కీళ్ళవాతం (గౌట్) నుంచి ఉపశమనాన్ని అందించే 10 ఎసెన్షియల్ ఆయిల్స్

Subscribe to Boldsky

కీళ్ళవాతం (గౌట్) వలన ఎదురయ్యే అసౌకర్యాలు అన్నీ ఇన్నీ కావు. సడెన్ గా కీళ్ల వాపు అలాగే నొప్పి తలెత్తుతుంది. కాలి బొటన వేలి జాయింట్ వద్ద ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ ఆర్టికల్ లో గౌట్ పెయిన్ నుంచి ఉపశమనమందించే కొన్ని అద్భుతమైన ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి తెలుసుకుందాం.

సాధారణంగా, కీళ్ళవాతపు లక్షణాలు కాలివేలి దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఈ లక్షణాలు శరీరంలో ఇతర భాగాల వద్ద అంటే మోచేతివద్ద, మణికట్టు వద్ద, బొటనవేలి వద్ద, చీలమండ మరియు చెవి తమ్మి వద్ద కూడా కనిపించే ఆస్కారం ఉంది. యురేట్ క్రిస్టల్స్ కీళ్ల వద్ద పేరుకున్నప్పుడు కీళ్ళవాతపు లక్షణాలు కనిపించే ప్రమాదం ఉంది. నొప్పి వాపుతో అసౌకర్యం తలెత్తుతుంది. శరీరంలో యూరిక్ ఏసిడ్ అధికమొత్తంలో ఉన్నప్పుడు యురేట్ క్రిస్టల్స్ ఫార్మ్ అవుతాయి.

10 Essential Oils For Gout Pain

అయితే, ఆర్తరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, కీళ్ళవాతానికి గురికావడానికి వయసు, జెండర్, జీన్స్, ఆరోగ్యస్థితి, ఆహారపుటలవాట్లు, మెడికేషన్స్, ఒబెసిటీ, ఆల్కహాల్, సోడా మరియు బైపాస్ సర్జరీ వంటి ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయి.

గౌట్ అటాక్ అనేది చాలా బాధాకరమైనది. వాపు కూడా తోడవడంతో ఇబ్బంది అధికమవుతుంది. గౌట్ పెయిన్ నుంచి తక్షణ ఉపశమనం కోసం ఎసెన్షియల్ ఆయిల్స్ ని ఉపయోగించండి.

గౌట్ పెయిన్ నుంచి రిలీఫ్ ని అందించే ఎసెన్షియల్ ఆయిల్స్ జాబితాను ఇక్కడ పొందుబరిచాము.

1. రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ :

1. రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ :

రోజ్ మేరీ అనేది సాధారణ కిచెన్ హెర్బ్. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక, అస్ట్రింజెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, అనాల్జేసిక్ మరియు యాంటీ అర్థ్రిటిక్ ప్రాపర్టీస్ ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ గౌట్ పెయిన్ ను తగ్గించేందుకు అమితంగా తోడ్పడతాయి. స్కిన్ పై ఈ ఆయిల్ ను అప్లై చేసినప్పుడు ఆ ప్రదేశం ఉపశమనానికి గురవుతుంది. పెయిన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.

2. ఫ్రాంకిన్సన్స్ ఎసెన్షియల్ ఆయిల్:

2. ఫ్రాంకిన్సన్స్ ఎసెన్షియల్ ఆయిల్:

ఈ ఆయిల్ అనేది అద్భుతమైన ఆరోమా కలిగినది. అందువలన పెర్ఫ్యూమ్స్ లో దీనిని ఎక్కువగా వాడతారు. కొన్నేళ్ల బట్టి పెర్ఫ్యూమ్స్ తయారీలో ఈ ఆయిల్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తోంది. అయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ, రీజనల్ రీసెర్చ్ లేబరేటరీ టెస్టడ్ పరిశోధనల ప్రకారం ఈ ఆయిల్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయని తేలింది. ఇవి గౌట్ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయని వెల్లడైంది. బొస్వేలియా ట్రీ నుంచి లభ్యమయ్యే జిగురు ప్రదార్థం నుంచి ఫ్రాన్కిన్సన్స్ ఆయిల్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు.

3. బేసిల్ ఎసెన్షియల్ ఆయిల్:

3. బేసిల్ ఎసెన్షియల్ ఆయిల్:

బేసిల్ (తులసి)ని మెడిసినల్ హెర్బ్ గా గురించి అనేక అనారోగ్యసమస్యలకు చక్కని పరిష్కారంగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయం ప్రాచుర్యం పొందినదే. గౌట్ వలన కీళ్ల వద్ద వాపు ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన మంట కూడా ఎదురవుతుంది. బేసిల్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి వాపు మరియు మంట మరియు ఉపశమనం అందిస్తాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే కూలింగ్ ప్రాపర్టీస్ వలన ఇలా జరుగుతుంది.

Most Read:మహాభారతంలో ద్రౌపది ఎలా జన్మించింది?

4. లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్:

4. లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్:

లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది గౌట్ ను తగ్గించేందుకు అమితంగా తోడ్పడుతుంది. ఇందులో లభ్యమయ్యే యాంటీ మైక్రోబయాల్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన ఇది సాధ్యమవుతుంది. ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్ లో పబ్లిష్ అయిన బయో యాక్టివిటీ అనాలిసిస్ ఆఫ్ లెమన్ గ్రాస్ (సీంబోపొగన్ సిట్రాటస్) ప్రకారం ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయని వెల్లడైంది.

