మానేయండి ఈ 10 అల‌వాట్లు.. అన‌ర్థానికి దారితీయ‌గ‌ల‌వు!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

కొన్ని ర‌కాల అల‌వాట్లు స‌మాజంలో వేళ్లూనుకుపోయాయి. అవి ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసేలా ఉంటున్నాయి. మ‌న స్నేహితులు, కుటుంబ‌స‌భ్యులు ఈ చెడు అల‌వాట్ల‌ను నేర్పించ‌కపోయినా ఇవి అంత‌గా మంచివి కావు. అనర్థాల‌ను దారితీసి మ‌ర‌ణానికి ద‌గ్గర చేయ‌గ‌ల‌వు ఇవి.

1. బ్లాక్ హెడ్స్‌ను గిల్ల‌డం

1. బ్లాక్ హెడ్స్‌ను గిల్ల‌డం

బ్లాక్ హెడ్స్‌ను గిల్ల‌డం లాంటివి మీ త‌ల్లినో, గ‌ర్ల్ ఫ్రెండో చేసి ఉండొచ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖానికి హాని క‌లుగుతుంది. బ్లాక్ హెడ్స్‌కు సంబంధించి మూలాలు చ‌ర్మం లోప‌ల పాతుకొని ఉంటాయి. వాటిని గిల్లిన‌ప్పుడు పై భాగం గాలికి ఎక్స్‌పోజ్ అయి క్రిములు దాడిచేసే ప్ర‌మాదం ఉంటుంది. దీని ఫ‌లితంగా ఆ ప్రాంతంలో ఇన్ఫెక్ష‌న్లు, వాపు లాంటి రావొచ్చు. మొహాన్ని ఎంతో ఆరాధ‌న‌గా చూసే మ‌న‌కు ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డితే త‌ట్టుకోలేం.

2. మొటిమ‌లు గిల్లుకోవ‌డం

2. మొటిమ‌లు గిల్లుకోవ‌డం

ముక్కు పై భాగం నుంచి పై పెద‌వి వ‌ర‌కు ఉన్న త్రిభుజాకార ప్రాంతం మొహంలో అత్యంత కీల‌క‌మైన‌ది. ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. ఎందుకంటే ఇక్క‌డ ఉండే న‌రాలు నేరుగా మెద‌డుతో అనుసంధాన‌మై ఉంటాయి. ర‌క్త ప్ర‌సర‌ణ ఈ ప్రాంతంలో బాగా ఉంటుంది. ఇక్క‌డ ఏర్ప‌డే మొటిమ‌ల‌ను గిల్ల‌డం వ‌ల్ల కావాల్సికొని మెనింజైటిస్ లాంటి మెద‌డు ఇన్ఫెక్ష‌న్ల‌కు గురిచేయిస్తాం. మొటిమ‌లో పేరుకున్న క్రిములు సులువుగా శ‌రీరంలోకి వెళ్లేలా చేసిపెడ‌తాం. అందుకే మొటిమ‌ల‌ను గిల్లుకోవ‌ద్దు అంటారు స్కిన్ స్పెష‌లిస్టులు.

ఈ అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..లేదంటే?!

 3. చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్‌

3. చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్‌

చెవి సున్నిత‌మైన భాగం. చెవిలో ఏర్ప‌డే వ్యాక్స్ మంచిదే. సున్నిత‌మైన చెవి లోప‌లి భాగాన్ని దుమ్ము, ధూళి, క్రిముల నుంచి ఇది కాపాడుతుంది. త‌గిన మోతాదులో ఉండ‌డం మంచిదే. అయితే చెవిని శుభ్ర‌వ‌ప‌రిచేందుకు ఇయ‌ర్ బ‌డ్స్ అస్స‌లు వాడ‌కూడ‌దు. ఇవి వాక్స్‌ను లోప‌లికి తోస్తుంది. త‌ద్వారా వినిపించే శ‌క్తిని కోల్పోతాం. చెవులు బాగా మూసుకుపోతే సొంత వైద్యం మాని మంచి ఈఎన్‌టీ డాక్ట‌ర్ను క‌లిసి త‌గిన చికిత్స తీసుకోవాలి.

4. పొగ తాగ‌డం

4. పొగ తాగ‌డం

పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం. ప్ర‌తి సినిమా వేసే ముందు ఈ యాడ్ త‌ప్ప‌కుండా వ‌స్తుంది. సిగరెట్ల‌లో హానికార‌క కార్సినోజ‌న్లు ఉంటాయి. పొగ‌తాగిన‌ప్పుడు ఇవి సులువుగా వూపిరితిత్తుల్లోకి చొర‌బ‌డ‌గ‌ల‌వు. ఆ త‌ర్వాత త‌ర‌వాత వూపిరి సామ‌ర్థ్యాన్ని తగ్గించి క్యాన్స‌ర్ కార‌కాల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌వు. కాబ‌ట్టి ఎవ‌రైనా పొగ‌తాగ‌మ‌ని ఆఫ‌ర్ చేస్తే అస్స‌లు ఒప్పుకోవ‌ద్దు.

5. ఆక‌లి లేక‌పోయినా...

5. ఆక‌లి లేక‌పోయినా...

