడానికి ముఖ్యమైన లక్షణాల్లో ఇది ఒకటి.

తరచూ అలసట మరియు టయర్డ్ నెస్ :

తరచూ అలసట మరియు టయర్డ్ నెస్ :

శరీరంలో రక్తప్రసరణ సరిగా లేదంటే, శరీరంలో అవయవాలు తరచూ అలసటకు గురి అవుతుంటాయి. కండరాలకు ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్ సరిగా అందక ఎక్కువ అలసటకు గురి అవుతుంటాయి.

 పాదాలు, చేతులు చల్లబడుతాయి:

పాదాలు, చేతులు చల్లబడుతాయి:

రక్తప్రసరణలో అంతరాయం కలిగితే శరీరంలో వివిధ బాగాల మీద ప్రభావం చూపుతుంది. శరీరంలో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫలితంగా శరీరం చల్లబడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగడం లేదని లెలిపే లక్షణాల్లో ఇది కూడా ఒకటి.

వీర్ కోస్ వీన్స్ :

వీర్ కోస్ వీన్స్ :

వీర్ కోస్ వీన్స్(రక్తనాళాల్లో )రక్త ప్రసరణ సరిగా జరగలేదంటే, వీన్స్(నరాల) మీద ప్రభావం చూపుతుంది. . దాంతో నరాలు మెలికలు తిరగడం , వాపులు రావడం, చర్మం బయటకు పొడుచుకుని కనబడుతాయి

 వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది

వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది

రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో విటమిన్స్, మినిరల్స్ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి తగ్గుతుంది. వ్యాధినిరోధకశక్తి వీక్ గా మారుతుంది.

 ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ (అంగస్తంభన లోపాలు)

ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ (అంగస్తంభన లోపాలు)

రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కు రక్తప్రసరణ తగ్గడం వల్ల అంగస్తంభన లోపాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి వందత్వానికి దారితీస్తాయి. ఇది కూడా రక్త ప్రసరణ లోపాల్లో ఒకటిగా గుర్తించాలి

అకస్మాత్తుగా జుట్టు రాలడం :

అకస్మాత్తుగా జుట్టు రాలడం :

శరీంరలో రక్త ప్రసరణ సరిగా జరగలేదంటే కేవలం బాడీ పార్ట్స్ కు మాత్రమే కాదు, జుట్టుకు కూడా నష్టమే. జుట్టు రాలడం అధికమవుతుంది. తలలోని హెయిర్ ఫాలీసెల్స్ కు విటమిన్స్, న్యూట్రీషియన్స్ అందడం లోపించినప్పుడు రక్తప్రసరణ తగ్గుతుంది. దాంతో జుట్టు రాలడం అధికమవుతుంది. పూర్ బ్లడ్ సర్క్యులేషన్ కు ఇది కూడా ఒక సంకేతంగా గుర్తించాలి.

చెస్ట్ వద్ద హెవీగా అనిపించడం:

చెస్ట్ వద్ద హెవీగా అనిపించడం:

రక్త ప్రసరణ సరిగా జరగలేదంటే హార్ట్ లో హెవీగా , టైట్ గా అనిపిస్తుంటుంది. ఈ కండీషన్ ను ఆంగినా పెక్టోరిస్ అని కూడా పిలుస్తారు. బాడీలో మరియు హార్ట్ కు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఇలా హెవీగా ఫీలవుతుంటారు.

చర్మం రంగులో మార్పు :

చర్మం రంగులో మార్పు :

రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినా లేదా రక్త ప్రసరణ తక్కువగా ఉన్నా చర్మం రంగులో మార్పులు వస్తాయి. చర్మం సహజరంగును కోల్పోతుంది. కళ్ళ వద్ద చర్మరంగులో మార్పులు కనబడుతాయి.శరీరంలో వీక్ బ్లడ్ సర్క్యులేషన్ కు ఇది కూడా ఒక డేంజరెస్ సంకేతం .

English summary

Top Warning Signs Of Poor Blood Circulation

Blood circulation is the most important function in the body, as it enables the constant movement of blood through the body. Blood is responsible for transmitting the nutrients and oxygen to the brain and other vital organs in the body.
Story first published: Tuesday, February 14, 2017, 18:07 [IST]
Subscribe Newsletter