5. థైమ్ ఎసెన్షియల్ ఆయిల్:

5. థైమ్ ఎసెన్షియల్ ఆయిల్:

థైమ్ ఆయిల్ చక్కటి ఆరోమా కలిగినది. వంటకాలకు చక్కని ఫ్లేవర్ ను జోడిస్తుంది. ఈ ఆయిల్ లో యూర్సోలిక్ మరియు ఒలినోలిక్ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఇంఫ్లేమేటారీ ప్రాపర్టీస్ మరియు ఫ్లెవనాయిడ్స్ గా పనిచేస్తాయి. అందువలన, ఇంఫ్లేమేషన్ ని పెంచే నైట్రిక్ ఆక్సిడ్ ను నిరోధించడం ద్వారా ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. ఈ విషయాన్ని ఫార్మసీ మరియు ఫార్మకాలజీ అధ్యయనంలో వెల్లడైంది.

6. ఆలివ్ ఆయిల్:

6. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలవు. వీటి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మెడిటేరియన్ రీజన్ లో ఆలివ్ ఆయిల్ ను గౌట్ ను అలాగే ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్ ను తగ్గించే ఔషధంగా భావిస్తారు. ఈ ఆయిల్ లో లభ్యమయ్యే పోలీఫెనాల్స్, ఓలియాక్యాంతల్, ఓలెరోపీన్, హైడ్రోక్సీటైరోసోల్ మరియు లిగ్నాన్స్ వలన ఈ ఆయిల్ గౌట్ పెయిన్ నుంచి ఉపశమనం అందించేందుకు తోడ్పడుతుంది.

Most Read:నేను నల్ల అమ్మాయిని, సెక్స్ కు పనికిరానా? మంచి మనస్సు ఉండదా? సుఖపెట్టేందుకు ప్రయత్నిస్తా

7. చమోమైల్ ఎసెన్షియల్ ఆయిల్:

7. చమోమైల్ ఎసెన్షియల్ ఆయిల్:

చమోమైల్ ఎక్ట్రాక్ట్స్ లో క్వార్సెటైన్, ల్యూటీవోలిన్ మరియు ఏపీజీనిన్ వంటి ఫ్లెవనాయిడ్ కాంపౌండ్స్ కలవు. ఇవి గౌట్ పెయిన్ ను సమర్థవంతంగా తగ్గిస్తాయి. తద్వారా, గౌట్ నుంచి రిలీఫ్ ను అందిస్తాయి.

8. జింజర్ ఆయిల్ ఎక్ట్రాక్ట్ :

8. జింజర్ ఆయిల్ ఎక్ట్రాక్ట్ :

జింజర్ ని స్పైస్ గా అలాగే మెడిసిన్ గా వాడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లేమేటరీ మరియు యాంటీ గౌట్ ప్రాపర్టీస్ కలవు. తద్వారా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. భవిష్యత్తులో గౌట్ ఎటాక్స్ అనేవి తలెత్తే ప్రమాదం తగ్గుతుంది. ఈ విషయాన్నీ ఎత్నోఫార్మకాలజీ జర్నల్ లో పబ్లిష్ అయిన ఒక స్టడీ స్పష్టం చేస్తోంది. జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ ను క్యారియర్ ఆయిల్ లో డైల్యూట్ చేసి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది.

9. సెలెరీ సీడ్ ఆయిల్:

9. సెలెరీ సీడ్ ఆయిల్:

కాంబినేషన్ యాంటీ-ఇంఫ్లేమేటరీ థెరపీ: సినర్జీజం ఇన్ ర్యాట్స్ ఆఫ్ NSAIDs/కార్టియకోస్టెరాయిడ్స్ విత్ సమ్ హెర్బల్/అనిమల్ ప్రోడక్ట్స్' అనే అధ్యయనం ప్రకారం, ఇండియన్ సెలెరీ సీడ్ ఆయిల్ అనేది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇంఫ్లేమేటరీ డ్రగ్స్ మరియు కార్టికోస్టెరాయిడ్స్ వంటి గౌట్ మెడికేషన్స్ ప్రభావాలని పెంపొందించేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది. ఈ ఆయిల్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి వాపును తగ్గిస్తాయి.

Most Read:ఈ క్యాన్సర్ కారక వస్తువులను మీ గదిలోంచి తొలగించండి!

10. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్:

10. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్:

టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లో యాంటీ మైక్రోబయాల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి గౌట్ ను ట్రీట్ చేసేందుకు తోడ్పడతాయి. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ను క్యారియర్ ఆయిల్ తో కలిపి ప్రభావితప్రాంతంపై టాపికల్ గా అప్లై చేయాలి. దీని వలన గౌట్ పెయిన్ నుంచి ఉపశమనం అందుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Essential Oils For Gout Pain

    Gout is a kind of arthritis that is characterized by sudden, severe attacks of pain and swelling, redness and tenderness in the joints, often in the joints of the big toe. A gout attack is very painful because it accompanies with inflammation. You can use essential oils like ginger essential oil, tea tree oil, rosemary essential oil, etc., for relief.
    Story first published: Monday, October 22, 2018, 11:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more