For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపులో అదనంగా ఉన్న యాసిడ్లను (ఆమ్లత్వమును) తగ్గించే 10 రకాల ఆహార పదార్థాలు !

|

మీరు భోజనము చేసిన తరువాత తరచుగా కడుపులోని ఆమ్లత్వం (యాసిడ్) తో బాధపడుతున్నారా? అవును అన్నట్లైతే, అప్పుడు మీరు కడుపులోని ఆమ్లత్వం (యాసిడ్) తగ్గించేందుకు దోహదపడే కొన్ని ఆహార పదార్ధాలను మీ భోజనంలో చేర్చాలి.

ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు పోషకాలను సంగ్రహించడానికి, శరీరాన్ని ఒక నిర్దిష్ట స్థాయి వరకూ కడుపులో ఆమ్లము అనేది అవసరం అవుతుంది. ఏదేమైనప్పటికీ, కడుపులో యాసిడ్ను ఎక్కువ స్థాయిలో కలిగి ఉండటం వల్ల, ఆ యాసిడ్ తిరిగి కడుపు నుండి అన్నవాహిక గుండా పైకి పాకుతుంది.

కొన్నిసార్లు, కడుపులో యాసిడ్ను కలిగి ఉండటం వల్ల కడుపులోని అల్సర్కు మరియు గుండెలో మంటను కలిగించడం వంటి ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది. దీనివల్ల అన్నవాహికలో అసౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి, కడుపులో ఆమ్లమును తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్ధాలను తినడం ద్వారా మీ కడుపులో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది.

సరైన రకమైన ఆహారాన్ని తినడం వల్ల కడుపులో ఆమ్లత్వమును నియంత్రించే ముఖ్యమైన ప్రధాన అంశము. కడుపులో అదనంగా ఉన్న యాసిడ్లను తొలగించే 10 రకాల ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. అదేమిటో మీరు కూడా చూడండి.

1. పాలు :

పాలు కాల్షియమును, మరియు ఆల్కలీన్ ఖనిజాలను కలిగి ఉంటుంది, ఇది కడుపులోని ఆమ్లమును తటస్థీకరించడానికి బాగా పనిచేస్తుంది. పాలు అధిక మొత్తంలో కాల్షియమును కలిగి ఉంటుంది, తద్వారా కడుపులో ఉన్న ఆమ్లాన్ని తగ్గిస్తుంది. మీరు కడుపులోని ఆమ్లత్వముతో బాధపడుతున్నట్లయితే, మీ కడుపుని ఉపశమనం చెయ్యడానికి ఒక గ్లాసు పాలను త్రాగండి.

2. హెర్బల్-టీ :

2. హెర్బల్-టీ :

"హెర్బల్-టీ" అనేది కడుపు ఉన్న ఆమ్లంపై సమర్థవంతంగా పోరాడటానికి అందుబాటులో ఉన్న వాటి కన్నా దీనినే ఉత్తమమైనదిగా పరిగణించబడుతున్నారు. ఇది మీ ప్రేగులను శాంతపరచి, మరింత ఆమ్లమును ఉత్పత్తి చెందకుండా తగ్గిస్తుంది. మీరు హెర్బల్-టీను త్రాగినప్పుడు, దానిని కొద్దిగా చల్లార్చి, కొద్దికొద్దిగా త్రాగుతూ ఉండటం వల్ల, ఇది మీ కడుపులో బాగా పనిచేస్తుంది.

3. అల్లం :

3. అల్లం :

అల్లంలో ఉన్న శోథ-నిరోధక లక్షణాలు తక్షణమే కడుపులో ఉన్న ఆమ్లమునకు ఉపశమనము కలిగించేదిగా ఉన్న మరో అద్భుతమైన అంశంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇది జీర్ణ సమస్యలను మరియు కడుపులో ఉన్న ఆమ్లతను మెరుగుపరచడానికి కావలసినంత సామర్థ్యాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో మీ కడుపు ఆమ్లత్వానికి గురైనప్పుడు పచ్చిఅల్లం ముక్కను నమలడానికి (లేదా) అల్లం టీ చేసుకుని త్రాగటానికి ప్రయత్నం చెయ్యండి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ (లేదా) ఆపిల్స్ అనేవి కడుపు ఆమ్లత్వానికి సమర్థవంతముగా నివారించే చికిత్స పద్ధతులుగా విస్తృతంగా ఆచరించబడుతున్నాయి. ప్రకృతిలో ఆమ్లసంబంధమైనదిగా ఆపిల్స్ ఉన్నప్పటికీ, అవి మీ శరీరం లోపల కడుపులో ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరణము చేయడానికి సహాయపడే ఆరోగ్యకరమైన ఆమ్లాలను మరియు ఎంజైమ్లను కలిగి ఉంటాయి.

