For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గా పూజ సమయంలో మీ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మార్గాలు ఇవే

By R Vishnu Vardhan Reddy
|

త్వరలోనే దసరా ఉత్సవాలు వచ్చేస్తున్నాయి. భారతీయుల్లో చాలా మంది ఈ పండుగని పురస్కరించుకొని దుర్గ పూజను చేస్తారు. ఈ పూజ జరిగే నాలుగు రోజుల పాటు అందరూ ఎంతో ఆనందంగా గడపడంతో పాటు మరెంతో రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు.

ఉల్లాసవంతంగా మనస్సు విప్పి తమ కుతుబ్ సభ్యులతో అందంగా మాటలను గడుపుతారు. ఒక పందిరి పై నుంచి ఇంకొక పందిరి పై గెంతడం, నోరూరించే ఎన్నో తిను బండారాలను భుజిచడంతో పాటు వీరురాలైన దుర్గామాతకు ప్రత్యేక భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు.

ప్రజలు ఈ ఉత్సవసమయంలో ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు మరియు కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు బంధువులు ఇలా ఎంతో మందితో కలిసి ఈ చక్కటి పండుగను చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇలా కలిసిన సందర్భంలో అందరూ చాలా ఆనందంగా గడుపుతారు. రకరకాల ఆహార పదార్ధాలను వండుకొని ఎంతో ఇష్టంగా తింటారు.

అయితే ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ద వహించాలి మరియు మరీ ముఖ్యంగా తమ యొక్క గుండె గురించి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుచేతనంటే, మనం తినే తినుబండారాలన్నింటిలోను ఎన్నో క్యాలరీలు ఉంటాయి. ఇవి మన శరీరంలో అధికమైతే గనుక అది మన శరీరం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

కానీ దుర్గ పూజ సమయంలో కూడా ఎందుకు మన గుండెను ఆరోగ్య వంతంగా ఉంచుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ? వాటి వెనుక ఉన్న వివిధ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఏమిటంటే...

దుర్గా పూజ సమయంలో మీ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మార్గాలు ఇవే


1 ) ఏ వయస్సులో ఉన్న వారైనా తమ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మరియు అంతే కాకుండా మన శరీరంలో ఉన్న కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఇందువల్ల రక్తపోటు అనేది నియంత్రణలో ఉంటుంది. గుండె పోటు రావడం, అనూహ్యంగా గుండె ఆగిపోవడం మొదలైన ఎన్నో రకాల గుండె సంబంధిత వ్యాధులను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు.

దుర్గ పూజ ప్రత్యేకం: మధుమేహాన్ని ముందు జాగ్రత్తగా నియంత్రించే చర్యలు..దుర్గ పూజ ప్రత్యేకం: మధుమేహాన్ని ముందు జాగ్రత్తగా నియంత్రించే చర్యలు..

2 ) ఒత్తిడితో కూడిన భావాలను తగ్గించుకోవడానికి ఆరోగ్యవంతమైన గుండెను కలిగి ఉండటం చాలా ముఖ్యం.

3 ) ఆలోచన తగ్గిపోయే మానసిక స్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే, మీ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.


దుర్గా పూజ త్వరలో వస్తుండటం వల్ల, ఈ పూజ సమయంలో ఏ ఏ రకాలుగా తమ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1 ) ఇంట్లో తయారు చేసిన ఆహారాలను తినండి :

1 ) ఇంట్లో తయారు చేసిన ఆహారాలను తినండి :

దుర్గా పూజ అంటేనే చాలా మంది విపరీతంగా తినడానికి ఇష్టపడతారు. అయితే బయటికి వెళ్లి తిననడం కంటే కూడా ఇంట్లో తయారు చేసుకొని తినడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే, బయట తయారు చేసిన ఆహారంలో ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. దీనివల్ల కొవ్వు శరీరంలో విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకు ప్రతిఫలంగా మీ గుండెకు ఇవ్వన్నీ హాని చేయవచ్చు.

2 ) నడవడం :

2 ) నడవడం :

మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే నడవడం అనే ప్రక్రియ ఇందుకు ఎంతగానో దోహద పడుతుంది. కావున ఒక మండపం నుండి ఇంకొక మండపానికి గెంతడం లేదా పరిగెత్తడం మీకు మంచి చేయవచ్చు. ఎందుకంటే, ఒకటే దగ్గర ఎక్కువ సేపు కూర్చడం వల్ల అది మీ గుండెకు హాని చేసే ప్రమాదం ఉంది. అయితే ఇలా ఒక మండపం నుండి ఇంకొక మండపానికి వెళ్తున్న సమయంలో ఒక్కో మండపం దగ్గర కొద్దిగా ఆగి విశ్రాంతిని తీసుకొని మళ్ళీ ఇంకొక మండపానికి వెళ్లడం మంచిది.