ఆక‌లి వేసిన‌ప్పుడు స‌హ‌జ సిద్ధంగా శ‌రీరానికి తెలిసిపోయి మెద‌డుకు సంకేతాల‌నిస్తుంది. ఆక‌లి లేక‌పోయినా ఏదో ఒక‌టి అని నోట్లో వేసుకుంటే అధికంగా తిన‌డం అల‌వాటుగా మారిపోతుంది. ఇది అధిక బ‌రువుకు, ఒబేసిటికి దారితీయ‌గ‌ల‌దు. అందుకే నోటిని అదుపులో పెట్టుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది.

6. న‌డుస్తూ చాటింగా...

6. న‌డుస్తూ చాటింగా...

ఈ స‌న్నివేశాన్ని ఒక సారి వూహించుకోండి. మీరు ఫుట్‌పాత్ పైన న‌డుస్తున్న‌ప్పుడు మీ ఫోన్ బీప్ శ‌బ్దం వ‌చ్చింది. తీసి చూస్తే మీ ప్రియ‌మైన‌వారి నుంచి చిలిపి మెసేజీ. అది చూసి మీరు ఉద్వేగానికి లోనై ఆలోచ‌న‌లు సుడులు తిరిగాయి. వెంట‌నే రిప్లై ఇవ్వాల‌నే నెపంతో ఏదో ఆలోచిస్తూ టైప్ చేసేస్తున్నారు. ఇంతలో ముందు మ్యాన్‌హోల్ మూత తెరిచేసి ఉంది. దాంట్లో ప‌డిపోయారు. నోటి నిండా కంపు, బ‌య‌ట‌కు తీసేవారు లేరు. ఇలాంటి స‌న్నివేశ‌మే ఏ ప‌రిస్థితిలోనైనా జ‌ర‌గొచ్చు. ట్రాఫిక్‌లో న‌డుస్తూ చాటింగ్ చేయ‌డం వ‌ల్ల ఏ కారో, లారీనో వ‌చ్చి గుద్దేయ‌గ‌ల‌దు. అందుకే ఇక నుంచి మెసేజీ వ‌చ్చిన‌ప్పుడు ఒక ప‌క్క ఆగి రిప్లై ఇచ్చాకే న‌డ‌వ‌డం మొద‌లుపెట్టండి.

7. మెడ వంచుతున్నారా...

7. మెడ వంచుతున్నారా...

మెడ వంచ‌డం చాలా మ్యాన్లీగా అనిపించొచ్చు గాక‌... ప‌ట్టుమ‌ని కండ‌రాలు తెగితే చావు త‌ప్ప‌దు!

ఈ చెడు అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..!?

8. దుర్ల‌భ‌మైన వైవాహిక జీవితం

8. దుర్ల‌భ‌మైన వైవాహిక జీవితం

జీవిత భాగ‌స్వాములిద్ద‌రూ త‌రచూ పోట్లాడుతుంటే తొంద‌ర‌గా గుండెకు సంబంధించిన రుగ్మ‌త‌లు ద‌రిచేరుతాయ‌ని ప‌రిశోన‌ల్లో వెల్ల‌డైంది. కాబ‌ట్టి మీ వైవాహిక జీవితం సంతృప్తిగా లేద‌ని భావిస్తే పెద్ద‌వాళ్ల స‌ల‌హా తీసుకొని ఏదో ఒక‌టి చేసేయాలి. పిల్ల‌ల‌నూ వీటికి దూరంగా ఉంచ‌డం మంచిది. అది మీ మాన‌సిక ఆరోగ్యానికి మంచిది.

9. బ్రేక్ ఫాస్ట్ మానేయొద్దు

9. బ్రేక్ ఫాస్ట్ మానేయొద్దు

బ్రేక్ ఫాస్ట్‌ను మానేసింత అవివేక‌వంత‌మైన ప‌ని మ‌రొక‌టి లేదు. రాత్రంతా క‌డుపులో పేరుకున్న ఆమ్లాల‌ను బ్రేక్‌ఫాస్ట్ త‌గ్గించేయ‌గ‌ల‌దు. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్ను కూడా కంట్రోల్లో పెట్ట‌గ‌లుగుతుంది. ఎల్ల‌ప్పూడు మీతో ఒక యాపిల్ లేదా బిస్క‌ట్ల‌ను ఉంచుకోండి. ఉద‌యం అల్పాహారం చేయ‌లేక‌పోతే వీటిని తిని క‌డుపునింపుకోవ‌చ్చు. శ‌రీరాన్ని క‌ష్ట‌పెట్ట‌కుండా సుల‌భంగా ఉంచుకోవ‌చ్చు.

10. గోళ్లు కొరుకుతున్నారా...

10. గోళ్లు కొరుకుతున్నారా...

గోళ్ల‌లో ర‌క‌ర‌కాల చెత్త‌, క్రిములు పోగై ఉంటాయి. వాటిని కొర‌క‌డం అంటే నోట్లోకి తీసుకోవ‌డ‌మే. గోళ్ల‌లో సాల్మొనెల్లా, ఇ-కోలి లాంటి హానికార‌క బ్యాక్టీరియా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలిన అంశం. ఇది ఫుడ్ పాయిజ‌నింగ్‌కు, డ‌యేరియాకు దారితీయ‌గ‌ల‌దు.

English summary

Read This! 10 Bad Habits That Can Kill You

You may think these habits are healthy, in fact your friends and family might have taught you these, but these 10 bad habits can actually kill you! For example, you pop your blackheads, eat when you are not hungry, and are stuck in an unhappy marriage.