For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దప్రేగు క్యాన్సర్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు

మార్చి నెలను జాతీయ కోలోరెక్టల్ క్యాన్సర్ ఎవేర్ నెస్ మంత్ గా జరుపుకుంటారు. ఇందులో భాగంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో పోరాడి బ్రతికిన వేలాదిమంది పేషేంట్లు, వారి సంరక్షకులు ఒకచోట కలిసి, కోలోన్ క్యాన్సర్ కమ

|

మార్చి నెలను జాతీయ కోలోరెక్టల్ క్యాన్సర్ ఎవేర్ నెస్ మంత్ గా జరుపుకుంటారు. ఇందులో భాగంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో పోరాడి బ్రతికిన వేలాదిమంది పేషేంట్లు, వారి సంరక్షకులు ఒకచోట కలిసి, కోలోన్ క్యాన్సర్ కమ్యూనిటీకి ముఖ్య ఉద్దేశంగా మారిన పెద్ద ప్రేగు క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన పెంచుతారు.

యునైటడ్ స్టేట్'స్ లో మరణాలకి రెండవ అతిపెద్ద కారణంగా మారిన పెద్ద ప్రేగు క్యాన్సర్ లేదా పెద్ద ప్రేగు మలద్వార క్యాన్సర్ స్త్రీ పురుషులిద్దరిలో వస్తుంది. 2015లో అమెరికాలో 93,090 కొత్త కేసులు దీనివే నమోదయ్యాయి. పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో పెద్ద ప్రేగు క్యాన్సర్ మూడవస్థానంలో ఉండగా, స్త్రీలలో రెండవస్థానంలో ఉంది.

అయితే, ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ అంటే ఏమిటి? అది మొదటగా పెద్ద ప్రేగు, మలద్వారంలో అన్నిటికన్నా లోపలి పొర నుంచి మొదలయ్యి, అన్ని కణజాలాల పొరలకు వ్యాపిస్తుంది.

ఈ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పెద్ద ప్రేగు క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని ముఖ్య నిజాలు కూడా తెలుసుకుందాం. చదవండి.

1.ప్రజలకి దీని లక్షణాల గురించి అవగాహన లేదు

1.ప్రజలకి దీని లక్షణాల గురించి అవగాహన లేదు

ఎవరికైనా పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించబడితే, వారు బ్రతకగలిగే అవకాశం ఎక్కువ అవుతుంది. కానీ ఆశ్చర్యకరంగా, అసాధారణ కణాలు, కొత్త పాలిప్ గడ్డలు పెద్ద ప్రేగు క్యాన్సర్ గా మారటానికి 10-15 ఏళ్ళ సమయం పడుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సలహా ప్రకారం 50 ఏళ్ళ వయస్సు నుంచి క్రమంగా ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి, అలాగే కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారు తప్పక ముందు డాక్టర్ ను సంప్రదించాలి.

2.పెద్ద ప్రేగు క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది

2.పెద్ద ప్రేగు క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, పెద్ద ప్రేగు క్యాన్సర్ తో అకాలంగా చనిపోయినవారిలో సగం మంది చావులు జాతి,వారుండే ప్రదేశం, వారి చదువులో అసమానత్వం వలన వస్తున్నాయి. పరిశోధనల ప్రకారం మైనారిటీ జాతులకి చెందినవారికి పెద్ద ప్రేగు క్యాన్సర్ విషయంలో ఎక్కువ చావులు సంభవిస్తున్నాయి. కొన్ని జాతులకైతే ఈ ఫలితాలు మరీ దారుణంగా ఉన్నాయి.

3.మీ డాక్టర్ లక్షణాలను గుర్తించలేకపోవచ్చు

3.మీ డాక్టర్ లక్షణాలను గుర్తించలేకపోవచ్చు

మీలో పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలు కన్పించి మీరు గుర్తించినా కూడా, మీకు మరేదో అనారోగ్యం ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించవచ్చు. 2014 పరిశోధన ప్రకారం ప్రతి 20 అమెరికన్ పౌరుల్లో 1రికి ఈ తప్పు వ్యాధి నిర్థారణ జరుగుతోందని తేలింది. పరిశోధనల ప్రకారం వ్యాధి తెలుసుకోటానికి ఇన్నిరకాల పద్ధతులు ఉండటం వల్ల వివిధ రకాల ఫలితాలు వచ్చి డాక్టర్ ఆ ఫలితాలను వేరేలాగా అర్థం చేసుకోవచ్చు. అందుకని రెండవ డాక్టర్ అభిప్రాయం తెలుసుకోటం చాలామంచిది.

4.టైప్ 2 డయాబెటిస్ మీ రిస్క్ ను మరింత పెంచుతుంది

4.టైప్ 2 డయాబెటిస్ మీ రిస్క్ ను మరింత పెంచుతుంది

ఎవరికైనా ప్రేగులు వాచి మలమూత్రాలకి ఇబ్బంది అవుతుంటే లేదా టైప్ 2 డయాబెటిస్ ఉంటే, అతను / ఆమెకి పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మీకు తెలుసా?ఎందుకంటే ఈ వాచిన ప్రేగు సమస్యలో క్రాన్స్ వ్యాధి, ఇంకా అల్సర్ తో కూడిన కోలిటిస్ కూడా కలిపి వస్తాయి. ఈ రెండు స్థితులే పెద్ద ప్రేగు తీవ్రంగా వాచటానికి కారణమవుతాయి.

