For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవాయిడ్ చేయవలసిన 10 హై కొలెస్ట్రాల్ ఫుడ్స్

|

కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ లోని ఫ్యాటీ సెల్స్ లో లభించే వాక్స్ వంటి పదార్థం. ఆరోగ్యకరమైన టిష్యూస్ నిర్మాణానికి అలాగే వాటి నిర్వహణకు మంచి కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరపడుతుంది. అయితే బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా లభించినప్పుడు బ్లడ్ ఫ్లో కి అవరోధం ఏర్పడవచ్చు. తద్వారా, గుండె వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా కలదు.

సరైన ఆహారనియమాలను అలాగే సరైన జీవనశైలిని పాటించకపోవడం వలన బ్లడ్ లోని కొలెస్ట్రాల్ స్థాయి అధికమవుతుంది. రోజుకు 300 గ్రాములకు మించిన కొలెస్ట్రాల్ ను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులంటున్నారు. ప్రాపర్ బాలన్సుడ్ డైట్ ను తీసుకుంటున్నప్పుడు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) ఉత్పత్తి అవుతుంది.

హై కొలెస్ట్రాల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి హైపెర్టెన్షన్, డయాబెటీస్, హార్ట్ ఎటాక్ మరియు అథెరోస్కలేరోసిస్ అని గుర్తించడం అవసరం.

ఇక్కడ హై కొలెస్ట్రాల్ కలిగిన ఇండియన్ ఫుడ్స్ జాబితాను పొందుబరిచాము. వీటిని అవాయిడ్ చేస్తే హై కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఆస్కారం ఉంది.

10 High Cholesterol Foods To Avoid

1. షెల్ ఫిష్:

లాబ్స్టర్స్, ప్రాన్స్ వంటి షెల్ ఫిష్ లను సాధ్యమైనంత అవాయిడ్ చేయాలి. వీటిలో కొలెస్ట్రాల్ అధికమొత్తంలో లభిస్తుంది. వీటి ఫ్లేవర్ ని పెంపొందించేందుకు వీటిని వండేటప్పుడు వెన్నను అధికంగా వాడతారు. గుండె వ్యాధులతో ఇబ్బందిపడేవారు ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి.

2. వెన్న మరియు నెయ్యి:

2. వెన్న మరియు నెయ్యి:

ప్రొసెస్డ్ బటర్ ని తీసుకోవడం తగ్గించాలి. ఇందులో సోడియంతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ లోడై ఉంటాయి. వీటివలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే అధికరక్తపోటు సమస్య కూడా వేధించవచ్చు. దీనికి బదులు మితంగా దేశవాళీ నెయ్యిని తీసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా.

3. రెడ్ మీట్:

3. రెడ్ మీట్:

శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి రెడ్ మీట్ లో లభిస్తాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. దీనికి బదులు చికెన్ బ్రెస్ట్ ని లేదా ఫిష్ ని ఎంచుకోండి. వీటిలో కొలెస్ట్రాల్ తక్కువగా లభ్యమవుతుంది. అలాగే, ఫ్రోజెన్ మీట్ ని మరియు సాసేజెస్, కోల్డ్ కట్స్ మరియు బేకన్ వంటి ప్రొసెస్డ్ మీట్ ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే, ఇవి కొలెస్ట్రాల్ ని పెంపొందిస్తాయి.

4. ఫాస్ట్ ఫుడ్స్:

4. ఫాస్ట్ ఫుడ్స్:

పిజ్జా, ఛీజ్, బిస్కట్, బర్గర్స్ మరియు చిప్స్ వంటి వాటిలో కొలెస్ట్రాల్ అధికంగా లభ్యమవుతుంది. ఈ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ లభిస్తాయి. వీటివలన బ్లడ్ లో బాడ్ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కుకీస్, కేస్, ఫ్రైస్ మరియు పొటాటో చిప్స్ లో హైడ్రోజినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

5. ఛీజ్:

5. ఛీజ్:

కేల్షియం మరియు ప్రోటీన్ అనేవి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఇందులో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల ఛీజ్ లో దాదాపు 123 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభ్యమవుతుంది. మీరు గనుక ఛీజ్ లవర్ అయితే మితంగా దీనిని తీసుకోవాలి.

6. ఐస్ క్రీమ్:

6. ఐస్ క్రీమ్:

అన్ని వయసులవారికీ ఐస్ క్రీమ్ అంటే మనసు కరిగిపోతుంది. అయితే హై కొలెస్ట్రాల్ లెవల్ కలిగిన వారు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. హైడ్రోజినేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ మరియు ఫుల్ ఫ్యాట్ మిల్క్తో ఐస్ క్రీమ్స్ ని తయారుచేస్తారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కొలెస్టరాల్ లెవల్స్ పెరుగుతాయి.

7. బీఫ్ లివర్:

7. బీఫ్ లివర్:

100 గ్రాముల మీట్ లివర్ లో దాదాపు 564 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభ్యమవుతుంది. బీఫ్ లివర్ లో దాదాపు 331 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభ్యమవుతుంది. కాబట్టి, బీఫ్ లివర్ ని తీసుకోవడం తగ్గించండి. లేదంటే, బ్లడ్ లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యం పాడవుతుంది.

8. ఆల్కహాల్:

8. ఆల్కహాల్:

ఆల్కహాల్ ని తీసుకోవడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. దీని వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. గుండెసమస్యలు ఎదురవుతాయి. ఆల్కహాల్ ని మితంగా తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం తగ్గుతుంది.

9. రిఫైండ్ గ్రైన్ ప్రోడక్ట్స్:

9. రిఫైండ్ గ్రైన్ ప్రోడక్ట్స్:

వైట్ బ్రెడ్, బేజిల్స్, పాస్తా మరియు టార్టిల్లాలలో రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ లభ్యమవుతాయి. ఈ ఫుడ్స్ వలన రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. ఇవి క్రమంగా ఆర్టరీలను బ్లాక్ చేస్తాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవడం తగ్గిస్తే కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

10. కేనోలా ఆయిల్:

10. కేనోలా ఆయిల్:

కేనోలా ఆయిల్ అనేది హైడ్రోజినేటెడ్ ఆయిల్. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకున్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. కేనోలా ఆయిల్ ను అవాయిడ్ చేయండి. అలాగే కార్న్ ఆయిల్ మరియు సొయా ఆయిల్ ను కూడా అవాయిడ్ చేస్తే కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

English summary

10 High Cholesterol Foods To Avoid

High cholesterol in the blood is mostly caused by poor diet choices and a bad lifestyle. Health experts suggest that one should not consume more than 300 grams of cholesterol per day. Good cholesterol (HDL) in the body is produced when you are on a proper balanced diet. The risk factors for high cholesterol could lead to hypertension, diabetes, kidney problems, etc.
Story first published:Tuesday, February 20, 2018, 15:56 [IST]
Desktop Bottom Promotion