సూర్యగ్రహణం సమయంలో మీ కళ్ళను సంరక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

సూర్యగ్రహణం చూడడానికి మీకు కళ్ళద్దాలు గల చూపు (దృష్టి) ఉన్నప్పటికీ, ఇది మీ కళ్ళకు చాలా హానికరంగా ఉంటుంది. కేవలం కళ్ళతో గ్రహణం చూసినప్పుడు అంధుడిగా (గుడ్డివానిగా) మారవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం ?

గ్రహణం సమయంలో వెలువడే సౌర వికిరణాలు చాలా శక్తివంతమైనవి, అలాగే ఫొటోగ్రాఫర్ల కళ్లలో గల రెటీనా కణాలకు చాలా సులభంగా నష్టాన్ని కలిగిస్తాయి. ఇది శాశ్వతమైన కంటి చూపును పోగొట్టుకోవడానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో రొమాన్స్ చేయకూడని సందర్భాలు..!

అలాగే, సూర్యుని నుండి వెలువడే "UV వికిరణాలు" కంటి బాహ్య నిర్మాణానికి శాశ్వతమైన నష్టాన్ని కలుగజేయవచ్చు, అలాగే సూర్యుని ప్రకాశవంతమైన కిరణాలు ఫోకల్ పాయింట్ ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.

సూర్య గ్రహణం :

సూర్య గ్రహణం :

మీలో చాలామంది రాబోయే సూర్యగ్రహణాన్ని చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారని మేము ఖచ్చితంగా చెప్పగలము. ఈ గ్రహణం అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అలాగే ఇతర దేశాలలో కనబడుతుంది కానీ భారతదేశంలో మాత్రం కనబడదు. గ్రహణ సమయంలో కంటిచూపు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి ఒకసారి చూద్దాం.

సూర్య కిరణాలు నేరుగా మీ కళ్ళలోకి పడేటట్లుగా అస్సలు అనుమతించవద్దు, అది కొద్ది సమయమైనా సరే. గ్రహణం చూసిన తర్వాత మీరు మీ కంటి చూపులోని కొన్ని దోషాలను ( అనగా కేంద్ర దృష్టిని కోల్పోవడం గానీ, రంగులు కనబడకపోవడం గానీ వంటి వాటిని) గుర్తించినట్లయితే మీరు వెంటనే వైద్య సహాయం కొరకు సంప్రదించాలి.

1. ప్రత్యేకమైన కంటి అద్దాలను వాడటం :

1. ప్రత్యేకమైన కంటి అద్దాలను వాడటం :

ISO (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) ప్రమాణాల స్థాయిని కలిగివున్న ప్రత్యేకమైన కంటి అద్దాలు గ్రహణ సమయంలో కంటిని పూర్తిగా సంరక్షించడానికి ఒక మంచి మార్గము. అది ఎలానో చూద్దాం.

ఈ కళ్లజోడు సూర్యుని నుంచి వెలువడే తీవ్రమైన కాంతిని, UV కిరణాలను, పరారుణ కిరణాల వంటి వాటిని కచ్చితంగా అడ్డుకోగలవు. ఇంకా కళ్ళకు చాలా మంచి చెయ్యగలదు కూడ. కానీ ఆ కళ్ల జోడు లెన్స్ (అద్దాల) విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.

1. గీతలు గీయబడకూడదు

2. మరకలు పడకూడదు

3. చాలా పాతవి కాకూడదు (ఆ అద్దాలు 3 సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం వాడబడి ఉండకూడదు)

2. మీరు గ్లాసెస్ తీసివేసినప్పుడు జాగ్రత్త వహించండి :

2. మీరు గ్లాసెస్ తీసివేసినప్పుడు జాగ్రత్త వహించండి :

గ్రహణం ముగిశాక, సూర్యుని నుండి దూరంగా చూసే సమయంలో ఆ ప్రత్యేకమైన అద్దాలను తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ కళ్లతో నేరుగా సూర్యుడిని కొన్ని క్షణాలపాటు కూడా చూడవద్దు.

మన ఇండియాలో బాగా ప్రసిద్ది చెందిన మూఢనమ్మకాలు

3. కళ్ల పరికరాలను నివారించండి :

3. కళ్ల పరికరాలను నివారించండి :

సరైన ఫిల్టర్లులేని కెమెరా, టెలీస్కోప్లు లేదా ఏదైనా ఇతర ఆప్టికల్ పరికరం ద్వారా చూడటం పూర్తిగా మానివేయండి. ఈ పరికరాల ముందు భాగంలో ఫిల్టర్లను సరైన పద్ధతిలో అమర్చబడి ఉంటాయి.

అలాగే, ఆ ఫిల్టర్లను కలిగి ఉన్న పరికరాలను వాడేముందు మనల్ని అప్రమత్తం చేస్తాయి ఎందుకంటే, ఆ ప్రత్యేకమైన అద్దాలు సూర్యకిరణాల తీవ్రతను బట్టి ఫిల్టర్లు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అవి నేరుగా మీ కళ్ళను తాకడం వల్ల శాశ్వతమైన నష్టం వాటిల్లవచ్చు.

4. కళ్ళజోడు ధరించే వారికి చిట్కాలు :

4. కళ్ళజోడు ధరించే వారికి చిట్కాలు :

మీరు ఎల్లప్పుడూ కళ్ళజోళ్ళు ధరించే వారైతే, అప్పుడు వాటి మీద సౌర అద్దాలను కూడా అమర్చి పైన చెప్పిన జాగ్రత్తలను తీసుకోవాలి.

5. నిపుణుల సలహాను కోరడం :

5. నిపుణుల సలహాను కోరడం :

ఎలాంటి ఆప్టికల్ పరికరం ద్వారనైనా సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ఒక నిపుణుడు సలహ ఎల్లప్పుడూ అవసరం. అలాంటి వారి మార్గదర్శకంలో గ్రహణాన్ని చూడటం చాలా సురక్షితం.

సూర్యుడికి భూమికి మధ్య లో చంద్రుడు రావడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలుసు. చంద్రుడి చేత సూర్యుడు పూర్తిగా కప్పబడినట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది, దీనిని భూమి మీద కొన్ని ప్రదేశాల్ల నుండి మాత్రమే చూడవచ్చు. సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు ప్రత్యేక అద్దాలను తొలగించి మొత్తం గ్రహణాన్ని కళ్లతో నేరుగా చూడవచ్చు.

ఇది సుమారు ఒకటి నుండి రెండు నిమిషాలు మాత్రమే సాగుతుంది. కానీ సూర్యుడు కొద్దికొద్దిగా కనబడుతున్నప్పుడు మళ్లీ గ్రహణం జరుగుతుందని భావించి, ఆ ప్రత్యేక అద్దాలను తిరిగి ధరించి మీ కళ్ళను రక్షించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు గ్రహణం బయటవైపు చూస్తున్నప్పుడు ఆ

ప్రత్యేక అద్దాలను ఎప్పుడూ ధరించాలి అలాగే వాటిని ఏ కారణంతోనూ ఎప్పుడూ తొలగించకూడదు.

అందువల్ల పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన శరీర కిటికీలను జాగ్రత్తగా సంరక్షించవచ్చు (మన కంటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా) !

ఈ గ్రహణాన్ని ఆనందంగా వీక్షించండి...

English summary

Best Ways To Protect Your Eyes During A Solar Eclipse

Know about a few of the best ways to protect your eyes during a solar eclipse, here on Boldsky.
Subscribe Newsletter