సెక్స్ తర్వాత ప్రతి మహిళ ఖచ్చితంగా చేయవలసిన 8 విషయాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనలో చాలామంది సెక్స్ సమయంలో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి పెద్ద పట్టించుకోరు. మీ జననాంగాలను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోటం చాలా ముఖ్యం.

woman should do these things after intercourse

మీరు పాటించే అనారోగ్యకర అలవాట్ల వల్ల అక్కడ అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నది. రతి జరిపాక ఈ కింద 8విషయాలు తప్పక చేయాలి. ఇలా చేయటం వలన, మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

1.సెక్స్ జరిపిన వెంటనే టాయిలెట్ కి వెళ్లండి

1.సెక్స్ జరిపిన వెంటనే టాయిలెట్ కి వెళ్లండి

ఇది మొదటిది ; మొదటగా ఇది తప్పక చేయండి. సెక్స్ సమయంలో మీ జననాంగాల వద్ద బ్యాక్టీరియా చేరవచ్చు. అక్కడ లోపల తేమగా, వేడిగా ఉండవచ్చు, అది బ్యాక్టీరియా సంఖ్య వృద్ధిచెందుతుంది. మీకు బాధాకర మూత్రాశయ ఇన్ఫెక్షన్ కు దూరంగా ఉండాలంటే, సెక్స్ జరిపిన గంటలోపల టాయిలెట్ కి వెళ్లండి.ఇది అక్కడ ఉన్న బ్యాక్టీరియా బయటకి వెళ్ళిపోయేలా చేస్తుంది. శుభ్రంగా తుడుచుకోండి.

2.బాత్ టబ్ షవర్ కి దూరంగా ఉండండి

2.బాత్ టబ్ షవర్ కి దూరంగా ఉండండి

షవర్ చేయటం మంచిదేకానీ, వేడి బాత్ టబ్ లోకి వెంటనే వెళ్ళిపోకండి. మీ యోని ప్రాంతం ప్రేరణకి గురైనపుడు మరింత విచ్చుకుంటుంది. సెక్స్ తర్వాత, వేడి బాత్ టబ్ స్నానం వలన మరిన్ని ఇన్ఫెక్షన్లు రావచ్చు.

3.కొంచెం నీరుతో తేమ ఉండేట్లా చేసుకోండి

3.కొంచెం నీరుతో తేమ ఉండేట్లా చేసుకోండి

వ్యాయామంలాగానే, సెక్స్ జరిగాక మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవటం అవసరం. డీహైడ్రేషన్ మీ శరీరాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. అందుకని నోటికి దాహంగా అన్పిస్తే, నీటితో దాన్ని తీర్చుకున్నట్టు, మీ జననాంగాలని కూడా కొంచెం నీటితో ఎండనివ్వకుండా చేసి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తప్పించుకోండి.

4. ప్రొబయోటిక్ పదార్థాలను ఎక్కువ తినండి

4. ప్రొబయోటిక్ పదార్థాలను ఎక్కువ తినండి

సెక్స్ తర్వాత ఏం తిన్నారన్నది చాలా ముఖ్యం. డబ్బాలో చాకొలెట్ చిప్ కుకీలు నోరూరిస్తాయి కానీ మీరు ఆరోగ్యకర పదార్థాలను తినటం మంచిది. పెరుగు వంటి ఫెర్మెంట్ అయిన పదార్థాలను తినండి. కొంబుచా మరియు కిమ్చీ కూడా ఆరోగ్యకరం. సెక్స్ తర్వాత ఇలాంటివి తినటం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు రావు.

