For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గుండెకు అనారోగ్యాన్ని కలుగజేసే ఆహార పదార్థాలు !

ఒక వ్యక్తి శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అందరికి తెలుసు. గుండె అనేది మానవ శరీరములో అతి ముఖ్యమైన అవయవము మరియు అది బాగా పనిచేయటానికి మనము ఎంతో జాగ్రత్త వహించాలి.

|

ఒక వ్యక్తి శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో అందరికి తెలుసు. గుండె అనేది మానవ శరీరములో అతి ముఖ్యమైన అవయవము మరియు అది బాగా పనిచేయటానికి మనము ఎంతో జాగ్రత్త వహించాలి. మీ హృదయాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి మీరు తీసుకునే ఆహారం మరియు వ్యాయామంపై ప్రత్యేక దృష్టిని ఉంచాలి.

గుండె వ్యాధులు (లేదా) కార్డియోవాస్క్యులర్ వ్యాధులు అనేవి, స్త్రీ పురుషులిద్దరిలోనూ సంభవిస్తుంది. పురుషులలో దీని యొక్క లక్షణాలు శ్వాస అందకపోవటం, వికారం, అలసట మరియు ఛాతీ నొప్పి లాంటి వాటిని కలిగి ఉంటాయి. ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఒక సాధారణ గుండె వ్యాధి, ఇందులో ప్లేగు దృఢంగానూ మరియు మందమైన రీతిలో ఉండి ధమనుల గోడలకు వ్యాపించడం వల్ల, అవి బాగా దెబ్బతిని గుండె వ్యాధి సంభవించడానికి కారణం అవుతుంది.

చిర కాలం పాటు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే మార్గం.. చిర కాలం పాటు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే మార్గం..

సంతృప్త కొవ్వు, సోడియం మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న కొన్ని ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బులకు మరియు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని మీకు తెలిసి (లేదా) తెలియకపోవచ్చు. ఉదాహరణకు, మనం తీసుకునే ఆహారంలో ఉప్పు అధిక మోతాదులో ఉండటంవల్ల రక్తపోటుని పెంచుతుంది. ఇది ధమనులను మరింతగా దృఢపరచి, వాటి యొక్క గోడలను మరీ ఇరుకుగా చేయడం వల్ల గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇక్కడ గుండె వ్యాధిలకి కారణమయ్యే ఆహార పదార్ధాల జాబితాను ఉంచారు. అవేమిటో మీరు కూడా చూడండి.

1. ప్యాక్ చేసిన సూప్ :

1. ప్యాక్ చేసిన సూప్ :

మీరు రెస్టారెంట్లలోనూ లేదా ఇతర చోట్ల ప్యాక్ చేయబడిన సూప్లో, MSG (మోనోసోడియం గ్లుటామాటే) అనే పదార్ధాన్ని కలిగి ఉండటంవల్ల, అది గుండెకు పూర్తిగా చెడ్డదని మీకు తెలుసా ! ఈ సూప్లలో మీ ధమనులను దెబ్బతీసే సోడియాన్ని కలిగి ఉంటాయి, తద్వారా అది గుండెపోటుకు దారితీస్తుంది. వాటికి బదులుగా, మీ ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకునే సూపు మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

2. ఫ్రైడ్ చికెన్ :

2. ఫ్రైడ్ చికెన్ :

రుచికరమైన ఫ్రైడ్ చికెన్ను దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, కానీ ఇది హానికరమైనది కూడా. ఫ్రైడ్ చికెన్లో 63 గ్రాముల కొవ్వును, 350 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ మరియు 920 కేలరీలను కలిగి ఉండటం వల్ల, మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, మీ గుండెకు ఎంతో చెడ్డదని సూచిస్తుంది,

3. సాసేజ్లు :

3. సాసేజ్లు :

ఈ చిన్న చిన్న మాంసం ముక్కలు మీ హృదయ ధమనులను నాశనం చేయగలదని ఎవరికైనా తెలుసా? ఎక్కువమంది తినే ఈ సాసేజ్లులో సంతృప్త కొవ్వు మరియు సోడియం అధిక మొత్తంలో ఉంటాయి. 100 గ్రాముల సాసేజ్లో 301 కేలరీలను కలిగి ఉండటం వల్ల మీ ధమనులను నిరోధించేలా ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి సులువైన మార్గాలు.. గుండె ఆరోగ్యానికి సులువైన మార్గాలు..

4. చీజ్ కేక్ :

4. చీజ్ కేక్ :

మీరు బాగా ఇష్టమైన "చీజ్కేక్" జాగ్రత్తగా ఉండండి ! ఈ తీపి పదార్థంలో ఉండే కేలరీలు మరియు కొవ్వు, మీ హృదయానికి చాలా ప్రమాదకరమైనది. చీజ్ యొక్క చిన్న ముక్కలో 860 కేలరీలు, 57 గ్రాముల కొవ్వు మరియు 80 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి, దీనిని తినడానికి ముందు మరోసారి బాగా ఆలోచించండి.

