For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనె + పసుపు కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

సహజంగా మన వంటింట్లో మనకు తెలియకుండానే కొన్ని ఔషధాలు ఉంటాయి. అలాంటి వాటిలో పసుపు , తేనె ఒకటి.

|

సహజంగా మన వంటింట్లో మనకు తెలియకుండానే కొన్ని ఔషధాలు ఉంటాయి. అలాంటి వాటిలో పసుపు , తేనె ఒకటి. ఇవి వంటలకు రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఈ రెండింటి మిశ్రమం కొన్ని రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అనేక వ్యాధులతో పోరాడటానికి శరీరానికి కావాల్సిన వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

పసుపు+తేనె కాంబినేషన్ లో వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెరుగుతాయి.

ఈ మిశ్రమం గౌట్ బ్యాక్టీరియాను నివారించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ రెంటింటి కాంబినేషన్ ఔషధంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు కాబట్టి, వీటిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ , ఒక టీస్పూన్ తురిమిన నిమ్మ తొక్క, 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 100గ్రాముల తేనె .

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో బ్లాక్ పెప్పర్, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేయాలి. తర్వాత తేనె, నిమ్మతొక్క తురుము కూడా మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నింటి బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. దీన్ని ఒక గ్లాస్ జార్ లో నిల్వ చేసుకోవాలి. ఈ జార్ ను ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. ఈ వంటింటి ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం..

#1

#1

ప్రతి రోజూ ఉదయం ఈ మిశ్రమ ఔషధాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది, కొన్ని రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది.

#2

#2

జలుబుతో బాధపడుతున్నట్లైతే ఒక గంటకు ఒకసారి (ఒక టేబుల్ స్పూన్ ) రెండు రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూడవ రోజును రోజంతటికీ కలిపి మూడు సార్లు తీసుకుంటే చాలు.

#3

#3

ఎలా తీసుకోవాలి? ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకోగానే మింగ కుండా కొద్ది సేపు అలాగే ఉంచుకుంటే, నోట్లో కరిగిన తర్వాత మింగాలి. మింగిన 5 నిముషాల వరకూ ఎలాంటి ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ తీసుకోకూడదు.

#4.

#4.

ఈ మిశ్రమాన్ని నేరుగా తినలేకపోతే ఈ మిశ్రమాన్ని టీ లేదా బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ తో చేర్చి తీసుకోవచ్చు. లేదా బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసి తీసుకోవచ్చు.

సూచనలు :

సూచనలు :

గర్భిణీలు లేదా ఏదైనా ఇతర అలర్జీలున్న వారు ఈ మిశ్రమాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ రెమెడిని తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.

English summary

Why Turmeric-Honey Mixture Is Healthy

Why Turmeric-Honey Mixture Is Healthy,This mixture prevents and cures some viral and bacterial infections. It strengthens your immune system and keeps you healthy.
Desktop Bottom Promotion