For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేప ముల్లుని పొరపాటున మింగితే చనిపోతారా?

By Deepti
|

చేప ఎంతో రుచికరం మరియు ఆరోగ్యమైనది కూడా. కానీ, ఒకే ఒక సమస్య. పదునైన చేప ముల్లు. మనం సాధారణంగా ఎముకలను వదిలేసి దాని చుట్టూ ఉండే మాంసాన్నే తింటాం.

కానీ అరుదుగా చిన్న ఎముక ముక్కలు పొరపాటున మన ఆహారంలోకి వచ్చేస్తాయి. అది మీ శరీరంలోకి వెళ్తే అపాయకరమా?

కొన్నిసార్లు కావచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. మీరు నీరు తాగినప్పుడు ఆ ఎముక భాగం నీటితో పాటు లోపలికి వెళ్ళిపోయి తర్వాత విసర్జనతో బయటకి పోవచ్చు. అలా జరగకపోతే, దానికోసం కొన్ని చిట్కాలున్నాయి. అవి కూడా ఉపయోగపడకపోతే వైద్యుని సంప్రదించండి! అవేంటో ఇక చదవండి...

ఆందోళన పడకండి

ఆందోళన పడకండి

ముందు ఆందోళన పడకండి. అనుకోకుండా ప్రమాదవశాత్తూ ఎముక భాగాన్ని మింగేస్తే, మీ గొంతు దాటి కిందకు వెళ్ళిందంటే దాని అర్థం అది చాలా చిన్నదని. పెద్దదయి ఉంటే గొంతులోనే ఇరుక్కుని ఉండేదిగా.

ఇలా చేయండి...

పొట్టని వత్తడం.

పొట్టని వత్తడం.

మీతో ఉన్నవారిని ఎవరైనా మీ పొట్టపై వత్తిడి కలిగించమని చెప్పండి. అది పట్టేసిన భాగానికి ఉపశమనం ఇచ్చి ఇరుక్కున్న ఆహారాన్ని కదులుస్తుంది. ఇది ముఖ్యంగా ఆహారం గాలి మార్గాన్ని అడ్డుకున్నపుడు ఎక్కువ సాయపడుతుంది.

మరొక చిట్కా

మరొక చిట్కా

ఎముక మీ గొంతులోనే ఇరుక్కుంటే, మీ భాగస్వామిని వీపు మీద కొట్టమని అడగండి. చాలా వరకు గొంతు ఖాళీ అవుతుంది.

జీర్ణమవటం

జీర్ణమవటం

ఎముక ఇంకా లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది? చాలా కేసుల్లో జీర్ణమై, తర్వాత బయటకి వెళ్ళిపోతుంది. కొందరిలో ప్రేగుల్లోనే ఉండిపోతుంది కానీ కొన్ని రోజుల తర్వాత అదంతట అదే వెళ్ళిపోతుంది.

ప్రేగులు

ప్రేగులు

కొన్ని సందర్భాలలో, ఎముకలు జీర్ణం కానప్పుడు, ఎముక బయటకి వచ్చే సమయానికి మలవిసర్జన చాలా నొప్పిగా ఉండవచ్చు. ఎముక ప్రేగులు లేదా కడుపులోనే ఇరుక్కుని ఉంటే వైద్యుడిని సంప్రదించటం అవసరం.

సౌంత్ ఇండియన్ స్టైల్ ఫిష్ ఫ్రై రిసిపి సౌంత్ ఇండియన్ స్టైల్ ఫిష్ ఫ్రై రిసిపి

నీరు

నీరు

సాధారణంగా, ఎముక ఇరుక్కుపోతే ఏదీ తినడం ఆపేయండి. నీరు తాగండి కానీ వైద్యుడు వచ్చే వరకు ఏవీ తినవద్దు. అది చికిత్సలో అవరోధం కావచ్చు.

ఇంటి చిట్కా #1

ఇంటి చిట్కా #1

వండిన అన్నాన్ని అరకప్పు నమలకుండా తినేయండి. నీరు త్రాగండి.

ఇంటిచిట్కా #2

ఇంటిచిట్కా #2

గొంతులో ఇరుక్కున ఎముకకి అరటిపండు తినటం శ్రేయస్కరం. తినండి కానీ నమలద్దు. రెండు నిమిషాల తర్వాత నేరుగా మింగేయండి. నీరు తాగండి. ఇది గొంతులో ఎముకను తొలగించవచ్చు.

ఇంటి చిట్కా #3

ఇంటి చిట్కా #3

రెండు చెంచాల వేరుశెనగపప్పు తీసుకుని ఒక నిమిషం నమిలి మింగండి. ఇది కూడా ఎముకను గొంతులో నుండి తీసేయచ్చు.

ఇంటిచిట్కా #4

ఇంటిచిట్కా #4

బ్రౌన్ బ్రెడ్ ఒక ముక్కను తీసుకుని పీ నట్ బటర్ ను దానిపై రాయండి. దాన్ని తిని రెండు నిమిషాలు నోట్లో ఉంచుకోండి. నమలకుండా మింగేసి నీరు త్రాగండి. ఇది కూడా ఎముకను గొంతులోనుంచి పోగొట్టచ్చు.

చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు

ఇవేవీ పనిచేయకపోతే?

ఇవేవీ పనిచేయకపోతే?

ఈ చిట్కాలేవీ పనిచేయకపోతే, ఎముక ఇంకా గొంతులోనే ఉండిపోతే, వైద్యున్ని వెంటనే సంప్రదించండి. దాన్ని అలానే వదిలేస్తే ఇన్ఫెక్షన్ గా మారవచ్చు. అప్పుడు ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు.

English summary

Will You Die If You Swallow A Fish Bone?

But in rare cases, small sharp pieces of the bone may accidentally come into your mouth while eating the fleshy part. Is it dangerous if it goes inside your body?
Desktop Bottom Promotion