నిద్రకు ముందు మీ లోదుస్తులను ఎందుకు తీసివేయాలి?

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మంచం ఎక్కే ముందు మీ లోదుస్తులను తీసివేయండి. ఏంటీ...ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా నిద్ర పోవడం మంచిదేనా? అసలు ఈ ఆలోచన ఏంటని నొసలు చిట్లించుకుంటున్నారా? మరీ అంత కోప్పడకండి. నగ్నంగా నిద్రించడం వల్ల చాలానే ప్రయోజనాలున్నాయట. గాఢంగా నిద్రిస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత అర డిగ్రీ మేర తగ్గుతుంది. దుస్తులు వేసుకోవడం వల్ల శరీరం త్వరగా వేడిని కోల్పోదు. అదే ఒంటి మీద నూలుపోగు లేకుండా నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బిగుతైన లోదుస్తులు వేసుకోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్‌లో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి రాత్రి పూట మీ శరీరానికి గాలి తగిలే అవకాశం ఇవ్వండి. ఇలా ఉండటం మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ, మీ భాగస్వామికి మాత్రం కాదు.

లోపలి దుస్తుల శుభ్రత ఎలా?

అవును, అలా నిద్రించడం మంచిదేనట. విదేశీయులు ఇలా ఎక్కువగా నిద్రిస్తారట. ఈ క్రమంలో అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మీ యోనికి గాలి అవసరం :

1. మీ యోనికి గాలి అవసరం :

మీ పని వేళల్లో (లేదా) ఇంటి పనుల సమయంలో మీరు ధరించే డ్రాయరు దారుణమైన చమటతో మరియు బ్యాక్టీరియాతో అసౌకర్యానికి, అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి రాత్రుల్లో అండర్ వేరు వేసుకోకపోవడమే మంచిది. డ్రాయర్ ధరించే ప్రాంతంలో తరచూ గాలి ప్రసరణ చేయబడాలి. కాబట్టి నిద్రించే సమయం కంటే మెరుగైన సమయం ఇంక వేరే ఏమీ ఉంది ?

2. ఫాబ్రిక్ మేటర్స్ :

2. ఫాబ్రిక్ మేటర్స్ :

లగ్జరీ లోదుస్తుల బ్రాండ్లలో మరియు షాపులలో లాసీ మరియు రేసీ డిజైన్లను కలిగి ఉంటాయి, కానీ అవి సరైన ఫాబ్రిక్ను కలిగి ఉండవు. మీ లోదుస్తులు సాటిన్లు, పట్టు మరియు సింథటిక్ వస్త్రాల తయారీతో కాబడినవి అయితే, మీరు నిజంగా వాటికి రాత్రిపూట వీడ్కోలు తెలియజేయాలి. ఎందుకంటే అలాంటి బట్టలు గాలిని మరియు తేమను మీ శరీరంలో యోని ప్రాంతానికి చేరుకోవడాన్ని అనుమతించదు. అయితే, ఇది స్వచ్చమైన కాటన్తో తయారు చేసినట్లయితే మరియు శ్వాసక్రియ చర్యను కలిగి ఉంటే, మీరు దానిని అలాగే ఉంచవచ్చు.

3. మీరు ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశంను కలిగి ఉండవచ్చు :

3. మీరు ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశంను కలిగి ఉండవచ్చు :

మీరు మీ లోపల శరీరాన్ని సిల్క్ వస్త్రములతో కప్పబడి ఉంచినట్లయితే, తేమను నిర్బంధించబడిన వుండటం వల్ల ఆ భాగంలో బ్యాక్టీరియా అనేది చాలా వేగంగా నిర్మితమవుతుంది. దాని వల్ల మీరు ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు (లేదా) మూత్ర మార్గము వచ్చే అంటువ్యాధులు మరింత ఎక్కువ గురయ్యే అవకాశాలను కలుగచేస్తుంది. మీరు ప్రత్యేకంగా థాంగ్ను ఇష్టపడే వారైతే, ఈ వస్త్రము సాధారణ బికినీ (లేదా) బిగుతైన లోదుస్తుల కంటే ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉండటం వలన, మీరు మీ యోనిని బహిర్గతం చేస్తూ రాత్రిలో సమయంలో లోదుస్తులను తప్పించవలసి ఉంటుంది.

4. మీ యోని స్వీయ-శుద్ధీకరణలు, ఐనప్పటికీ కమాండో వంటి ప్రాధాన్యత అవసరం :

4. మీ యోని స్వీయ-శుద్ధీకరణలు, ఐనప్పటికీ కమాండో వంటి ప్రాధాన్యత అవసరం :

యోని అనేది స్వీయ-శుద్ధీకరణ అవయవమని చాలామంది వాదిస్తారు మరియు ముగింపులో ఎటువంటి అదనపు శ్రద్ధ అవసరం లేనదిగా చెప్తారు. ఇది నిజంగానే స్వీయ-పరిశుభ్రత, కానీ గాలిని కోల్పోకుండా ఉండటం మీకు చాలా ప్రాధమిక అవసరం. మీరు పూర్తిగా కమాండో విధానాన్ని అనుసరించినట్లయితే, దానితో అదృష్టమును కలిగి ఉండవచ్చు, లేకపోతే కనీసం మీ అంతరాలను అయిన తొలగించవచ్చు.

