For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పది అలవాట్లు మీ మూత్రపిండాల నాశనానికి ప్రధాన కారకాలు

|

మార్చి 8న ప్రపంచ కిడ్నీడే గా జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, మూత్రపిండాల వలన కలిగే ప్రయోజనాలను, మరియు వాటిని కాపాడు సురక్షిత పద్దతుల గురించిన అవగాహనని ప్రజల్లో తీసుకుని రావడం ద్వారా మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడం.

కిడ్నీలు మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో అదనపు నీటిని తొలగించడం మరియు శరీరానికి అవసరమైన శాతం నీటిని నిల్వచేయడం దీని ప్రధాన చర్య. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ది చేస్తూ, వ్యర్ధాలను వడకట్టి మూత్రనాళం ద్వారా బయటకి పంపివేయుటలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.


మూత్రపిండాలు వ్యర్ధాలను బయటకు పంపుటయే కాకుండా కాల్షియం మరియు పాస్ఫేట్ వంటి ఖనిజాల నియంత్రణలో కూడా సహాయం చేస్తుంది. రక్తపోటు మరియ ఎర్ర రక్తకణాల ఉత్పత్తి వంటి ముఖ్యమైన శరీర విధులను నిర్వహించుటలో అవసరమైన హార్మోన్లను కూడా ఈ కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి.

కావున మానవ శరీరం, లక్షణంగా ఏ సమస్యా లేకుండా పనిచెయ్యాలి అంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం అత్యవసరం. మీ మూత్రపిండాలను పాడుచేసే ఈ పది చెడు అలవాట్ల గురించి తెలుసుకుని జాగ్రత్త పడవలసినదిగా సూచించడమైనది.

1. అధికంగా నొప్పి నివారణా మందులు తీసుకోవడం

1. అధికంగా నొప్పి నివారణా మందులు తీసుకోవడం

ఎక్కువశాతం ప్రజలు తరచూ వచ్చే చిన్ని చిన్ని సమస్యలకు డాక్టరుని సంప్రదించకుండానే తమకు తెలిసిన లేదా మెడికల్ షాపుల వారు సూచించిన నొప్పి నివారణా మందులను తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, రాను రాను మీ కిడ్నీ పనితీరుని తగ్గిస్తూ వాటి నాశనానికి కారకాలుగా మారగలవు. ఒకవేళ ఇప్పటికే మీరు మూత్రపిండాల సమస్యతో భాధపడుతున్నట్లయితే, మీ సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం లేకపోలేదు. కావున అనవసరముగా, డాక్టరు సలహా లేకుండా నొప్పి నివారణా మందులు వాడకపోవడమే మంచిది.

2. పాక్ చేసి, నిలవచేసిన ఆహారం తినడం

2. పాక్ చేసి, నిలవచేసిన ఆహారం తినడం

పాక్ చేసి, నిలువ ఉంచిన ఆహారపదార్ధాలలో ఎక్కువ మోతాదులో పాస్ఫరస్, సోడియంలతో నిండి ఉంటాయి. మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారు ఫాస్ఫరస్ ను తగ్గించాలి. లేనిచో తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని అనేక నివేదికలు తేల్చాయి. కావున వీటికి దూరంగా ఉండడమే మంచిది.

3. ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం

3. ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం

ఉప్పులో అధికమోతాదులో సోడియం ఉంటుంది, ఎక్కువగా ఉప్పుని తీసుకోవడం వలన అధిక రక్తపోటుకి కారణం అవుతుంది. మూత్రపిండాలు అధిక ఉప్పును మూత్రం నుండి విసర్జింప చెయ్యడానికి చాల శ్రమించవలసి ఉంటుంది. దీని కారణాన శరీరం లో నీటి నిల్వలు అసాధారణ స్థాయికి చేరుకోవడం మూలాన, మూత్రపిండాల వ్యాధి తీవ్రతను పెంచుతుంది. కావున ఉప్పు అనేది మితంగానే తీసుకోవాలి, లేనిచో ప్రాణాంతకంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.

4.నీటిని తక్కువ తాగడం

4.నీటిని తక్కువ తాగడం

శరీరంలోని నీటి నిల్వల పెరుగుదల మీద, మూత్రపిండాలు శరీరంలోని విష పదార్ధాలను ఎంత ఎక్కువ మోతాదులో బయటకి విసర్జింపగలదు అనేది ఆధారపడి ఉంటుంది. పైగా ఎక్కువ నీటిని తీసుకోవడం మూలంగా కిడ్నీలో ఉండే రాళ్ళను కూడా నివారించవచ్చు. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులతో భాధపడేవారు, నీటిని ఎక్కువ తీసుకోవడానికి మొగ్గుచూపాలి. నీరు అధికంగా తీసుకోవడం వలన మూత్రపిండాలు ఆరోగ్యంగా మరియు చక్కగా పనిచేస్తాయి.

