For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాతావరణంలో మార్పులు: వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ ను నివారించే మన వంటింటి నేస్తాలు!

|

ఆహ్వానించకుండా వచ్చే అథితి ''వాతావరణ మార్పులు''. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే వివిధ రకాలు ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, అలర్జీలు వెంటబెట్టుకొని వస్తాయి. వివిధ రకాల వైరస్ లు మన శరీరం మీద దాడి చేస్తాయి. వీటిని ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉండదు.

అందుకు ముఖ్యమైన కారణం వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండటం. ఈ పరిస్థితిలో వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి తగిన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి వివిధ రకాల ఆహారాలు సహాయపడుతాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి.

అకస్మాత్ గా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మెడికల్ షాపులకు లేదా డాక్టర్స్ వద్దకు వెళ్ళకండి. జలుబు మరియు దగ్గు ప్రారంభదశలో ఉన్నప్పుడు మొదట హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. అప్పటీకి నయం కాకపోతే తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లండి. మన వంటగదిలో వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు, ఇన్ఫెక్షన్స్ నివారించే హోం రెమెడీస్ ఎన్నో ఉన్నాయి.

Weather Change: Foods That Help In Boosting Immunity & Prevent Infections

ఈ వంటింటి నేస్తాలు వ్యాధినిరోధకశక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్స్, ఫ్లూ, కోల్డ్ వంటి జబ్బులను నివారిస్తాయి. అంత కంటే ముందు జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవడం మంచిది. అందుకే 'ప్రివెషన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ 'అన్నారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడాలంటే రోగనిధక శక్తిని మెరుగ్గా ఉండాలి.

రెగ్యులర్ గా ఎవరైతే సమతుల్య ఆహారం తీసుకుంటూ, రోజువారి వ్యాయామాలు చేస్తుంటారో వారిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వీరికి ఎలాంటి సమస్య ఉండదు. వాతావరణంలో మార్పుల బట్టి, వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ క్రింది లిస్ట్ లోని ఆహారాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఈ ఆహారాలు వ్యాధినిరోధకశక్తిని పెంచడంతో పాటు, ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి...

సిట్రస్ ఫ్రూట్స్ :

సిట్రస్ ఫ్రూట్స్ :

విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కోల్డ్ మరియు ఫ్లూను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. నిమ్మ, నారింజ, బత్తాయి, బొప్పాయి, జామ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచి హెల్తీగా ఉంచుతుంది. విటమిన్ సి తెల్ల రక్తకణాలను పెంచుతుంది. దాంతో ఇమ్యూనిటి సిస్టమ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి, విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండగలుగుతారు.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్ ఎ, సి మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ తో పాటు అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచడంతో పాటు, ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. పచ్చిగా లేదా హాఫ్ బాయిల్ చేసిన బ్రొకోలీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు :

పసుపు :

పసుపు, ఒక ఇండియన్ మసాలా దినుసు. ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ. ఇది శరీరానికి వండర్ ఫుల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. పసుపును రెగ్యులర్ డైట్ లో ఉపయోగించడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి, డిటాక్సిఫికేషన్ జరగుతుంది. ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో పసుపు గ్రేట్ రెమెడీ. ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు మిక్స్ చేసి గోరువెచ్చగా తాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి వేగంగా పెరుగుతుంది.

చికెన్ సూప్ :

చికెన్ సూప్ :

చల్లని వాతావరణంలో గోరువెచ్చని చికెన్ సూప్ తాగడం, ఇది ఒక ఏజ్ ఓల్డ్ రెమెడీ. జలుబు, దగ్గు , గొంతు నొప్పిని తగ్గించడంలో చికెన్ సూప్ గ్రేట్ గా సహాయపడుతుంది. చికెన్ సూప్ తయారుచేసేప్పుడు అమినో యాసిడ్ విడుదలవుతాయి. దీన్నే సిస్టైన్ అని పిలుస్తారు . ఇది బ్రొంకైటిస్ ను నివారిస్తుంది. కాబట్టి, వాతావరణంలో మార్పులను బట్టి చికెన్ సూప్ తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం.

వెల్లుల్లి :

వెల్లుల్లి :

వెల్లుల్లిని రెగ్యులర్ వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఇది వంటలకు రుచి, మంచి ఆరోమా వాసన అందివ్వడం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ఇమ్యూన్ బూస్టర్. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే కంటెంట్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే గుణాలతో పాటు, వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షణ కల్పించే గుణాలు కూడా అధికంగా ఉంటాయి .

అల్లం:

అల్లం:

గొంతు నొప్పి, ఫ్లూ, కోల్డ్ లేదా ఇతర దీర్ఘకాలిక నొప్పులను నివారించడంలో అల్లం గ్రేట్ హోం రెమెడీ. వెల్లుల్లి లాగే అల్లం కూడా బాగా పాపులర్ అయినటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్ రెమెడీ. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పెరుగు :

పెరుగు :

పెరుగు, ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇది శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో వ్యాధినిరోధకశక్తి క్రమబద్దం అవుతుంది. శరీరం చురుకుగా పనిచేయడానికి సమాయపడుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే అనేక మార్పులను నివారిస్తుంది.

English summary

Weather Change: Foods That Help In Boosting Immunity & Prevent Infections

Weather Change: Foods That Help In Boosting Immunity & Prevent Infections,The main reason can be low immune power. In this situation, you need to find some ways to boost your immune system. There are many foods that can help boost immunity and thereby prevent infections.
Story first published: Tuesday, May 30, 2017, 18:29 [IST]
Desktop Bottom Promotion