5. ప్యాంటీస్ను వదలలేకపోతున్నరా? మీరేమి చేయగలరో ఇక్కడ ఉంది :

5. ప్యాంటీస్ను వదలలేకపోతున్నరా? మీరేమి చేయగలరో ఇక్కడ ఉంది :

మీరు లోదుస్తుల లేకుండా నిద్రించడానికి ఇష్టం లేకపోతే, మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. ప్యాంటీస్ లేకుండా, మీ అంతరవయవాలకు గాలిని ప్రసారించడానికి అనుమతించే వదులుగా ఉన్న వస్త్రాలను ధరించాలి. మీరు 100 శాతం పత్తితో తయారు కాబడిన వదులుగా ఉండే కాటన్ దుస్తులు మీకు తాజా గాలిని, తేమను అనుమతించే డ్రాయర్ల ను ఎంపిక చేసుకోవచ్చు.

వెజైనల్ (యోని)దగ్గర చెడు వాసనలు రావడానికి గల కారణాలు

6. మగవారు కూడా రాత్రి వేళ్ళల్లో డ్రాయర్ను వదిలేయవచ్చా ?

6. మగవారు కూడా రాత్రి వేళ్ళల్లో డ్రాయర్ను వదిలేయవచ్చా ?

ఒక దృఢమైన లోదుస్తులు ఆ వ్యక్తి యొక్క సంతానోత్పత్తిని తగ్గించవచ్చని ఇంతకు మునుపే మనం తెలుసుకున్నాము, కాని ఇటీవలి పరిశోధనల్లో ఒక వ్యక్తి లోదుస్తులతో పడుకోవడం వల్ల అది ఎలాంటి ప్రతికూలతను కలిగి ఉండదని తెలిపారు. కాబట్టి, పురుషులు తాము ఇష్టపడే వాటిని ఎంచుకోవచ్చు కానీ, వారు అలా ఎన్నుకోవడాన్ని దాటవేస్తారు.

7. దంపతుల మధ్య స్పర్శ వల్ల దాంపత్యం కలకాలం నిలుస్తుందట...

7. దంపతుల మధ్య స్పర్శ వల్ల దాంపత్యం కలకాలం నిలుస్తుందట...

దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల చెమట తక్కువగా పడుతుంది, బ్యాక్టీరియా కూడా పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి క్లీన్‌గా ఉన్నామనే భావన మీకు కలుగుతుంది. దీంతో ఉదయాన్నే లేవగానే రోజువారీ పనుల్లో నిమగ్నం కావడానికి వీలవుతుంది. రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలోనూ కొన్ని కేలరీలు ఖర్చవుతాయి. అదే న్యూడ్‌గా ఉండటం వల్ల.. చల్లటి వాతావరణం ఉండటంతో ప్రశాంతంగా నిద్ర పట్టడంతోపాటు జీవక్రియ రేటు కూడా బాగుంటుంది. ఫలితంగా మరింతగా బరువు తగ్గే వీలుంటుంది.

8. ఇలా చేయడం వలన జననావయవాలకు చాలా మంచిదట...

8. ఇలా చేయడం వలన జననావయవాలకు చాలా మంచిదట...

అవి తమ విధులను సక్రమంగా నిర్వహిస్తాయట. ప్రధానంగా మహిళలకు ఈస్ట్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు రావట. పురుషుల్లో లైంగిక సామర్థ్యం, వీర్యకణాల కౌంట్ పెరుగుతుందట. అంతేకాదు వీర్యకణాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయట. దీని వల్ల సంతానం కలిగే అవకాశం మరింతగా పెరుగుతుందట.

9. అండర్‌వేర్స్ లేకుండా నిద్రించడం వల్ల శరీరం స్వేచ్ఛగా ఉండి మనసుకు కూడా మరింత ప్రశాంతత

9. అండర్‌వేర్స్ లేకుండా నిద్రించడం వల్ల శరీరం స్వేచ్ఛగా ఉండి మనసుకు కూడా మరింత ప్రశాంతత

చేకూరుతుందట. అలా నిద్రించడం వల్ల చర్మ సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయట. అండర్‌వేర్స్‌తోపాటు దుస్తులేమీ లేకుండా నగ్నంగా నిద్రిస్తే దంపతుల మధ్య చనువు ఎక్కువగా పెరిగి వారి లైంగిక జీవితం మరింత ఆనందంగా ఉంటుందట.

10. నిద్ర బాగా పడుతుంది

10. నిద్ర బాగా పడుతుంది

బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల రాత్రిళ్లు నిద్రకు భంగం వాటిల్లుతుంది. అదే కేవలం బెడ్‌షీట్, దిండు మాత్రమే ఉంటే.. మధ్యలో నిద్రలేచే అవకాశాలు కూడా తక్కువేనట. పైజామాల్లాంటి దుస్తులు వేసుకోకుండా ఉండటం వల్ల రాత్రి సమయంలో చక్కటి నిద్ర పడుతుందట. చెమట తక్కువగా రావడం వల్ల శరీర శుభ్రత మెరుగవుతుంది. దాంతోపాటు డెడ్ స్కిన్ కూడా తగ్గుతుంది. బాడీ మాయిశ్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఫలితంగా శరీరం కాంతివంతమవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why You Must Take Off Your Undergarment Before Bedtime

    Sleeping with your underwear on can create major problems for our health. Yes, you heard that right! Sleeping without an underwear is known to be a healthy habit for both men and women. In this article, we have mentioned about some of the top benefits of not wearing an underwear to bed. Continue reading to know if it is okay to remove underwear at night.
    Story first published: Thursday, October 12, 2017, 16:15 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more