పసుపు అనే సహజసిద్ధమైన ఔషధం ఈ 9 మార్గాలలో క్యాన్సర్ పై పోరాటం సాగిస్తుంది

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పసుపుని సహజసిద్ధమైన యాంటీబయాటిక్ గా పేర్కొంటారు. ఇందులోనున్న ఔషధ గుణాలు అనంతం. అందుకే దీనిని ప్రకృతి ప్రసాదించిన ఎల్లో గోల్డ్ అని పిలుచుకుంటారు. వంటకాలకు చక్కటి వర్ణాన్ని తెచ్చిపెట్టడంతో పాటు మనకు అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పసుపు అనేక సీజనల్ ఇన్ఫెక్షన్స్ కి చక్కని ఔషధంగా పనికొస్తుందని మనందరికీ తెలిసిందే. అందుకే, ప్రాచీన కాలం నుంచీ కూడా దగ్గూ, జలుబుల నుంచి తక్షణ ఉపశమనం కోసం పసుపుని విరివిగా వాడతారు. సీజనల్ ఫ్లూ నుంచి ఉపశమనం కోసం మొదటి ఆప్షన్ గా పసుపుని ఎంచుకుంటారు. అయితే, పసుపులోనున్న ఔషధ గుణాలు క్యాన్సర్ తో పోరాడతాయన్న విషయం మీకు తెలుసా?

turmeric health benefits

అయితే, ఈ ఆర్టికల్ ను మీరు పూర్తిగా చదవాల్సిందే. పసుపు అనే స్పైస్ లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు అధికం. పసుపులోనున్న కుర్కుమిన్ అనే పదార్థం యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ గా వ్యవహరించడం వలనే పసుపుకి ఈ లక్షణం కలిగింది.

పసుపు నుంచి మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు

యాంటీ ఇంఫ్లేమేటరీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపెర్టీలు పసుపులో అత్యధికం. వీటితో పాటు, క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం పసుపులో ఉంది. అంతే కాదు, రేడియేషన్, కీమోథెరపీ వంటి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తరువాత కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా సమర్థవంతంగా పోరాడే లక్షణం పసుపులో కలదు.

ఈ ఆర్టికల్ లో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు కలిగిన పసుపు గురించి కొంత వివరంగా తెలియచేశాము.

1. క్యాన్సర్ కణాల్ని నశింపచేస్తుంది

1. క్యాన్సర్ కణాల్ని నశింపచేస్తుంది

కుర్కుమిన్ అనే పదార్థం వలన పసుపులో యాంటీ క్యాన్సరస్ లక్షణాలు అత్యథికమని అనేక పరిశోధనలలో తేలింది. అందుకే, పసుపు అనేది క్యాన్సర్ కణాల్ని నశింపచేయడానికి అమితంగా తోడ్పడుతుంది. రోజువారీ ఆహారపదార్థాలలో పసుపుని జతచేస్తే మనం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.

2. ప్రీ-క్యాన్సర్ పుండ్ల వృద్ధిని అరికడుతుంది

2. ప్రీ-క్యాన్సర్ పుండ్ల వృద్ధిని అరికడుతుంది

ఇప్పటివరకూ, పసుపు అనేది కేవలం దగ్గూ జలుబులకి చక్కని ఔషధంగా పనిచేస్తుందని మనం భావిస్తూ ఉన్నాం. అయితే, పసుపుని సరైన మోతాదులో గనక ఆహారంలో భాగంగా చేసుకుంటే ప్రీ క్యాన్సర్ పుండ్ల వృద్ధిని సహజంగా అరికట్టవచ్చని తెలుస్తోంది. పసుపుని తరచూ తీసుకోవడం వలన ఓరల్ క్యాన్సర్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే, పసుపు నూనె సారం నుంచి కూడా సెర్వికల్ క్యాన్సర్ ని అరికట్టే లక్షణాలను గ్రహించవచ్చని తెలుస్తోంది.

3. మెటాస్టాసిస్ ని అరికడుతుంది

3. మెటాస్టాసిస్ ని అరికడుతుంది

మెటాస్టాసిస్ అనే వ్యాధి లక్షణం వలన క్యాన్సర్ అనేది శరీరం మొత్తానికి వ్యాప్తిస్తుంది. అయితే, పసుపుని ఔషధంగా వాడటం వలన క్యాన్సర్ కణాల వ్యాప్తిని అలాగే ట్యూమర్లలో కొత్త రక్త కణాల అభివృద్ధిని అరికట్టవచ్చు. ఈ గుణాలను పొందటానికి రోజువారీ ఆహారంలో పసుపుని జతచేయవచ్చు లేదా సప్లిమెంట్స్ గా తీసుకోవచ్చు. గ్లాసుడు పాలలో కాస్తంత పసుపుని వేసుకుని తీసుకోవడం కూడా ఉత్తమమే.

