For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మందులకు మహిళలు దూరంగా ఉండాలి

By Bharath Reddy
|

మెడిసిన్స్ అనేవి ఇప్పుడు మన జీవితాల్లో భాగం అయిపోయాయి. చాలామంది మహిళలు వీటి వినియోగం లేకుండా రోజు గడవదు. అయితే మరికొందరు మాత్రం మెడిసిన్స్ ఉపయోగించకుండానే ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తుంటారు. మనం తీసుకుంటున్న మెడిసిన్స్ తో చాలా వరకు సమస్యల్ని పరిష్కరించుకుంటామని మనం అనుకుంటాం. అయితే అవి మన శరీరానికి ఎంత మేరకు ప్రయోజనాలు కలగిస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల మందుల వల్ల భవిష్యత్తులో దుష్ప్రభావాలు కలుగుతాయి. జ్వరమో, కడుపునొప్పో..

ఇలా ఏదో ఒక సమస్య తలెత్తినా వెంటనే మందులు వేసుకుంటాం. సమస్య తగ్గిపోతుంది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాం. ఇలా మెడిసిన్స్ మనకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఎన్నెన్నో జబ్బులను నయం చేస్తూ ఊరట కలిగిస్తున్నాయి. అయితే వీటితో చిక్కేటంటే ప్రతి మందుతోనూ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మందులతో ఒనగూడే ప్రయోజనాల కన్నా అ వి చూపే దుష్ప్రభావాలు మనకు అనే ప్రమాదాలను తెచ్చిపెట్టొచ్చు.ప్రతి దానికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే అవి మీ నెమ్మదిగా మీ రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తాయి.

<strong>అలర్ట్: హోమియోపతిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసా ?</strong>అలర్ట్: హోమియోపతిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసా ?

అలాగే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. మీ శరీరంలో కొన్ని అవయవాలపై అవి చాలా దుష్ప్రభావాలు చూపుతాయి. చాలా హాని చేస్తాయి. ఒక మెడిసిన్ మీ వ్యాధికి మాత్రమే కాకుండా మీ శరీరంపై అది ఎలా ప్రభావం చూపుతుందో కూడా మీరు తెలుసుకోవాలి. మహిళలు వారు తీసుకునే మెడిసిన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలు ఎక్కువగా తీసుకోకూడని కొన్ని మందుల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

మెఫ్టాల్ స్పాస్

మెఫ్టాల్ స్పాస్

కొందరు స్త్రీలు బహిష్టు సమయంలో బ్లీడింగ్‌ని కంట్రోలు చేసుకోవడానికి మెఫ్టాల్‌ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మెడిసిన్ వారికి ఆ సమయాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాని వారి ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. మెఫ్టాల్ ను ఎక్కువగా ఉపయోగించనట్లయితే భవిష్యత్తులో మీరు క్యాన్సర్ లేదా వంధ్యత్వం బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ టాబ్లెట్లను వీలైనంత వరకు జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. మోతాదు మించితే చాలా ప్రమాదకరం.

నిమెసిలైడ్

నిమెసిలైడ్

ఈ మెడిసిన్ ను ప్రధానంగా తీవ్రమైన నొప్పులు, పీరియడ్స్ నొప్పులకు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వాటకి కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్లను ఎక్కువగా తీసుకుంటే అవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక మరియు క్రమ పద్ధతిలో తీసుకున్న ఈ ఔషధం మూత్రపిండ సమస్యలకు కారణం కావచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులకు మీరు గురయ్యే అవకాశం ఉంది. అందుల్ల ఈ సైడ్స్ ఎఫెక్ట్ ను గుర్తుంచుకోని మీరూ వ్యవహరించాలి.