5. మాంసాహారం ఎక్కువ తీసుకోవడం

5. మాంసాహారం ఎక్కువ తీసుకోవడం

మాంసం ఎక్కువగా తీసుకోవడం వలన, రక్తంలో ప్రోటీన్ నిల్వలు పెరుగుతాయి. దీనికారణంగా రక్తంలో ఆమ్లాల మోతాదు పెరుగుతాయి. ఈ ఆమ్లాలు వ్యర్ధాలను తొలగించుటలో అడ్డుతగలడం మూలంగా, కిడ్నీలు అధిక శ్రమ చెయ్యవలసి ఉంటుంది. తద్వారా పనితీరు మందగించి వ్యాధులకు కారణంగా మారుతుంది. కొందరు ప్రతిరోజూ మాంసాహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి కిడ్నీల పనితీరు దెబ్బతినడంతో పాటు, రక్తపోటు వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కావున మాంసాహారం పరిమితం కావాలి.

6. నిద్ర లేమి

6. నిద్ర లేమి

మీ మెదడు కండరాలు మరియు శరీరాన్ని సడలించడంతో, నిద్ర అనేది శరీరానికి అవసరం. ఒక మంచి నిద్ర వలన శరీరం ఉత్తేజితమవడం మాత్రమే కాకుండా మూత్రపిండాల పనితీరు పెరగడంలో సహాయం చేస్తుంది. మూత్రపిండాల పనిని ఒకనిద్ర చక్రం నియంత్రిస్తుంది , తద్వారా మూత్రపిండాలు 24 గంటలు పనిచేయడానికి సహకరిస్తుంది.

7. ఎక్కువ చక్కర నిల్వలు ఉన్న ఆహారాన్ని తీసుకొనుట

7. ఎక్కువ చక్కర నిల్వలు ఉన్న ఆహారాన్ని తీసుకొనుట

షుగర్ ఊబకాయానికి దోహదం చేసే ఒక ఆహారం, ఇది మధుమేహం మరియు అధిక రక్తపోటుకి ప్రధాన కారణంగా మారి ప్రాణాంతకం కావొచ్చు. ఆహారంలో చక్కర నిల్వలు ఎక్కువ ఉండేలా తీసుకోవడం వలన మూత్రపిండాల వ్యాదులకి కారణం అవుతుంది. కావున ఆహారలలోను, పానీయాలలోనూ చక్కర నిల్వలు తగ్గునట్లు చూసుకోవడం కనీస భాద్యత.

8. మద్యపానం

8. మద్యపానం

క్రమం తప్పకుండా ఎక్కువ మోతాదులో మద్యపానం చేయడం వలన మూత్రపిండాల పనితీరుపై ప్రభావాన్ని చూపి, దీర్ఘకాలిక మూత్రపిండవ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కావున మూత్రపిండాల పనితీరు మెరుగవ్వాలి అంటే మద్యపానాన్ని దూరంగా ఉంచడమే మేలు.

9. ధూమపానం

9. ధూమపానం

వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాల నివేదికల ప్రకారం, మూత్రపిండాలతో సహా శరీరంలోని ప్రతి అవయవానికి ధూమపానం అనేది హానికరం. ధూమపానం రక్తపోటు, హృదయ స్పందనలను పెంచుతుంది మరియు మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. కావున ధూమపానం శ్రేయస్కరం కాదు ఎన్నటికీ.

10. మూత్ర విసర్జన చెయ్యకపోవడం

10. మూత్ర విసర్జన చెయ్యకపోవడం

శరీరంలోని వ్యర్ధపదార్ధాలు బయటకి వెళ్ళడానికి మూత్రాశయమే ప్రధాన మార్గం. మీరు తరచూ మూత్ర విసర్జన చెయ్యకపోతే, అది మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాలక్రమేణా, ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి దారి తీయవచ్చు తద్వారా మూత్రపిండాల వ్యాదులకి కారణమవుతుంది.

11. శరీరం లోని ఇన్ఫెక్షన్ల విషయంలో ఏమరపాటు సరికాదు

11. శరీరం లోని ఇన్ఫెక్షన్ల విషయంలో ఏమరపాటు సరికాదు

మీరు సాధారణ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే, డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ తీసుకోవడం మొదలుపెట్టండి. సరైన సమయంలో చికిత్స తీసుకోని యడల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశo కూడా ఉంది.

చివరగా

ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉంటూ, ఆహారపు అలవాట్లని ఆరోగ్యకరమైన రీతిలో మార్చుకుని , నీటిని ఎక్కువ తీసుకుంటూ, క్రమం తప్పని వ్యాయామంతో మూత్రపిండాలను కాపాడుకోవచ్చు.

English summary

10 Bad Habits That Damage Your Kidneys

The primary function of the kidney is to remove excess water from the body and also help to retain water when the body needs more of it. To prevent your kidneys from damage, stop taking painkillers, reduce sugary and salty foods, drink plenty of water, sleep on time, stop eating processed foods, etc.