For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనీర్ ఆరోగ్యానికి మంచిదా?

By Deepti
|

పనీర్ దేశంలో ప్రముఖమైన ఆహార పదార్థం. శాకాహారులు, మాంసాహారులు సమానంగా ఇష్టపడే ఆహారం. పాలనుంచి తయారయ్యే పనీర్ లో అనేక పోషకాలుండి ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమందైతే పనీర్ ను పచ్చిగానే ఇష్టపడతారు.

పచ్చిగా లేదా వండిన రూపంలో తీసుకున్నా పనీర్ ను ఏరకంగా అయినా తీసుకోకుండా ఉండలేం. దానికి చాలా మంచి కారణాలున్నాయి. ఎన్నో పోషక విలువలున్న పనీర్ భారతీయ వంటకాలలో భాగమైపోయింది. ఎందుకు కాకూడదు?

పనీర్ యొక్క ఒక 15 లాభాలను తెలుసుకోండి ;

గుండె జబ్బులకి రక్షణ కల్పిస్తుంది

గుండె జబ్బులకి రక్షణ కల్పిస్తుంది

పన్నీర్ నిత్యం తీసుకుంటుంటే హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గి, రక్తపోటు, లిపిడ్ శాతాలు కూడా అదుపులో ఉంటాయి. పనీర్ లోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.

జీవక్రియను పెంచుతుంది

జీవక్రియను పెంచుతుంది

పనీర్ లోని పీచుపదార్థం జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో సాయపడుతుంది

ఎముకలు మరియు పళ్ళను గట్టిపరుస్తుంది

ఎముకలు మరియు పళ్ళను గట్టిపరుస్తుంది

పన్నీర్ లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకల రోగాలను, పళ్ళ సమస్యలను పోగొట్టి వాటిని గట్టిపరుస్తుంది. పనీర్ లో ఉండే విటమిన్ డి దంతాల కావిటీలు రాకుండా చేస్తుంది.

పిల్లలకు ఆరోగ్యకరం

పిల్లలకు ఆరోగ్యకరం

పనీర్లో ఎక్కువగా ఉండే ప్రొటీన్, మంచి కొవ్వులు ఎదిగే పిల్లలకు పోషకాలందించి వారి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పిల్లలలో కణజాల ఉత్పత్తి, అవి బలంగా మారటానికి పనీర్ ఉపయోగపడుతుంది.

ధృఢమైన జుట్టు, చర్మానికి సాయం

ధృఢమైన జుట్టు, చర్మానికి సాయం

విటమిన్ బి, ఒమెగా-3 మరియు 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జుట్టుకి, చర్మానికి మంచిది. చర్మం ముడతలు పడకుండా, వాపు కలిగించే డెర్మటైటిస్ ను ఆపటానికి పనీర్ సాయపడుతుంది.

భారీ వ్యాయామాలు చేసిన వెంటనే పనీర్ తింటే వెనువెంటనే శక్తి,ఓపిక వస్తుంది.

కీళ్ళనొప్పులకు ఉపశమనం

కీళ్ళనొప్పులకు ఉపశమనం

పనీర్లోని ఒమేగా-3 మరియు ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పోరాడతాయి.

కాన్సర్ నివారిణి

కాన్సర్ నివారిణి

పనీర్లోని మంచి ప్రొటీన్ కడుపు, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ల వంటి వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

డయాబెటిస్ రోగుల కోసం

డయాబెటిస్ రోగుల కోసం

పనీర్ లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు డయాబెటిక్ రోగులలో హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోం, గ్లూకోజ్ ఇన్ టోలరెన్స్ వంటి స్థితులు రాకుండా చేస్తుంది.

గర్భవతులకు మంచిది

గర్భవతులకు మంచిది

గర్భవతులు పనీర్ తీసుకోవడం వలన వారికి కలిగే పొద్దున వికారం, రక్తహీనత వంటి వాటిని పోరాడటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కొత్తగా పుట్టిన పసిబిడ్డలలో ఏ జన్యులోపాల ప్రభావం తగ్గించటానికి కూడా సాయపడుతుంది.

యవ్వనకారిణి

యవ్వనకారిణి

పనీర్ కొత్తకణాలను పుట్టించి, శరీరాన్ని వృద్ధాప్య ఛాయలకు పోకుండా వయస్సుకి తగ్గట్టుగా బిగువుగా ఉండేట్లు చేస్తుంది.

మూత్రవ్యవస్థ సమస్యను ఆపుతుంది

మూత్రవ్యవస్థ సమస్యను ఆపుతుంది

మూత్రవ్యవస్థ పనితీరులో పనీర్ నీరు ఎంతో మంచిది. జీర్ణవ్యవస్థ సరిగా ఉండాలంటే ఇది తాగటం మంచిది.

రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది

రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది

పనీర్ వలన గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడవు.

మాక్యులర్ డీజెనరేషన్ ను నివారిస్తుంది

మాక్యులర్ డీజెనరేషన్ ను నివారిస్తుంది

వృద్ధాప్యం వలన వయస్సు మీరుతున్నప్పుడు వచ్చే కణజాల హీనత నుంచి పనీర్ మిమ్మల్ని రక్షిస్తుంది.

మెనోపాజ్ సమయంలో మానసిక వత్తిడిని తగ్గేలా చేస్తుంది

మెనోపాజ్ సమయంలో మానసిక వత్తిడిని తగ్గేలా చేస్తుంది

పనీర్లోని పోషకవిలువలు స్త్రీలలో మెనోపాజ్ సమయంలో వచ్చే మానసిక వత్తిడిని తగ్గిస్తాయి.

English summary

We All Love Paneer, Isn’t It? And It Is Worth Because Of These Top 15 Health Benefits

Here are 15 health benefits that paneer offers to us, take a look.
Story first published:Friday, July 7, 2017, 13:35 [IST]
Desktop Bottom Promotion