4. యాంటీ కార్సినోజేనిక్ ప్రాపర్టీస్ పుష్కలం

4. యాంటీ కార్సినోజేనిక్ ప్రాపర్టీస్ పుష్కలం

పసుపులో నుండే కుర్కుమిన్ లో యాంటీ కార్సినోజేనిక్ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు కూడా పసుపులో అనేకం లభిస్తాయి. అందువలన, శరీరంలోని ముఖ్యమైన అవయవాలను విష పదార్థాలు దెబ్బతీయకుండా సంరక్షించే శక్తి పసుపుకి కలదు. తద్వారా, వివిధ రకాల క్యాన్సర్లను అరికట్టే శక్తి పసుపుకి కలదు.

5. ఇంఫ్లేమ్మేషన్ ను అణచివేస్తుంది

5. ఇంఫ్లేమ్మేషన్ ను అణచివేస్తుంది

పసుపులో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. అందువలన, పసుపుని తగిన మోతాదులో ఆహారం ద్వారా తీసుకుంటే క్యాన్సర్ కి సంబంధించిన ఇంఫ్లేమేషన్ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. ప్రత్యేకించి, లంగ్ క్యాన్సర్ ని అరికట్టడానికి పసుపు అనేది అమితంగా ఉపయోగపడుతుంది.

6. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

6. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠపరిచి తద్వారా క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తిని శరీరానికి కలిగించడంలో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపులో లభించే కుర్కుమిన్ అనే పదార్థం రోగనిరోధక వ్యవస్థను రెగులేట్ చేయడానికి తోడ్పడుతుంది. తద్వారా, క్యాన్సర్ నుంచి రక్షణని కల్పిస్తుంది.

7. రేడియో మరియు కీమో ప్రొటెక్టర్ గా ప్రసిద్ధి

7. రేడియో మరియు కీమో ప్రొటెక్టర్ గా ప్రసిద్ధి

రేడియేషన్ తో పాటు కీమోథెరపీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగం. ఈ రెండు చికిత్స విధానాల వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. పసుపులోనున్న కుర్కుమిన్ అనే పదార్థంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపెర్టీలతో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు అధికం. అందుకే, కుర్కుమిన్ ను తరచూ తీసుకోవడం ద్వారా రేడియేషన్ తో పాటు కీమోథెరపీల వలన కలిగే టాక్సిసిటీ ని తగ్గించుకోవచ్చు.

8. యాంటీ ట్యూమర్ ప్రాపర్టీస్

8. యాంటీ ట్యూమర్ ప్రాపర్టీస్

ట్యూమర్ అనేది క్యాన్సరస్ అయి ఉండవచ్చు లేదా నాన్ క్యాన్సరస్ అయినా అయి ఉండవచ్చు. పసుపులోనున్న కుర్కుమిన్ లో యాంటీ ట్యూమర్ ప్రోపర్టీలు అనేకం. అందువలన, ట్యూమర్ ఎదుగుదలకు అవసరమయ్యే వాటికి వ్యతిరేకంగా పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్ మరియి బ్రెయిన్ కి సంబంధించిన ట్యూమర్స్ వృద్ధిని అరికట్టడంలో పసుపు పాత్ర కీలకం.

9. క్యాన్సర్ సెల్స్ లోని డ్రగ్ రెసిస్టెన్స్ సమస్యను తొలగిస్తుంది

9. క్యాన్సర్ సెల్స్ లోని డ్రగ్ రెసిస్టెన్స్ సమస్యను తొలగిస్తుంది

డ్రగ్ రెసిస్టెన్స్ అనే సమస్య ఎంతో మంది క్యాన్సర్ పేషంట్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇంతకు ముందు పనిచేసిన ఔషధం మళ్ళీ పనిచేయకపోవడం డ్రగ్ రెసిస్టెన్స్ లో కనిపిస్తుంది. అయితే, ఈ సమస్యను నిర్మూలించడానికి పసుపు అమితంగా తోడ్పడుతుంది. రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్రాముల టర్మరిక్ ని తీసుకుంటే సత్ఫలితం లభిస్తుంది.

English summary

Turmeric Benefits For Cancer Treatment

Turmeric isn't just a spice but it has plenty of health benefits. Turmeric has been used since the ancient times to treat a number of ailments. There are properties of turmeric that help to treat cancer.
Story first published: Saturday, December 30, 2017, 14:00 [IST]