3 )మద్యాన్ని నిషేధించండి :

3 )మద్యాన్ని నిషేధించండి :

అతిగా మద్యాన్ని త్రాగడానికి దూరంగా ఉండండి, అలా చేయడం వల్ల మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా మీకు గనుక శక్తి హీనమైన గుండె గనుక ఉంటే మద్యాన్ని పూర్తిగా నిషేధించడం మంచిది.

నవరాత్రి స్పెషల్: 6 ఆహార పదార్థాలు అసిడిటిని దూరంగా ఉంచుతాయినవరాత్రి స్పెషల్: 6 ఆహార పదార్థాలు అసిడిటిని దూరంగా ఉంచుతాయి

4) వేరొకరితో కలిసి పొగ త్రాగటం మానివేయండి :

4) వేరొకరితో కలిసి పొగ త్రాగటం మానివేయండి :

ఒక మండపం దగ్గర నుండి ఇంకొక మండపానికి వెళ్లే సమయంలో చాలా మంది తమ స్నేహితులతో సిగెరెట్ పంచుకొని, పొగ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటారు. కానీ, అధ్యయనాలు చెబుతున్నది ఏమిటంటే ఇలా స్నేహితులతో కలిసి ఒకటే సిగరెట్ త్రాగడం ద్వారా గుండె జబ్బులు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుచేత పొగత్రాగడాన్ని ఎట్టి పరిస్థితిల్లో ప్రోత్సహించకండి, పూర్తిగా నిషేధించండి.

5 ) తక్కువ మోతాదులో ఉప్పుని తీసుకోండి :

5 ) తక్కువ మోతాదులో ఉప్పుని తీసుకోండి :

దుర్గాపూజ సందర్భంగా చాలా మంది బంధువుమిత్రులను కలుస్తుంటారు, మీ ఇంటికి కూడా వస్తుంటారు. ఈ సమయంలో ఆహార పదార్ధాలను వండేటప్పుడు చాలా తక్కువ ఉప్పుని వాడటం చాలా మంచిది. అంతే కాకుండా బయట నుండి ఆహార పదార్ధాలను తెచ్చుకోవడం తగ్గించండి మరియు బయట ప్రదేశాలకెళ్లి తినడాన్ని కూడా నిషేధించండి. ఎందుకంటే ఆయా ఆహారపదార్ధాల్లో ఎక్కువ శాతం ఉప్పు ఉంటుంది. ఉప్పు తక్కువగా ఉన్న ఇంటి ఆహారం తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది.

6 ) తగినంత సేపు నిద్రపోండి :

6 ) తగినంత సేపు నిద్రపోండి :

ఈ పండగ సమయంలో రాత్రిపూట చాలా మంది వివిధ మండపాల దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో దుర్గ పూజ సమయంలో రాత్రిపూట అంతా మేలుకొని ఉంటారు. కానీ, రాత్రిపూట మరీ ఎక్కువ సేపు మేలుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రిపూట బాగా నిద్రపోండి, నిద్రకు కనీసం 6 నుండి 8 గంటలు కేటాయించండి. ఇది చాలా తప్పనిసరి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలు సజావుగా జరుగుతాయి.

7 ) గట్టి శబ్దాలకు దూరంగా ఉండండి :

7 ) గట్టి శబ్దాలకు దూరంగా ఉండండి :

మండపాల దగ్గర గట్టిగా పెట్టే లౌడ్ స్పీకర్లకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే శబ్దాలు తీవ్రతను మించి గనుక విన్నట్లైతే అది మీ శరీరం తట్టుకోలేదు, ముఖ్యంగా అది మీ గుండె పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.

8 ) బాగా నీళ్లు త్రాగండి :

8 ) బాగా నీళ్లు త్రాగండి :

ఈ పండుగ సమయంలో ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి మీ శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుచేత మీరు తరచూ నీళ్లు మరియు పండ్ల రసాలు త్రాగడం వల్ల ఆరోగ్యవంతంగా మీ శరీరాన్ని ఉంచుకోగలుగుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో శీతలపానీయాలను ( కాల్ డ్రింక్స్ ) త్రాగకండి.

English summary

Ways To Keep Your Heart Healthy During Durga Puja

Durga puja is just around and here are a few of the best ways to keep your heart healthy.
Story first published:Wednesday, September 20, 2017, 16:14 [IST]
Desktop Bottom Promotion