పారాసెటమాల్

పారాసెటమాల్

పారాసెటమాల్ మాత్రలు దాదాపు ప్రతి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయి. కొంచెం తలనొప్పి వచ్చిన చాలు వెంటనే బ్యాగ్ ఓపెన్ చేయడం మాత్రను వేసుకోవడం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. పారాసెటమాల్ మాత్రలు ఎక్కువగా వినియోగిస్తే మీరు భవిష్యత్తులో కాలేయ సమస్యకు గురవుతారు. అందువల్ల గర్ల్స్ బీ కేర్ ఫుల్. మీరూ ప్రతి దానికి పారాసెటమాల్ వాడారనుకో అంతేసంగతులు.

అల్ప్రాజోలం

అల్ప్రాజోలం

దీన్ని దాదాపుగా ఆందోళన, పానిక్ రుగ్మతల చికిత్సకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఎక్కువగా ఈ ట్యాబెట్స్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. స్త్రీలలో అండోత్పత్తి సమస్యలు ఏర్పడుతాయి. సో.. అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇలాంటి ట్యాబ్లెట్స్ తక్కువగా వినియోగించాలి.

డార్ట్ టాబ్లెట్లు

డార్ట్ టాబ్లెట్లు

సాధారణంగా తలనొప్పి లేదా బాడీ పెయిన్స్ కి డార్ట్ మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇది శరీరానికి బాగా హాని కలిగించే మెడిసిన్. వాస్తవానికి ఈ మాత్రల్ని నిషేధించారు. అయినా కొన్ని మెడికల్ స్టోర్స్ ఆన్లైన్ స్టోర్లలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించకపోవడం ఉత్తమం. దీర్ఘకాలికంగా ఈ మాత్రలు ఉపయోగిస్తే గర్భధారణ సమయంలో ఇవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.

<strong>ఆరోగ్యానికి ఒక మెడిసిన్ లా పనిచేసే వంటగదిలోని పదార్థాలు</strong>ఆరోగ్యానికి ఒక మెడిసిన్ లా పనిచేసే వంటగదిలోని పదార్థాలు

ఫినా స్టెరాయిడ్

ఫినా స్టెరాయిడ్

ఈ స్టెరాయిడ్స్ ను కండరాలు బలపడడానికి ఆకలి పెంచేందుకు ఉపయోగిస్తారు. బాడీబిల్డర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వీటిని మహిళలు అస్సలు ఉపయోగించకూడదు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, గర్భస్రావం వంటి వాటి బారిన పడాల్సి వస్తోంది. అందువల్ల వీటిని ఉపయోగించకపోవడం ఉత్తమం.

విటమిన్ ఎ టాబ్లెట్లు

విటమిన్ ఎ టాబ్లెట్లు

విటమిన్ ఎ మాత్రలు మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రుతుక్రమం సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అయినా లేదా, యోనికి సంబంధించిన అంటువ్యాధులను అరికట్టేందుకు వీటిని ఉపయోగిస్తారు. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్, పీఎంస్ (ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్) లకు కూడా మహిళలు వీటిని ఉపయోగిస్తారు. ఈ విటమిన్స్ టాబ్లెట్లను అధికంగా తీసుకోవడం వల్ల అలసట, అనోరెక్సియా, అజీర్తి, గర్భస్రావం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల వీలైనంత వరకు వీటిని తక్కువగా ఉపయోగించాలి.

విటమిన్ సి టాబ్లెట్స్

విటమిన్ సి టాబ్లెట్స్

విటమిన్ సి అనేది మన శరీరంలోని ఎముకలు, రక్త నాళాలు, కండరాల పని తీరును మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల కొన్ని ఫలితాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఈ ట్లాబెట్స్ ఉపయోగిస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. మహిళల్లో గర్భస్రావం వంటి వాటికి ఇవి కారణమవుతాయి. అందువల్ల మహిళలు వీలైనంత వరకు వీటిని తక్కువగా ఉపయోగించండి.

English summary

which medicines should be avoided being a woman

Now being a woman one should be more careful what you consume. Here is a guide to which medicines should be avoided being a woman.
Story first published:Friday, October 27, 2017, 14:31 [IST]
Desktop Bottom Promotion