5. ఆకుపచ్చని కూరగాయలు :

5. ఆకుపచ్చని కూరగాయలు :

ముదురు రంగులో ఉన్న ఆకుపచ్చని కూరగాయలను ఎంపిక చేసుకొని, స్మూతీలను తయారు చేయండి. మీకు కావలసిన అన్ని రకాల అనామ్లజనకాలను మరియు పోషకాలను ఆ స్మూతీల నుండి పొందుతారు మరియు త్వరగా కడుపులోని ఆమ్లమును తగ్గిస్తుంది. ఆకుపచ్చని పానీయాలు (రసాలు) శరీరంలో ఉన్న వాపులను నివారించడంలో సహాయకంగా ఉంటూ, అది కడుపులో ఉన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. మీరు కూడా భోజనం ముందు ఆకుపచ్చని స్మూతీస్ను త్రాగడానికి ప్రయత్నం చేయవచ్చు.

6. ఓట్-మీల్ :

6. ఓట్-మీల్ :

ఓట్-మీల్ అనేది చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. మొత్తం ఓట్-మీల్ ధాన్యంలో ఫైబర్ను గొప్ప మోతాదులో కలిగి ఉండి, ఇది కడుపులో ఉన్న ఆమ్లాన్ని గ్రహిస్తుంది మరియు ఇది ఆమ్లత్వ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఫైబర్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది, ప్రేగులు ఆరోగ్యంగా ఉండేటట్లుగా ప్రోత్సహిస్తుంది మరియు శరీరాన్ని ఎక్కువ కాలం పాటు శక్తివంతంగా ఉంచుతుంది.

7. అలో-వేరా :

7. అలో-వేరా :

కలబంద (అలో-వేరా) అనేది సహజమైన శీతలీకరణమును కలిగిన అద్భుతమైన ఏజెంట్గా ఉంటూ, ఇది గుండెలో మంటను (హార్ట్ బర్న్స్) మరియు కడుపులో ఉన్న ఆమ్లమునకు చికిత్సను అందించగలిగే సామర్ధ్యమును కలిగి ఉంటుంది. దీనిలో స్వస్థతను కలుగచేసే లక్షణాలను కలిగి ఉండటం వల్ల, దీనిని తిన్నా వెంటనే కడుపులో ఉన్న ఆమ్లత్వం తగ్గించే ఉపయోగకారిగా ఉంటుంది. కలబంద (అలో-వేరా) రసాన్ని (లేదా) కలబందను ఆహారంలో ఉపయోగించడం వల్ల కడుపులో ఉన్న ఆమ్లత్వాన్ని నిరోధించడానికి బాగా సహకరిస్తుంది.

8. పచ్చి ఆకుకూరలతో చేసిన సలాడ్ :

8. పచ్చి ఆకుకూరలతో చేసిన సలాడ్ :

ఈ రకమైన సలాడ్లు సహజంగానే ఆల్కలీన్లను కలిగి, పూర్తి జీర్ణం చేసే ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ సలాడ్లు కడుపులో వాపును మరియు ఆమ్లత్వమును నివారిస్తాయి. ఎందుకంటే ఇందులో ఆకుకూరలు, క్యారట్లు, దోసకాయలు, సెలెరీ, తోటకూర, మరియు పాలకూర వంటి అత్యంత శక్తివంతమైన ఆహార పదార్థాలను ఒక భాగమై ఉండటం వల్ల వాపులను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.

9. ఆలివ్ ఆయిల్ :

9. ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ నూనె, గుండెల్లో మంటను మరియు అజీర్ణానికి బాగా సహాయ పడటమే కాకుండా, యాంటి ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను కూడా మనకు అందిస్తుంది. ఆలివ్ ఆయిల్తో వంటలను వండటానికి బదులుగా మనం తీసుకొనే ఆహారంపై చల్లడం మంచిది. ఆవ నూనెను, వేరుశనగ నూనెను, మరియు ఇతర కూరగాయల ఆధారిత నూనెలను ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే ఇవి సహజంగానే మరింత ఆమ్లత్వమును కలిగి ఉంటాయి.

10. చికెన్ :

10. చికెన్ :

కడుపులో వున్న ఆమ్లత్వాన్ని నివారించడంలో వ్యతిరేకంగా సహాయపడే ప్రోటీన్లను చికెన్ కలిగి ఉండటం వల్ల, దానిని తినడం చాలా మంచిది అంతేగాని చికెన్ ఆమ్లానికి దోహదపడేది మాత్రం కాదు. పెనంలో చికెన్ ముక్కలను వేసి బాగా ప్రై చెయ్యడం (వేపడం) మరియు రుచికోసం వాటిపై అనేక రకాల సుగంధాలను చల్లడం వంటి పద్ధతులను మానుకోవాలి. చికిన్ లో ఉపయోగించబడే మసాలా దినుసులు మీ కడుపులో ఆమ్లత్వమును పెంచుతాయి మరియు మిమ్మల్ని అనుకూలంగా లేనట్లుగా ఉంచుతుంది.

English summary

10 Foods That Reduce Excess Stomach Acid

Stomach acid to a certain level is required to digest the food and allow the body to absorb nutrients. However, too much of stomach acidity occurs when there is acid backflow from the stomach into the oesophagus. Sometimes, stomach acidity can cause other problems too like stomach ulcers and heartburn. This causes a discomfort in the oesophagus. Incorporating certain foods
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more