షాక్: నీటిని మళ్లీమళ్లీ మరిగించి తాగితే శరీరానికి ఏమౌతుందో తెలుసా?

Posted By: Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

ఉదయం ఈ ప్రపంచం మేల్కొనే సమయం. లేవగానే ఎన్నెన్నో పనులు మనకు ఆహ్వానం పలుకుతాయి. అలా స్నానం చేసి డ్రెస్ చేసుకునే లోపు ఇక ఆ రోజు చేయాల్సిన విధులన్నీ గుర్తొస్తాయి. ఒకటా.. రెండా.. కొన్ని మిలయన్లు రోటిన్ టాస్క్ గుర్తొస్తాయి. మరి వీటన్నింటి నడుమ మెదడుకు కాస్త విశ్రాంతి దొరకాలంటే వేడివేడిగా ఉండే ఒక కప్ కాఫీ తాగాల్సిందే కదా మరి.

సాధారణంగా మనలో చాలామందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఫిల్టర్ కాఫీ తాగుతారు. మరికొందరు బాగా బాయిల్డ్ చేసింది తాగుతారు. నీటిని మరిగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అంత వరకు ఓకే. కానీ దాన్ని మళ్లీమళ్లీ మరిగిస్తారు చూడు.. అదే పెద్ద దెబ్బ. అలాంటి నీటితో తయారు చేసిన వాటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది.

రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

1. నీటిని మళ్లీమళ్లీ ఉడికిస్తే ఏమవుతుంది ?

1. నీటిని మళ్లీమళ్లీ ఉడికిస్తే ఏమవుతుంది ?

మనలో కెమిస్ట్రీ తరగతులంటే చాలా మందికి ఆసక్తి ఉండి ఉండదు. అందువల్ల స్కూల్ డేస్ లో ఆ తరగతులకు కూడా హాజరై ఉండి ఉండం. అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్కడ తెలుసుకోని విషయాలను ఇక్కడ మేము క్లుప్తంగా, అర్థమయ్యేలా వివరిస్తాం కదా. అందువల్ల ఇది కాస్తా జాగ్రత్తగా చదవండి సుమా.

2. నీటి వేడి చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి

2. నీటి వేడి చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి

అస్థిర సమ్మేళనాలన్నీ ఆవిరైపోతాయి. ఇక అందులో ఉండే వాయువులన్నీ కరిగిపోతాయి. ఇలాంటి నీటిని తాగడం వల్ల ప్రయోజనాలంటాయి. కానీ కెమిస్ట్రీలో ఒక ట్విస్ట్ ఉంది. వేడి చేసిన నీటిని మళ్లీ మరిగించారనుకో ఇక అంతే సంగతులు. కొన్ని హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. అదే స్వచ్ఛమైన నీరు హానికరంగా మారుతుంది. నీటిని ఎప్పుడైతే చాలా సేపు బాగా వేడిచేస్తారో అప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడుతుంది.

3. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతుంది

3. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతుంది

అంతేకాకుండా ఫ్లోరైడ్, నైట్రేట్లు, ఆర్సెనిక్ వంటి రసాయనాలు కూడా ఉత్పన్నం అవుతాయి. దీంతో నీటిలో ఉండే ఆరోగ్యకరమైన ఖనిజాలు ప్రమాదకరంగా మారిపోతాయి. ఉదాహరణకు అధిక కాల్షియం అనేది పిత్తాశయం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతుంది. అలాగే ఇవి కూడా చాలా పలు రకాల వ్యాధులకు గురికావడానికి అవకాశం ఉంది.

ఈ మూడు ప్రమాదకరమైన వాయువులు ఏమి చేస్తాయో తెలుసా?

4. జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు-ఆర్సెనిక్

4. జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు-ఆర్సెనిక్

తాగునీటిలో ఉండే ఆర్సెనిక్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉందని ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆర్సెనిక్ అనేది మనల్ని విషపూరితంగా మారుస్తుంది. అయితే ఈ ప్రభావం మనపై వెంటనే చూపకపోవొచ్చు. దీర్ఘాకాలంలో దీని ప్రభావం మనపై పడుతుంది. నరాల సంబంధిత వ్యాధులు, చర్మానికి సంబంధించి రోగాలకు గురికావాల్సి వస్తుంది. అలాగే మూత్రపిండాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులకు గురికవాల్సి వస్తుంది.

5. నైట్రోసమైన్లు వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది

5. నైట్రోసమైన్లు వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది

నైట్రేట్లు సాధారణంగా నేల, గాలి, నీటిలో ఎక్కువగా ఉంటాయి. నీటిని బాగా వేడి చేయడం లేదా మళ్లీ మళ్లీ మరిగించడం చేస్ ఈ హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రత అనేది నైట్రేట్లను నైట్రోసామైన్స్ గా మారుస్తుంది. ఈ నైట్రోసమైన్లు వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నైట్రేట్ల వల్ల చాలా వ్యాధుల బారిన పడుతారు.

నాన్ - హొడెన్కిన్ లింఫోమా, లుకేమియా, పెద్దపేగు, మూత్రాశయం, అండాశయ, ఉదర, ప్యాంక్రియాస్, ఎసోఫాగస్ వంటి క్యాన్సర్ల బారినపడాల్సి వస్తుంది.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

6. ఫ్లోరైడ్ నరాల వ్యవస్థను ఇది దెబ్బతీస్తుంది

6. ఫ్లోరైడ్ నరాల వ్యవస్థను ఇది దెబ్బతీస్తుంది

నీటిలో ఉండే ఈ రసాయనం చాలా ప్రమాదకరం. పిల్లలపై ఈ రసాయనం ఎక్కువ ప్రభావం చూపుతుంది. నరాల వ్యవస్థను ఇది దెబ్బతీస్తుంది. అలాగే అనేక దుష్ప్రభావాలకు గురికావాల్సి వస్తుంది. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటిని తాగే పిల్లల్లో ఐక్యూ చాలా తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

మనుషులే కాదరు ఫ్లోరైడ్ వల్ల జంతువులు కూడా జంతువులు వంధ్యత్వానికి గురవుతున్నాయంట. అయితే కేవలం మగ జంతువులపైనే ఈ ప్రభావం ఉంటుందిన తాజాగా ఒక పరిశోధనలో వెల్లడైంది.

7. గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నీరు తాగకపోవడం మంచిది

7. గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నీరు తాగకపోవడం మంచిది

నీటిని మళ్లీ మళ్లీ ఉడికించడం అనేది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపకపోవొచ్చు. కానీ పరోక్షంగా ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సమస్య నుంచి బయపడొచ్చు. మళ్లీ మళ్లీ మరిగించిన నీటి వల్ల గర్భిణీలు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నీరు తాగకపోవడం మంచిది. ఇక మీరు తాగే నీరు స్వచ్ఛమైనది కాదని, దాన్ని ఒక్కసారి వేడి చేయడం వల్ల ఫలితం లేదని మీరనుకుంటే.. ఆర్వో యూవీ సిస్టం ద్వారా నీటిని శుద్ధి చేయటానికి ప్రయత్నించండి. ఇది మంచి పద్ధతి. అలా శుద్ధి చేసిన నీటిని తాగితే ఎలాంటి దుష్ప్రభావాలుండవు.

English summary

The Dangers Of Re-Boiling Water- You Will Be Shocked!

Here are a few health problems that one can develop due to consumption of re-boiled water. Take a look.
Story first published: Friday, November 3, 2017, 18:30 [IST]