5. అక్కడ సబ్బు వాడకండి

5. అక్కడ సబ్బు వాడకండి

సెక్స్ జరిపిన వెంటనే (అప్పుడు యోని ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది) మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా ఆ ప్రాంతాన్ని సబ్బుతో కడగవద్దు. ఎందుకంటే మీ లైంగిక భాగాలు వాటంతట అవే శుభ్రపడే అవయవాలు మరియు సబ్బులు లేదా షాంపూల వంటివి వాడితే అక్కడి పిహెచ్ స్థాయిలలో తేడా వస్తుంది. సబ్బు వల్ల అక్కడ మంట, పొడితనం వంటివి కూడా వస్తాయి. నిజానికి కళ్ళు మూసుకుని పాటించగలిగే రూలు ఏంటంటే, ఏవైతే వస్తువులు మీ నోటిలో పెట్టుకోరో అవి మీ జననాంగాల వద్దకు కూడా తేకండి. సెక్స్ తర్వాత (మరియు మామూలుగా కూడా ప్రతిసారీ), గోరువెచ్చని, శుభ్రమైన నీటితోనే కడుక్కోండి.

6. అందమైన లింగరీ అప్పుడు పనికిరాదు

6. అందమైన లింగరీ అప్పుడు పనికిరాదు

లింగరీలలో చాలారకాలు నైలాన్, పాలిస్టర్ వంటి గాలితగలని గుడ్డలతో తయారవుతాయి. సెక్స్ తర్వాత అలాంటివాటిని విసిరిపారేయండి లేకపోతే సూక్ష్మజీవులు పెరగటానికి సరైన వాతావరణం కల్పిస్తున్నట్టు. గుర్తుంచుకోండి, సెక్స్ తర్వాత మీ యోని ప్రాంతం (వి- ప్రాంతం) తడిగా, వెచ్చగా ఉంటుంది, అప్పుడే బ్యాక్టీరియా అక్కడ బ్రతకగలవు. పైగా మీరు గాలితగలని బట్టలు ధరిస్తే అవి మరింత పెరుగుతాయి. నగ్నంగా లేదా కాటన్ లోదుస్తులు ధరించి అక్కడ గాలితగిలేట్లా చూసుకోండి.

7. తడి వైప్స్ కి దూరంగా ఉండండి

7. తడి వైప్స్ కి దూరంగా ఉండండి

తడి వైప్స్ తో మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోవాలనుకోవటం సరైనదిగానే అన్పించినా, వాటిల్లోని రసాయనాలు, సుగంధాలు మీ సున్నితమైన జననాంగాల ప్రాంతాన్ని మంటపుట్టేలా చేస్తాయి. అదికూడా సెక్స్ చేసిన వెంటనే అస్సలు వద్దు. నీరు కాకుండా మరేదన్నా వాడాలని భావిస్తే గోరువెచ్చని నీరుకు కొంచెం వెనిగర్ కలిపి వాడండి. వెనిగర్ శుభ్రపరిచే పదార్థమే కాబట్టి మీ శరీర పిహెచ్ ను పాడుచేయదు. తర్వాత మెల్లగా తుడవండి.

8. బ్లోడ్రై చేసి ఆ ప్రాంతంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్లను అరికట్టండి

8. బ్లోడ్రై చేసి ఆ ప్రాంతంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్లను అరికట్టండి

మీరు ఆశ్చర్యపోతారేమో కానీ, చాలా మంది స్త్రీలు సెక్స్ తర్వాత తమ జననాంగాలను బ్లో డ్రై చేస్తారు. వైద్యుల ప్రకారం కూడా ఇది సరైనదే కానీ జాగ్రత్తగా చేయండి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు (యుటిఐ) మరియు మైకోసిస్ వంటి వాటి బారినపడే స్త్రీలకు ఈ పద్ధతి చాలా మంచిది.

డ్రైయర్ తో బ్లో డ్రైకి ముందు, మీ యోని ప్రాంతాన్ని నీటితో కడగండి. సెట్టింగ్ లో చల్లగాలిని ఎంచుకుని అక్కడ ప్రాంతాన్ని డ్రై చేయండి. అతిగా చేయకుండా, యోనిని తేమగా ఉండేట్లు కూడా చూసుకోండి. చివరన మెత్తని చేతి టవల్ ను ఉపయోగించండి.

English summary

woman should do these things after intercourse

woman should do these things after intercourse, Read to know more about