5. అన్నిటికన్నా పెద్ద రిస్క్ కారణం వయస్సు

5. అన్నిటికన్నా పెద్ద రిస్క్ కారణం వయస్సు

మీకు స్త్రీ పురుషులిద్దరిలో 90శాతం పెద్ద ప్రేగు క్యాన్సర్లు 50ఏళ్ళ వయస్సు పైబడినవారిలో వస్తాయని తెలుసా?ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ రిస్క్ వయస్సుతో పాటు పెరుగుతుంది. కానీ చిన్నవయస్సు వారికి కూడా ఈ క్యాన్సర్ రావచ్చు.

6.జీవనశైలి కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతోంది

6.జీవనశైలి కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతోంది

రోజువారీ జీవితంలో మీ జీవనశైలి ఎంపికలు కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ రిస్క్ ను పెంచవచ్చు. పొగతాగడం వలన పెద్ద ప్రేగు క్యాన్సర్ తో చనిపోయే రిస్క్ 14 శాతం పెరిగితే, స్థూలకాయం వలన పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చి చనిపోయే అవకాశం 30 శాతం పెరుగుతుంది.

ఇతర కారణాలలో ఎక్కువగా తాగటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువ ఎర్ర మాంసం, ప్రాసెస్ చేయబడిన మాంసం తినటం కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.

7.కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమే

7.కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమే

తమ దగ్గరి కుటుంబంలో (తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు లేదా తమ పిల్లలు) ఎవరికైనా పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉన్నట్లయితే, వారికి కూడా ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. పాలిప్స్ కుటుంబ చరిత్రలో ఉండటం,అది కూడా పెద్ద సైజు లేదా అవి చాలానే ఉండటం వలన మీరు తీవ్ర రిస్క్ జోన్ లోకి చేరతారు.

8.ప్రాథమికంగా ఎలాంటి వార్నింగ్ లక్షణాలు కన్పించవు

8.ప్రాథమికంగా ఎలాంటి వార్నింగ్ లక్షణాలు కన్పించవు

గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాగానే, పెద్ద ప్రేగు క్యాన్సర్ ను కూడా మొదటిదశల్లో గుర్తించడం చాలా కష్టం. మలమూత్రాల అలవాట్లు మారడం, డయేరియా, మలంలో రక్తం, మలబద్ధకం, తరచుగా గ్యాస్ నొప్పి, ఒళ్ళు నెప్పులు, బరువు తగ్గిపోవటం, ఉబ్బరం వంటి లక్షణాలను మీరు చూసీచూడనట్లు వదిలేయవద్దు.

9.పరీక్షించే విధానాలు వేర్వేరుగా చాలానే ఉన్నాయి

9.పరీక్షించే విధానాలు వేర్వేరుగా చాలానే ఉన్నాయి

దీన్ని పరీక్షించడానికి, పరిశీలించడానికి కొలొనోస్కోపీ, సిగ్మాయిడ్ స్కోపీ, బేరియం ఎనెమా, సిటి కోలోనోగ్రఫీ లేదా వర్చువల్ కోలోనోస్కోపి, ఇంకా ఇంట్లోనే చేసుకునే ఫీకల్ ఇమ్యూన్ టెస్టింగ్ లేదా స్టూల్ జీన్ టెస్టింగ్ వంటి చాలా రకాల పద్దతులు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద ప్రేగు క్యాన్సర్ ను కనుగొంటాయి. మీ డాక్టర్ తో మాట్లాడి మీ జీవనవిధానం, వయస్సు, కుటుంబ చరిత్రని బట్టి మీకు ఏ రకమైన పరీక్ష సరైనదో కనుక్కోండి.

10.క్రమపద్దతిలో పరీక్షలతో పెద్ద ప్రేగు క్యాన్సర్ నివారించగలిగినదే

10.క్రమపద్దతిలో పరీక్షలతో పెద్ద ప్రేగు క్యాన్సర్ నివారించగలిగినదే

క్రమపద్ధతిలో పరీక్షలు చేయించుకోవడం వలన అదనపు కణజాలాల పాలిప్స్, క్యాన్సర్ గా మారకముందే గుర్తించి, తీసేసి పెద్ద ప్రేగు క్యాన్సర్ నుంచి చాలామంది జీవితాలను రక్షించుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ పరీక్షలు పెద్ద ప్రేగు క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తాయి, అలా చికిత్స కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

English summary

10 Important Facts About Colon Cancer You Should Know

Colon cancer occurs in the large intestine and is also called colorectal cancer. It is the third and second most leading cause of cancer in men and women, respectively. There are interesting facts of colon cancer like many people are not aware of the signs, your doctor may miss the signs, bad lifestyle choices, etc.
Story first published:Tuesday, March 6, 2018, 14:31 [IST]
Desktop Bottom Promotion