5. స్టీక్ :

5. స్టీక్ :

స్టీక్లో అధిక మొత్తంలో ఉండే కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వు మీ గుండెను బలహీనంగా మారుస్తుంది. గొడ్డు మాంసంతో ఉన్న స్టీక్లో 594 కేలరీలు, 18.5 గ్రాముల కొవ్వు మరియు 191 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉన్నాయి మరియు మీరు దాన్ని ఉడికించిన తర్వాత ఆ మొత్తాలన్నీ రెట్టింపవుతాయి.

6. బర్గర్స్ :

6. బర్గర్స్ :

బర్గర్స్ అనేవి చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరి ఇష్టమైన ఆహారం. ఒకే ఒక్క బర్గెర్లో 29 గ్రాముల కొవ్వు, 540 గ్రాముల కేలరీలు మరియు 1040 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది, వీటిని పెద్ద పరిమాణంలో తింటితే మీ గుండెకు ప్రమాదకరంగా మారతుంది. మీరు బర్గర్ పరిమితంగా తీసుకోవడము (లేదా) ఇంట్లో తయారు చేసిన బర్గర్ను తినండి.

7. పిజ్జా :

7. పిజ్జా :

మీ గుండెకు హానికరమైన మరొక ప్రమాదకరమైన ఆహార పదార్ధము "పిజ్జా". ఇది సంతృప్త కొవ్వు మరియు సోడియంలలో 4.4 గ్రాముల మరియు 551 మిల్లీగ్రాములతో ఎక్కువగా ఉంటుంది. పిజ్జా క్రస్ట్లో కార్బోహైడ్రేట్లు, సోడియం; మరియు పిజ్జా సాస్లో సోడియం అధికంగా ఉంటుంది, ఇవి కొలెస్ట్రాల్ను పెంచి, మీ గుండెకు ముప్పును పెంచుతుంది.

8. చిప్స్ :

8. చిప్స్ :

మీరు ఆకలితో ఉన్నప్పుడే ఆ సాల్టెడ్ బంగాళాదుంప చిప్స్ కోసం ఎదురుచూస్తూ వుంటారు. కానీ ఈ సాల్టెడ్ చిప్స్లో 155 కేలరీలు, 10.6 గ్రాముల కొవ్వు మరియు 149 మిల్లీగ్రాముల సోడియం ఉన్నాయని మీకు తెలిస్తే చాలా ఆశ్చర్య పోతారు. దీనిని తినడం వల్ల, మీ శరీరంలో అనారోగ్యకరమైన బరువు పెరుగుటకు దారితీస్తుంది. తద్వారా మీ శరీర బరువులో మరికొన్ని పౌండ్లు అదనంగా పెరుగుతుంది.

9. బ్లెండెడ్ కాఫీలు :

9. బ్లెండెడ్ కాఫీలు :

ప్రసిద్ధమైన కాఫీ దుకాణాలలో లభించే బ్లెండెడ్ కాఫీలు మీ గుండెకు చాలా అనారోగ్యకరమైనవి. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? బ్లెండెడ్ కాఫీలు సిరప్, షుగరు, క్రీమ్ మరియు ఇతర టాపింగ్స్తో కూడిన పదార్ధాలు కేలరీలను, కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అధికం చేసి, మధుమేహం మరియు హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది.

10. ఫ్రెంచ్ ఫ్రైస్ :

10. ఫ్రెంచ్ ఫ్రైస్ :

ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా గుండె వ్యాధికి కారణమయ్యే ఆహార పదార్ధాలలో ఒకటి. వీటిలో అధికమైన పిండిపదార్థాలు, కొవ్వు మరియు సోడియంలతో పూర్తిగా నిండి ఉంటాయి, ఇవి మీ బ్లడ్ షుగర్ స్థాయిని పెంచేలా చేయవచ్చు. ప్రతి రోజు వీటిని తినే అలవాటును కలిగి ఉండటం వల్ల బరువు పెరుగుటమే కాక, ధమనులలో కొవ్వు కూడా పెరుగుతుంది, దీని వలన గుండె జబ్బులు కలుగుతాయి.

English summary

10 Foods Bad For Your Heart

Heart disease or cardiovascular disease occurs in both men and women. The symptoms in men are more likely to have shortness of breath, nausea, fatigue and chest pain. Certain foods which are high in saturated fat, sodium and cholesterol increase the risk of heart diseases and heart attack. Having too much of salt while eating food can also raise blood
Story first published:Thursday, February 15, 2018, 11:28 [IST]
Desktop Bottom Promotion